E-Paper
Advertisement

Japan Slim Moon Lander : ఒళ్లు విరుచుకున్న జపాన్ లాండర్..!

Japan Slim Moon Lander : ఒళ్లు విరుచుకున్న జపాన్ లాండర్..!
Advertisement
Japan Slim Moon Lander

Japan Slim Moon Lander : జాబిల్లిపైకి జపాన్ పంపిన స్లిమ్ లూనార్ లాండర్ తిరిగి పనిచేస్తోంది. పవర్ సప్లై కారణంగా 9 రోజులుగా అది మూగనోము పట్టింది. ఆదివారం రాత్రి నుంచి లాండర్‌తో కమ్యూనికేషన్ల పునరుద్ధరణ జరిగిందని జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ(జాక్సా) వెల్లడించింది. చంద్రుడిపై లాండర్ తలకిందులుగా దిగింది. సోలార్ ప్యానెళ్లు కిందకు ఉండటంతో బ్యాటరీలు సౌరశక్తిని తీసుకోలేక.. ఇక పనిచేయడం అసాధ్యమనే అందరూ భావించారు. అయితే సోలార్ సెల్స్ తిరిగి పని చేయడం ఆరంభించాయి.

చంద్రుడిపై సూర్యకిరణాల దిశ మారిన దరిమిలా అవి సౌరశక్తిని గ్రహిస్తున్నాయి. ఈ నెల 20న చంద్రుడి ఉపరితలంపై దిగినప్పుడు సూర్యుడికి అభిముఖంగా సోలార్ సెల్స్ లేకపోవడంతో పవర్ జనరేట్ కాలేదు. దీంతో చార్జింగ్ 12 శాతానికి చేరుకోవడంతో.. స్లిమ్‌ను ఆఫ్ చేశారు. ఏదో ఒక సమయంలో దిశ మారినప్పుడు తిరిగి సూర్య కిరణాలు ప్రసరిస్తాయని.. అప్పుడు తిరిగి చార్జింగ్ కాగలదని శాస్త్రవేత్తలు ఎదురు చూశారు. ఊహించినట్టుగానే జరగడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

స్మార్ట్ లాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్(SLIM) స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా చంద్రుడిపైకి లాండర్‌ను దింపిన జపాన్.. ఆ ఘనత సాధించిన ఐదో దేశంగా నిలిచింది. సూర్యుడి గమనం మారడంతో స్లిమ్‌లోని సోలార్ ప్యానెల్స్‌పై కిరణాలు ప్రసరించాయని జాక్సా తెలిపింది. దీంతో ఛార్జింగ్ అయి స్లిమ్ పని చేయడం ప్రారంభమైంది.

లాండర్ తిరిగి తన పనిని తాను ప్రారంభించడమే కాకుండా ఓ ఫోటోను కూడా తీసి భూమికి పంపింది. స్లిమ్ మిషన్ గతంలో పలు మార్లు విఫలమైంది. జపాన్ కన్నా ముందు మన దేశం జాబిల్లిపై కాలు మోపింది. నిరుడు ఆగస్టులో చంద్రయాన్-3 రోవర్ చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద విజయవంతంగా దిగింది. ఇంతకు ముందు ఎవరూ ఆ ప్రాంతానికి చేరుకోలేదు.

Related News

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

నేపాల్ ఖాకీలకు విచిత్ర సవాల్.. వరదల్లో కొట్టుకెళ్లిన మనుషులతో పాటు.. బ్యాంక్ లాకర్ల కోసం వేట!

బాంబులు, డ్రోన్ల మోత మధ్య జరిగిన పెళ్లి.. యుద్ధ సమయంలో పెరుగుతున్న వివాహాల సంఖ్య

Big Stories

Advertisement
×