E-Paper
Advertisement

ఈడీ స్టేట్‌మెంట్.. లెక్కచూపని రూ. 24 లక్షలు సీజ్, ఎంపీ అవినాష్ ఇళ్లపై సోదాలు, అర్ధరాత్రి వరకు మంతనాలు?

ఈడీ స్టేట్‌మెంట్.. లెక్కచూపని రూ. 24 లక్షలు సీజ్, ఎంపీ అవినాష్ ఇళ్లపై సోదాలు, అర్ధరాత్రి వరకు మంతనాలు?
Advertisement

Amaravati: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఎంట్రీ ఇచ్చేసింది. శుక్రవారం చేసిన సోదాలపై ఈడీ ప్రకటన చేసింది. ఎంపీ అవినాష్‌‌రెడ్డి ఇంట్లో లెక్క చూపని రూ.24 లక్షల నగదును సీజ్‌ చేసినట్టు తెలిపింది. అంతేకాదు రెండు లాకర్ల తాళాలను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. సోదాల్లో డిజిటల్-ఆర్థిక ఆధారాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.

 

సోదాలపై ఈడీ ప్రకటన

Advertisement

కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, మరికొందరి నివాసాల్లో శుక్రవారం సోదాలు చేపట్టింది ఈడీ. ఈ సోదాల్లో లెక్కల్లో చూపని రూ. 24 లక్షల నగదు సీజ్ చేసింది. అంతేకాదు రెండు లాకర్ల తాళాలు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి ఈ సోదాలు చేపట్టినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

 

రూ. 24 లక్షలు క్యాష్, రెండు లాకర్లు స్వాధీనం

Advertisement

ఈ కేసుకు సంబంధించి CBI దాఖలు చేసిన మూడు ఛార్జిషీట్లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, గతేడాది ఈడీ మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ఈడీ ప్రకటనపై ఎంపీ అవినాష్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇంతకీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో నగదు మాటేంటి? దానికి సంబంధించి ఎందుకు లెక్కలు చూపలేకపోయారు? రెండు లాకర్ల తాళాలు ఎలా లభ్యమయ్యాయి? ఇవే ప్రశ్నలు వైసీపీ పెద్దలను వెంటాడుతున్నాయి.

 

అర్ధరాత్రి వరకు మంతనాలు?

ఈడీ సోదాలపై వైసీపీ కీలక పెద్దలు అర్ధరాత్రి వరకు చర్చించినట్టు పార్టీ వర్గాల మాట. ఈడీ సోదాలపై సైలెంట్‌గా ఉండడం బెటరని, దీన్ని అధికార పార్టీపై నెట్టివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈడీ తీసుకెళ్లిన లాకర్ల గురించి అవినాష్ కుటుంబసభ్యుల మధ్య చిన్నపాటి చర్చ జరిగినట్టు వార్తలు షికార్లు చేస్తున్నాయి. అందులో విలువైన పత్రాలు ఉండవచ్చని అంటున్నారు. ఈ కేసులో ఈడీ ఎంటర్ కావడం చూస్తే, ఇటువైపు నుంచి లాగినట్టు కనిపిస్తోందని అంటున్నారు వైసీపీలోని కొందరు నేతలు. ఈ క్రమంలో అరెస్టులు ఉండే అవకాశముందన్న వాదనలు లేకపోలేదు. మొత్తానికి వివేకా హత్య కేసు మళ్లీ ఎటువైపు టర్న్ అవుతుందోనని బెంబేలెత్తుతున్నారు కీలక నేతలు

ALSO READ: ఆర్టీసీ ఉద్యోగులకు దిమ్మతిరిగే స్కామ్ చేసిన క్లర్క్, రూ.30 లక్షలతో పరార్

 

Related News

ద్వారకా తిరుమలలో మహిళా ఉద్యోగిపై.. సీఎం చంద్రబాబు ప్రశంసల జల్లు!

బీసీలపై ఎందుకంత కక్ష?.. ఢిల్లీ వేదికగా వైసీపీ తీరుపై మండిపడ్డ రామ్మోహన్ నాయుడు!

బీసీ రిజర్వేషన్ల వివాదంపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అచ్చెన్నాయుడు.. ఎమన్నారంటే?

ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!

ఏపీలో పాకిస్థాన్ గూఢచారి నెట్‌‌వర్క్ కలకలం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు!

ఆ విధంగా ముందు.. చంద్రబాబు-పవన్ రెండుగంటలపాటు భేటీ, మరోసారి కూర్చోవాలని నిర్ణయం

వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షలు స్వాహా.. కేటుగాడు అరెస్ట్!

Big Stories

Advertisement
×