BigTV English

Balineni Srinivasa Reddy : టీడీపీతో టచ్ లో బాలినేని? త్వరలో వైసీపీకి గుడ్ బై..?

Balineni Srinivasa Reddy : టీడీపీతో టచ్ లో బాలినేని? త్వరలో వైసీపీకి గుడ్ బై..?

Balineni Srinivasa Reddy : సీఎం జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి వైసీపీకి గుడ్‌బై చెప్పబోతున్నారా? ఒకసారి కంటతడి పెట్టి, మరోసారి ముఖ్యమంత్రిని కలిసి తనకు కంఫర్ట్‌గా లేదని పదేపదే చెప్తున్న బాలినేని ఈసారి పార్టీ వీడాలని నిర్ణయించుకున్నారా? ఔననే సమాధానం వినిపిస్తోంది.


ఒంగోలు నియోజకవర్గం నుంచి బాలినేని ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. అయితే ఆయనకు ఈసారి ఒంగోలు టిక్కెట్ ఇవ్వరనే ప్రచారం జరుగుతోంది. గిద్దలూరు లేదంటే మార్కాపురం నుంచి పోటీ చేయాలని వైసీపీ అధిష్టానం ఆయనకు సూచించినట్టు తెలుస్తోంది.

వైసీపీ అధిష్టాన వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని టీడీపీకి టచ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో చంద్రబాబు నాయుడు కూడా బాలినేని విషయంలో సాఫ్ట్‌గా స్పందించారు. శుక్రవారం మీడియా కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన.. వైసీపీ నుంచి ఎవరైనా వస్తే ఆలోచిస్తామన్నారు. బలమైన నేతలను పార్టీలో చేర్చుకుంటామనే సంకేతాలిచ్చారు.


మంత్రివర్గంలో మార్పులు చేసినప్పుడే బాలినేనికి వైసీపీకి మధ్య దూరం పెరిగింది. మంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆయన అలిగారు. సీఎం జగన్ పిలుపించుకుని మాట్లాడినా ఆయన తరచూ తన అసంతృప్తిని వివిధ వేదికలపై వెళ్లగక్కుతూనే ఉన్నారు.

ఉమ్మడి ప్రకాశం జిల్లాపై బాలినేనికి పార్టీలో మంచి పట్టుఉంది. కానీ వైసీపీ అధిష్టానం ఆయన ప్రాధాన్యతను తగ్గించడంత హర్ట్ అయ్యారు. ఇన్నాళ్లూ సరైన సమయం కోసం ఎదురుచూశారు. ఇప్పుడు తను పోటీ చేసే స్థానాన్ని మార్చే ప్రయత్నాలు జరగడంతో ఇక వైసీపీని వీడేందుకు సిద్ధమయ్యారని టాక్ వినిపిస్తోంది. అటు ఆయన వస్తే పార్టీలో చేర్చుకోవడానికి టీడీపీ సిద్ధంగా ఉంది. మరి నిజంగానే బాలినేని వైసీపీకి గుడ్ చెబుతారా? లేక పార్టీ ఆదేశాలను పాటిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.

.

.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×