AP Self-employment Loans: ఏపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో మరో బృహత్తర స్కీమ్ అమలుకు చర్యలు తీసుకుంది. ఈ పథకం ద్వారా సామాన్య కుటుంబాలకు మేలు చేకూర్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందడుగు వేసింది. అయితే స్వయం ఉపాధిలో రాణించాలని భావించే వారికి ఇదొక సదవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే చాలు, వారి లైఫ్ సెటిల్. ఇంతకు ఆ స్కీమ్ ఏమిటి? కలిగే ప్రయోజనం ఏమిటో తెలుసుకుందాం.
స్వయం ఉపాధిలో రాణించాలంటే అంత ఆషామాషీ కాదు. అధిక వడ్డీలు చెల్లించి ఉపాధి మార్గాన్ని ఎంచుకుంటే, ఖచ్చితంగా ఇబ్బందులు తప్పవు. అలాంటి వారికి చేయూత అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రుణాలను బ్యాంకుల ద్వారా మంజూరు చేస్తుంటాయి. అలా మంజూరైన రుణాలను సద్వినియోగం చేసుకొని ఉపాధిలో సక్సెస్ సాధించిన వారు ఎందరో ఉన్నారు. ఇప్పుడు మళ్లీ ఏపీ యువతకు ఆ అవకాశం వచ్చింది.
స్కీమ్ ఇదే..
ఏపీ మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా 2025-26 ఆర్ధిక సంవత్సరానికి రుణాలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. బ్యాంకుల ద్వారా రుణాలను అందించడం, యువతకు ఉపాధి కల్పించడం ఈ స్కీమ్ ప్రధాన ఉద్దేశం. ప్రతి ఏడాది ఈ అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తుంది.
అర్హులు వీరే..
మైనారిటీస్ కార్పొరేషన్ ద్వారా అందించే రుణం కావడంతో ఈ స్కీమ్ ద్వారా లబ్ది పొందేందుకు వీరే అర్హులు. ముస్లింలు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, పార్శికులు అర్హులు కాగా వీరు తమ దరఖాస్తులను అందజేస్తే చాలు.. వీరికి స్కీమ్ ద్వారా లబ్ది చేకూరడం ఖాయం.
ఎన్ని స్లాబ్ లు? ఏ ఏ షాపులు? నిధులెంత?
మొదటి స్లాబ్ క్రింద కిరాణా షాప్, పాన్ షాప్, చికెన్ & మటన్ షాప్, ఫ్రూట్స్ స్టాల్స్, కూరగాయలు అమ్మకం, ఎలక్ట్రికల్ రిపైర్స్, సైకిల్ షాప్ మొదలగు పధకాలు ఏర్పాటు చేసుకొనుటకు రూ.1.00 లక్ష వరకు, రెండవ స్లాబ్ క్రింద ఎ.సి. & ఫ్రిడ్జ్ రిపైర్స్ వర్క్స్, ఆటోమొబైల్ స్పేర్స్ యూనిట్స్, బాటరీ సర్వీసింగ్ మరియు సేల్స్, సెల్ ఫోన్ రిపైర్స్ & సేల్స్, ఫుట్ వేర్ షాప్స్ అవసరమైన మౌలిక సదుపాయాలు వర్కింగ్ కాపిటల్, ఫాషన్ డిజైన్, బ్యూటీ పార్లర్ మొదలగు పధకాలు ఏర్పాటు చేసుకొనుటకు రూ.1.00 లక్ష నుండి రూ.3.00 వరకు, మూడవ స్లాబ్ క్రింద ఆటోమొబైల్ రంగం, రవాణ రంగం ఫాబ్రికేషన్ తదితర యూనిట్లు ఏర్పాటు చేసుకొనుటకు రూ.3.00 నుండి రూ.5.00 లక్షల వరకు, నాలుగవ స్లాబ్ క్రింద ఆటోమొబైల్ రంగం, జనరిక్ మెడికల్ దుకాణాలు, ఫిట్ నెస్ సెంటర్లు ఏర్పాటు రూ.8.00 లక్షల వరకు ఋణ సదుపాయం కల్పించుటకై బ్యాంకుల ద్వారా సబ్సిడీ ఋణముల కొరకు ఆన్ లైన్ ద్వారా అర్హులైన మైనారిటీ అభ్యర్ధుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తారు.
Also Read: Train Ticket Booking: మారిన టికెట్ బుకింగ్ రూల్స్.. ఇకపై అది తప్పనిసరి!
అర్హతలు ఇవే..
⦿ మైనారిటీస్ వర్గాలకు (ముస్లింలు, బౌద్ధులు, జైనులు, సిక్కులు మరియు పార్శికులు) చెందిన వారై ఉండాలి.
⦿ అభ్యర్థి వయస్సు 21 55 సంవత్సరముల లోపు ఉండాలి.
⦿ అభ్యర్ధి వార్షిక ఆదాయము గ్రామీణ ప్రాంతాలకు రూ.1,50,000/- మరియు పట్టణ ప్రాంతాలకు రూ.2,00,000/-
లలోపు ఉండాలి.
⦿ తెల్ల రేషన్ కార్డు (కుటుంబములో ఒకరికి మాత్రమే), ఆధార్ కార్డు తప్పనిసరి.
⦿ మొత్తం లక్ష్యంలో 33.1/3% మహిళలకు కేటాయించబడింది.
⦿ అభ్యర్థి పాస్ పోర్ట్ సైజు ఫోటో-1.
⦿ రవాణ పథకము క్రింద దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు తమ డ్రైవింగ్ లైసెన్స్ తప్పని సరిగా జతపరచవలెను.
అర్హత, ఆసక్తి గల మైనారిటీస్ అభ్యర్ధులు తమ దరఖాస్తులను 25-05-2025 లోపు ఆన్ లైన్ apobmms.apcfss.in లో నమోదు చేసుకొని సంబంధిత సర్టిఫికేట్లు జతపరచి సంబంధిత మండల పరిషత్ అభివృద్ధి అధికారి లేక మునిసిపల్ కమీషనర్ కు సమర్పించాల్సి ఉంటుంది. మరెందుకు ఆలస్యం.. మీరు అర్హులైతే వెంటనే అప్లై చేయండి.. స్వయం ఉపాధిలో సక్సెస్ కండి.