BigTV English

Kidney Racket : ఏపీలో మరో కిడ్నీ రాకెట్.. విజయవాడ కేంద్రంగా దందా..

Kidney Racket : ఏపీలో మరో కిడ్నీ రాకెట్.. విజయవాడ కేంద్రంగా దందా..
Kidney Racket


Kidney Racket : బెజవాడలో మరోసారి కిడ్నీ స్కామ్ కలకలం రేపింది. విశాఖ కిడ్నీ రాకెట్ ఘటన మర్చిపోకముందే మరో కిడ్నీ రాకెట్ వ్యవహారం బయటపడింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే.. ఏపీలో కిడ్నీలను ఇడ్లిల్లా అమ్మేస్తున్నారనిపిస్తోంది. కోట్లు సంపాదించవచ్చంటూ ఆశ చూపి పేదలను బలవంతంగా కిడ్నీ రాకెట్ మాఫియాలోకి లాగుతున్నారు. విజయవాడ కేంద్రంగా సాగుతున్న
అక్రమ కిడ్నీ మార్పిడి వ్యవహారం పేదలను బలి పశువులను చేస్తుంది.

నాగ సత్యవతి అనే మహిళకు కిడ్నీ మార్పిడికి కొందరు ప్రయత్నించారు. ఇందుకోసం భవానీపురానికి చెందిన మహిళకు 8 లక్షలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు ఇష్టపూర్వకంగా కిడ్నీ ఇచ్చేలా ప్లాన్ చేశారు. కిడ్నీ మార్పిడీ కోసం సర్టిఫికెట్లతో పశ్చిమ ఎమ్మార్వోను కిడ్నీ ముఠా ఆశ్రయించింది. అయితే ఎమ్మార్వో లక్ష్మి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారు. దీంతో అవి ఫేక్ సర్టిఫికెట్లు అని ఆమె గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు మరో కిడ్నీ రాకెట్‌ను వెలుగులోకి తీసుకొచ్చారు.


పోలీసులకు వరుసగా 2 ఫిర్యాదులు అందగా.. ఇప్పటికే ఒక కేసులో నలుగురిపై కేసు నమోదు చేశారు. శుక్రవారం మరో ఫిర్యాదు వచ్చింది. తహశీల్దార్ లక్ష్మీ పోలీసులకు రెండు ఫిర్యాదులు చేశారు.
కిడ్నీ మార్పిడి కోసం అప్లికేషన్లు వచ్చాయని.. అప్లికేషన్ విచారణలో ఆర్థిక లావాదేవీలు జరిగాయని గుర్తించామన్నారు ఎమ్మార్వో. ఈ నెల 26న మొదటి అప్లికేషన్‌ రాగా.. శుక్రవారం మరో అప్లికేషన్‌ వచ్చిందన్నారు. విచారణలో ఈ రెండు అప్లికేషన్లు విచారిస్తే నకిలీ అని తేలిందన్నారు. వీటిపై విచారణ కోసం వెళ్తే ఆధార్లో , పాన్ కార్డుల్లో మార్పులు చేసినట్లు గుర్తించామన్నారు. రెండు పాన్ కార్డులు, నాలుగు ఆధార్ కార్డులు కిడ్నీ మార్పిడి కోసం రెడీ చేసిన 4 దరఖాస్తులను స్వాధీనం చేసుకున్నామని.. 26న చిన్నా అనే పేద మహిళకు డబ్బు ఆశ చూపి మధ్యవర్తి కిడ్నీ మార్పిడి కోసం ప్రయత్నం చేసినట్టు విచారణలో తేలింది. ఇక తాజాగా వచ్చిన అప్లికేషన్లో రక్తసంబదీకులకు కిడ్నీ దానం చేస్తున్నట్లు దరఖాస్తు చేసినట్టు తేలిందన్నారు. నాలుగు నెలల వ్యవధిలో జరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో కిడ్నీ మార్పిడి ప్రక్రియ మొత్తం పూర్తయిన తర్వాత ఆర్థిక లావాదేవీల వ్యవహారంలోని తేడాలు రావడంతో కొన్ని ముఠాలు వెలుగులోకి వస్తున్నాయి.

కిడ్నీ రాకెట్ వ్యవహారం వెనుక సమిధులుగా మారుతుంది రోజువారీ కూలీలు,పేదలు, ఆర్థిక ఇబ్బందులతో జీవితాన్ని నెట్టుకొస్తున్న వాళ్లే అన్నది మరోసారి బట్టబయలైంది. విజయవాడ భవానీపురంకు చెందిన చిన్ని అనే మహిళ రోజువారి కూలీ పనులు చేసుకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉంది. ఆమె ఇంటి దగ్గర నివసించే ఓ మహిళా కిడ్నీ ఇవ్వాలంటూ.. అందుకు లక్షల రూపాయలు ఇస్తారంటూ ఆశ చూపింది. పేదరికంతో మగ్గుతున్న చిన్ని కుటుంబం ఆశ చూపిన 7 లక్ష రూపాయలకు కిడ్నీ ఇచ్చేందుకు సన్నద్ధమయింది. అయితే కిడ్నీ మార్పిడి కోసం లీగల్ గా చాలా ప్రొసీడింగ్స్ క్లియర్ చేయాల్సి ఉంటుంది. అందుకే రెవెన్యూ అధికారులకు కిడ్నీ తీసుకుంటున్న వ్యక్తి తమ బంధువని వరుసకు సోదరుడు అవుతాడు అంటూ అనుమతి కోసం NOC ఇవ్వాలంటూ అప్లై చేశారు. అయితే విచారణలో అసలు బంధుత్వమే లేదని తేలడంతో అక్రమ కిడ్నీ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

కిడ్ని ఇచ్చేందుకు సిద్ధమైన వారితోపాటు.. తీసుకునే వారిని పోలీసులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో మధ్యవర్తిగా వ్యవహరించిన మహిళ కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. అయితే పలు ఘటనల్లో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారు సేఫ్‌గా బయటపడుతుండగా.. కిడ్నీ ఇచ్చిన వారు, తీసుకున్న వారు కటకటాల పాలవుతున్నారు. మొత్తానికి బెజవాడ వేదికగా ఇటీవల బయటపడుతున్న అక్రమ కిడ్నీ రాకెట్ వ్యవహారాలు ఆందోళన కలిగిస్తున్నాయి.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×