BigTV English

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా మారే హౌజ్ వైఫ్… పోలీసుల నుంచి పొలిటీషియన్స్ వరకు అందరికీ చుక్కలే

OTT Movie : గ్యాంగ్ స్టర్ గా మారే హౌజ్ వైఫ్… పోలీసుల నుంచి పొలిటీషియన్స్ వరకు అందరికీ చుక్కలే

OTT Movie : అదిరిపోయే పొలిటికల్ థ్రిల్లర్ అనగానే స్టార్ హీరోలు నటించిన సినిమాలు లేదా పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్స్ బయోపిక్స్ కళ్ళ ముందు కదులుతాయి. కానీ అదే ఓ మహిళ పొలిటీషియన్, గ్యాంగ్ లీడర్ అయితే ఎలా ఉంటుంది? ఊహించడం కష్టమే కదా. ఓ డైరెక్టర్ మాత్రం ఈ క్రేజీ థాట్ తో ఓ సినిమాను తెరకెక్కించాడు. ఆ మూవీ ఏ ఓటీటీలో ఉంది? అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి.


కథలోకి వెళ్తే…
కథ 1980లలో బెంగాల్‌లోని షిబ్‌పూర్ ప్రాంతంలో, హౌరా జిల్లాలో జరుగుతుంది. ఇది కోల్‌కతాకు సమీపంలో ఉంది. ఆ సమయంలో గ్యాంగ్‌స్టర్ హింస, రాజకీయ అస్థిరతకు కేంద్రంగా ఉంటుంది ఆ జిల్లా. కథను ఒక రాజకీయ జర్నలిస్ట్ (సుస్మితా చటర్జీ) దృష్టికోణం నుంచి ప్రేక్షకులకు చెప్పే ప్రయత్నం చేశారు మేకర్స్. ఆమె 1980లలో సాధారణ గృహిణి నుండి మహిళా గ్యాంగ్‌స్టర్‌గా మారిన మందిరా (స్వస్తికా ముఖర్జీ) గురించి ఒక కథను కనుగొంటుంది. మందిరా 1990ల చివరలో మిస్టీరియస్ గా మాయం అవుతుంది.

మందిరా భర్త హానెస్ట్ ప్రభుత్వ అధికారి. స్థానిక గ్యాంగ్‌స్టర్ నేపాల్ భట్టాచార్య (రజతావ దత్తా) ఒత్తిడికి లొంగనందుకు ఆమె కళ్లముందే అతన్ని హత్య చేస్తారు. పోలీసులు, న్యాయవ్యవస్థ నుండి న్యాయం దొరకకపోవడంతో మందిరా… నేపాల్‌కు ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్ తపన్ బారిక్ (ఖరాజ్ ముఖర్జీ) సహాయం తీసుకుంటుంది. తపన్ అండర్ లో ఉన్న చేపల మార్కెట్‌తో షిబ్‌పూర్‌లో గ్యాంగ్ వార్‌లు ఊహించని రేంజ్ లో జరుగుతాయి. మందిరా క్రమంగా ఒక శక్తివంతమైన గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతుంది, ఆమె భర్త హత్యకు ప్రతీకారం తీర్చుకుంటూ, షిబ్‌పూర్‌లో తన హవా చాటుతుంది.


ఈ హింసాత్మక పరిస్థితిని అదుపు చేయడానికి, అప్పటి ముఖ్యమంత్రి (సుజన్ ముఖోపాధ్యాయ) ఐపీఎస్ అధికారి సుల్తాన్ అహ్మద్ (పరంబ్రతా చటర్జీ)ని హౌరా జిల్లా ఎస్పీగా నియమిస్తారు. సుల్తాన్ మందిరాతో పాటు ఇతర గ్యాంగ్‌స్టర్‌లను టార్గెట్ చేస్తాడు. కానీ మందిరా మిస్ అవ్వడంతో ఆయనకు అప్పజెప్పిన పని కష్టం అవుతుంది. ఇంతకీ మందిరా ఎలా మాయమైంది? ఎక్కడికి వెళ్ళింది? చివరగా వచ్చే ఆ ఊహించని క్లైమాక్స్ ఏంటి? అనేది చూసి తెలుసుకోవాల్సిందే.

Read also : పుర్రెలో నిధి రహస్యం … పజిల్ తో పరుగులు పెట్టించే అడ్వెంచర్ మూవీ

ఏ ఓటీటీలో ఉందంటే?
2023లో బెంగాలీ భాషలో విడుదలైన పొలిటికల్ గ్యాంగ్ స్టర్ థ్రిల్లర్ డ్రామా ‘షిబ్‌పూర్’ (Shibpur). అరిందమ్ భట్టాచార్య దర్శకత్వంలో, అజంత సిన్హా రాయ్ నిర్మాణంలో రూపొందింది. ఈ చిత్రంలో పరంబ్రతా చటర్జీ, స్వస్తికా ముఖర్జీ, మమతా శంకర్, ఖరాజ్ ముఖర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఇది 2023 జూన్ 30న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ ప్రస్తుతం Amazon Prime Videoలో అందుబాటులో ఉంది.

Related News

OTT Movies : ఈ వారం ఓటీటీలోకి 30 సినిమాలు.. మూవీ లవర్స్ కు పండగే..

OTT Movie : ఓటీటీలో దూసుకుపోతున్న సరికొత్త లవ్ స్టోరీ … సత్యదేవ్ వన్ మ్యాన్ షో … ఇందులో అంతగా ఏముందంటే ?

OTT Movie : ఈయన అలాంటి ఇలాంటి డాక్టర్ కాదులే … చేయిపడితే బెడ్ మీద గుర్రం సకిలించాల్సిందే …

OTT Movie : ‘జంబలకడి పంబ’ ను గుర్తు చేసే వెబ్ సిరీస్ … పొట్టచెక్కలయ్యే కామెడీ … ఫ్రీగానే చూడొచ్చు

OTT Movie : బాస్ తో హద్దులు మీరే యవ్వారం … పెళ్లి బట్టలతో కూడా వదలకుండా … ఒంటరిగా చూడాల్సిన సినిమా

OTT Movie : 70 ఏళ్ల వృద్ధుడికి థాయ్ మసాజ్ … రష్యన్ అమ్మాయితో రంగీలా డాన్స్ …

Big Stories

×