E-Paper
Advertisement

ఏపీలో పాకిస్థాన్ గూఢచారి నెట్‌‌వర్క్ కలకలం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు!

ఏపీలో పాకిస్థాన్ గూఢచారి నెట్‌‌వర్క్ కలకలం.. ఇద్దరిని అరెస్ట్ చేసిన అధికారులు!
Advertisement

Pakistan Spy Network: ఏపీలో పాకిస్థాన్ స్పై నెట్వర్క్ కలకలం రేపింది. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్ ఫైర్‌వాల్–2026 ఆపరేషన్ జరిపింది. ఈ ఆపరేషన్‌లో దాదాపుగా 18 మందితో పాక్ స్పై నెట్‌వర్క్లో 13 మంది నేవీ సిబ్బంది అనుమానితులుగా గుర్తించారు. దీంతో 10 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో వరుసగా సోదాలు నిర్వహించారు. మొత్తం 12 కౌంటర్ ఇంటెలిజెన్స్ బృందాలతో భారీ ఆపరేషన్ నిర్వహించారు.

పాక్ ఇంటెలిజెన్స్‌తో టచ్‌లో..

ఏపీ, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక సహా 10 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ ఆపరేషన్లో పాక్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్‌తో నేరుగా టచ్‌లో ఉన్నట్లు అధికారులు కోంత మందిని గుర్తించారు. దీంతో ఎన్‌క్రిప్టెడ్ ఛానళ్ల ద్వారా కీలక సమాచారం చేరవేతపై దర్యాప్తు చేసినట్టు కౌంటర్ ఇంటెలిజెన్స్ తెలిపింది. విశాఖలోని నేవీ, రక్షణ సంస్థల సమాచారమే టార్గెట్ గూఢచర్యం చేసారని తెలిపారు. సున్నితమైన, రహస్య సమాచారాన్ని సేకరించి చేరవేసినట్లు అధికారులు భావిస్తున్నారు.

Advertisement

Also read: బీజేపీలో మహిళలకు రక్షణ లేదా.. మాజీ బీజేవైఎం జాతీయ కోశాధికారిపై కేసు నమోదు!

మొత్తం 18 మంది..

దీంతో అనుమానితుల నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 18 మందిలో ఇద్దరి పాత్రపై ప్రాథమిక ఆధారాలు అధికారులు సేకరించారు. వీరిలో విశాఖకు చెందిన సివిలియన్ కాంట్రాక్ట్ డ్రైవర్, అన్నం సాయి వరప్రసాద్‌ను అరెస్ట్ చేసిన ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ శాఖకు తరలించారు. ఇతడు నేవీ రక్షణ సంస్థల రహస్య సమాచారాన్ని పాక్ ఆపరేటివ్‌కు చేరవేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే సమాచారం చేరవేసినందుకు డబ్బులు తీసుకున్నట్లు ఇంటలీజెన్స అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇతడిని అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు విశాఖ జిల్లా జైలుకు పోలీసులు తలించారు.

ప్రదీప్ ముఖర్జీ..

Advertisement

కోయంబత్తూరులో మరో నేవీ ఉద్యోగి ఇంటలీ జెన్స్ అధికారుల అరెస్ట్ చేస్తారు. ప్రదీప్ ముఖర్జీ అనే వ్యక్తిని పోలీసులు ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ అదుపులోకి తీసుకుంది. ఇతడు పాక్ ఆపరేటివ్ వాట్సాప్ యాక్టివేషన్‌కు OTP షేర్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. IOలతో కమ్యూనికేషన్ కీలక సమాచార చేరవేతపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ట్రాన్సిట్ వారెంట్‌తో కోయంబత్తూరు నుంచి విజయవాడకు అధికారులు తరలించారు. దీంతో ఇతడిని అక్టోబర్ 14 వరకు జ్యుడీషియల్ కస్టడీకి అనుమతిస్తు ప్రస్తుతం విజయవాడ జిల్లా జైలులో ప్రదీప్ ముఖర్జీని ఉంచారు. మిగిలిన 16 మంది అనుమానితులపై ఇంటలీజెన్స్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జాతీయ భద్రత దృష్ట్యా కీలక వివరాలను కౌంటర్ ఇంటెలిజెన్స్ వెల్లడించింది.

Also read: ఐదు రోజలు ఉండాల్సిందే.. తేల్చి చెప్పేసిన టీఆర్ఎస్ చీఫ్ కవిత

Tags

Related News

ఏపీ పింఛనుదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారిపోతున్న రూల్స్ ఇవే!

ఆ విధంగా ముందు.. చంద్రబాబు-పవన్ రెండుగంటలపాటు భేటీ, మరోసారి కూర్చోవాలని నిర్ణయం

వైసీపీకి ఆ సత్తా లేదు.. అందుకే కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు! – మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

హోంగార్డు ఉద్యోగాల పేరుతో రూ.6.95 లక్షలు స్వాహా.. కేటుగాడు అరెస్ట్!

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు.. ఓ వైపు పిటిషన్లు, రిపీట్ అయ్యే ఛాన్స్ అంటూ నేతలకు అలర్ట్

ఆర్టీసీ – బొలెరో ఢీ.. స్పాట్‌లో 24 మందికి పైగానే, నంద్యాల జిల్లాలో ఘటన

ఈసీకి సంచలన లేఖ రాసిన వైసీపీ పార్టీ.. షాక్ లో కూటమి సర్కార్!

Big Stories

Advertisement
×