Jabardast NookaRaju: బుల్లితెరపై గత దశాబ్ద కాలానికి పైగా ప్రేక్షకులను అలరిస్తున్న ఏకైక కామెడీ షో జబర్దస్త్ (Jabardast). ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ తమ టాలెంట్ ను నిరూపించుకుంటున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ వేదికగా తన టాలెంట్ తో.. విభిన్నమైన పర్ఫామెన్స్ తో అందరినీ ఆకట్టుకుంటున్నారు నూకరాజు(Nookaraju). నూకరాజు సింగిల్ పర్ఫామెన్స్ మాత్రమే కాదు తన ప్రేయసి ఆసియా(Asia) తో కూడా కలిసి ఎన్నో మంచి మంచి స్కిట్లు చేసి అందర్నీ ఆకట్టుకున్నారు. అటు ఆన్ స్క్రీన్ లోనే కాదు ఇటు ఆఫ్ స్క్రీన్ లో కూడా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెళ్లికి కూడా సిద్ధమవుతున్నారన్న విషయం అందరికీ తెలిసిందే.
విడిపోయిన ఆసియా – నూకరాజు..
అయితే ఏమైందో తెలియదు కానీ వీరిద్దరి మధ్య గొడవలు జరిగి బ్రేకప్ చెప్పుకున్నారనే వార్తలు మాత్రం గత కొంతకాలంగా అభిమానులను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. దీనికి తోడు ఈ బ్రేకప్ వార్తలపై అటు నూకరాజు కానీ ఇటు ఆసియా కానీ ఎవరు ఎక్కడ స్పందించిన దాఖలాలు లేవు. ప్రస్తుతం ఎవరికి వారు తమ ప్రొఫెషనల్ లైఫ్ లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.
నూకరాజును వదిలి ఇంకో వ్యక్తిని వివాహం చేసుకున్న ఆసియా..
అయితే ఇక్కడ మరో గుండె పగిలే వార్త ఏమిటంటే.. ఆసియా ఇంకొకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. ఈ విషయం తెలిసి నూకరాజు గుండె ముక్కలు అయ్యేలా ఏడుస్తున్నారు. ఏదేమైనా ఇన్ని రోజులు ప్రేమించుకుని, ఇలా ఉన్నట్టుండి ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకొని వెళ్లిపోవడంతో ఆసియాపై పలువురు విమర్శలు గుర్తిస్తున్నారు. నూకరాజు కన్నీటి బాధను చూసి ఎమోషనల్ అవుతున్నారు.
అసలు నిజం ఏంటంటే?
ఇకపోతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇది రియల్ కాదని తెలుస్తోంది. మరి అసలు విషయంలోకి వెళ్తే.. వీరిద్దరూ కలిసి ఇప్పటికే ఎన్నో ప్రైవేట్ ఆల్బమ్స్, మ్యూజిక్ వీడియోలు చేసిన విషయం తెలిసిందే. పైగా ఇంతకుముందు వీరు కలిసి చేసిన “నా గుండె గోదావరి”, “లవ్ ఫెయిల్యూర్” సాంగ్ కి యూట్యూబ్ లో కొన్ని లక్షల వ్యూస్ తో పాటు లైకులు కూడా వచ్చాయి. అలాగే “తాటి బెల్లం” సాంగ్, “ఉరితాడు ఉయ్యాలయ్యిందా?”, “నా చెల్లెమ్మ” వంటి పాటలకు కూడా యూట్యూబ్లో మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఇప్పుడు మరో అందమైన ఫోక్ సాంగ్ తో మన ముందుకు వచ్చారు ఈ జంట. జబర్దస్త్ ఫేమ్ బాబు దర్శకత్వంలో తెరకెక్కిన “చల్లగుండరాదే”అనే సాంగ్ ప్రోమోని తాజాగా (జూలై 4) విడుదల చేశారు. ఈ పాటలో ఆసియా వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని వెళ్లిపోవడంతో నూకరాజు తల్లడిల్లిపోతాడు. ఆసియాతో గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకొని పిచ్చివాడైపోతాడు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇది చూసిన అందరూ క్రేజీ కామెంట్ చేస్తున్నారు.
వీడియోపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు..
అయితే ఈ వీడియో చూసిన నెటిజన్స్ మాత్రం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రియల్ లైఫ్ లో ఇలా చేసుకోకండి. మేము తట్టుకోలేము. ఆసియా నువ్వు ఎప్పుడు కూడా నూకరాజుతోనే ఉండాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు మరొకవైపు ఈ పాట సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటూ బెస్ట్ విషెస్ కూడా తెలియజేస్తున్నారు. ఏది ఏమైనా ఒక్క సాంగ్ తో ఈ జంట విడిపోయారు అని, ఆసియా ఇంకొకరిని పెళ్లి చేసుకుందనే వార్తలు అభిమానులను కలవరపాటుకు గురిచేసాయి. అసలు నిజం తెలిసి కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రోమో ఇప్పుడు వైరల్ గా మారింది .
ALSO READ:NBK vs Pawan Kalyan: ఈసారి యుద్ధం మామూలుగా ఉండదుగా.. ఒకే రోజు విడుదలకు సిద్ధమైన స్టార్ హీరోలు!