E-Paper
Advertisement

ఫోన్ టచ్ చేయాల్సిన పనిలేదు.. ఈ హెల్మెట్ అన్నీ చూసుకుంటుంది!

ఫోన్ టచ్ చేయాల్సిన పనిలేదు.. ఈ హెల్మెట్ అన్నీ చూసుకుంటుంది!
Advertisement

HeadFox Tarmac Smart Helmet: ఇండియన్ రైడర్స్ కోసం స్మార్ట్ టెక్నాలజీతో కూడిన కొత్త బ్లూటూత్ హెల్మెట్‌ను హెడ్‌ ఫాక్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెట్లోకి తీసుకొచ్చింది.  టార్మాక్ పేరుతో విడుదలైన ఈ హెల్మెట్ భద్రతతో పాటు కనెక్టివిటీ, నావిగేషన్, స్టైలిష్ డిజైన్ లాంటి అత్యాధునిక ఫీచర్లను కలిగి ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదో ఫ్యూచరిస్టిక్ హెల్మెట్.

ఫోన్ టచ్ చేయకుండానే అన్ని పనులు

జైపూర్‌కు చెందిన హెడ్‌ఫాక్స్ సంస్థ బ్లూటూత్ హెల్మెట్లు, రైడింగ్ గేర్ తయారీలో ప్రత్యేక గుర్తింపు పొందింది. శుభమ్ చౌహాన్, నవనీత్ గార్గ్ ఈ సంస్థను స్థాపించారు. ప్రస్తుతం రైడర్లు కేవలం భద్రత మాత్రమే కాకుండా, సౌకర్యవంతమైన స్మార్ట్ ఫీచర్లు కూడా కోరుకుంటున్నారని గుర్తించిన సంస్థ, ఆ అవసరాలకు అనుగుణంగా టార్మాక్‌ను అభివృద్ధి చేసింది. ఈ హెల్మెట్‌లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉండటంతో మొబైల్ ఫోన్‌ను చేతిలో పట్టుకోకుండానే కాల్స్ మాట్లాడటం, మ్యూజిక్ వినడం, నావిగేషన్ సూచనలు పొందే అవకాశం ఉంటుంది. ప్రయాణ సమయంలో రైడర్ దృష్టి రోడ్డుపైనే ఉండేలా సహాయపడుతుంది.

Advertisement

టార్మాక్‌లో ఇంటిగ్రేటెడ్ నావిగేషన్ సపోర్ట్ కూడా ఉంది. దీంతో మార్గం తెలియని ప్రాంతాల్లో కూడా సులభంగా ప్రయాణించవచ్చు. అలాగే హెడ్‌ ఫాక్స్ ప్రత్యేకంగా రూపొందించిన బ్లింక్ స్లైడ్ టెక్నాలజీను కూడా ఇందులో అందించారు. ఇది రైడింగ్‌ ను మరింత స్మార్ట్‌ గా, సౌకర్యవంతంగా మార్చేందుకు ఉపయోగపడుతుందని కంపెనీ వెల్లడించింది.

భద్రతలోనూ నో కాంప్రమైజ్

డిజైన్ పరంగా కూడా ఈ హెల్మెట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. తేలికపాటి నిర్మాణం, ఆకర్షణీయమైన గ్రాఫిక్స్, లేటెస్ట్  స్టైలింగ్‌ తో రూపొందించిన ఈ హెల్మెట్ ఎక్కువసేపు ధరించినా అసౌకర్యంగా అనిపించకుండా ఉండేలా తయారు చేశారు. అదే సమయంలో భద్రత, మన్నిక విషయంలో కూడా ఎలాంటి రాజీ పడలేదని సంస్థ తెలిపింది. భద్రతా ప్రమాణాల పరంగా టార్మాక్‌కు DOT, ISI సర్టిఫికేషన్లు లభించాయి. దీంతో అంతర్జాతీయ, భారతీయ భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ హెల్మెట్ తయారైనట్లు స్పష్టమవుతోంది.

కొత్త హెల్మెట్స్ గురించి కంపెనీ ఏం చెప్పిందంటే?

Advertisement

కొత్త హెల్మెట్స్ విడుదల సందర్భంగా హెడ్‌ఫాక్స్ వ్యవస్థాపకుడు శుభమ్ చౌహాన్ కీలక విషయాలు వెల్లడించారు. రాబోయే రోజుల్లో హెల్మెట్లు కేవలం సేఫ్టీ కోసం మాత్రమే కాకుండా స్మార్ట్ రైడింగ్‌లో కీలక భాగంగా మారనున్నాయన్నారు. ప్రస్తుత తరం వినియోగదారులు ప్రతి విషయంలో స్మార్ట్ టెక్నాలజీని ఆశిస్తున్నారని, అదే అనుభవాన్ని రైడింగ్ గేర్‌ లో కూడా అందించాలన్న లక్ష్యంతో టార్మాక్‌ను రూపొందించామని చెప్పారు. భవిష్యత్తులో రైడర్ భద్రత, టెక్నాలజీ, డిజైన్ కలిసి ముందుకు సాగనున్నాయన్నారు.  టార్మాక్ ఆ దిశగా తమ తొలి అడుగు వేసిందన్నారు. భవిష్యత్తులో మరిన్ని స్మార్ట్ మొబిలిటీ ఉత్పత్తులను కూడా తీసుకురావాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

భారత్ లో టూవీలర్స్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, స్మార్ట్ హెల్మెట్లకు కూడా డిమాండ్ పెరిగే అవకాశాలు ఉన్నాయని హెడ్‌ ఫాక్స్ భావిస్తోంది. టార్మాక్ ద్వారా సంప్రదాయ హెల్మెట్‌ ను ఆధునిక సాంకేతికతతో మేళవించి కొత్త తరహా రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ ను అందించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.

Read Also: టాటా నుంచి రెండు సూపర్ ఈవీలు.. సఫారీ, అవిన్యా రిలీజ్ ఎప్పుడంటే?

Related News

పెట్రోల్ vs డీజిల్ vs సీఎన్జీ vs ఈవీ.. టాటా నెక్సాన్‌లో ఏది కొంటే లాభం?

హీరో గ్లామర్ X 125 ఇక మరింత సేఫ్.. కొత్త ABS వేరియంట్ వచ్చేసింది!

చేతక్ స్కూటర్ బండి కాదు.. మాటల్లో చెప్పలేని ఎమోషన్.. 80s నాటి మిడిల్ క్లాస్ మెమోరీస్!

రెనాల్ట్ కార్లపై లక్షల్లో ఆఫర్లు.. డస్టర్‌పై ఏకంగా ఎంత డిస్కౌంట్ లభిస్తుందంటే..

కొత్త బాలెనో ధరలు వచ్చేశాయ్.. హైదరాబాద్‌లో టాప్ వేరియంట్ రేట్ ఎంతంటే?

క్రెటా To అల్కాజార్.. హ్యుందాయ్ SUVలకు అదిరిపోయే లాంజ్ టచ్!

1,000 కి.మీ.కి పైగా రేంజ్.. మహీంద్రా XUV 7XO హైబ్రిడ్ వచ్చేస్తోంది!

కియా కొత్త కార్లు వచ్చేస్తున్నాయ్.. కేరెన్స్, క్లావిస్ CNGతో పాటు కార్నివాల్ హైబ్రిడ్ బుకింగ్స్ షురూ!

Big Stories

Advertisement
×