MRI Scaning Incident: గుండెకు అమర్చిన పేస్ మేకర్ ప్రాణం తీసింది. MRI తీస్తుండగా ఓ మహిళ మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. పత్తికోళ్ల లంక గ్రామానికి చెందిన రామ తులసి సుస్మిత డయాగ్నొస్టిక్ సెంటర్‌లో స్కానింగ్‌కు వెళ్లింది. అయితే MRI తీస్తుండగా గిలగిల కొట్టుకుని మృతి చెందింది. రామతులసికి పేస్‌మేకర్ అమర్చిన విషయాన్ని టెక్నిషీయన్‌కు చెప్పినట్టు భర్త కోటేశ్వరరావు చెబుతున్నారు. కదిలితే స్కానింగ్ సరిగ్గా రాదని మైక్‌లో చెప్పారంటున్నారు. తన భార్య మృతికి కారణమైన స్కానింగ్ సెంటర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. రామ తులసి అనే మహిళకు గుండె జబ్బు ఉండటంతో గతంలో ఆమెకు పేస్ మేకర్ అమర్చారు. ఇలాంటి వాళ్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎంఆర్ఐ స్నానింగ్ తియ్యకూడదు. కానీ అవేమీ అడగకుండా ఆ మహిళకు MRI స్కానింగ్ తీశారు. అంతే.. స్కానింగ్ చేస్తుండగా గిలగిల కొట్టుకుంటూ భర్త కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన ఏలూరులోని సుస్మితా డయాగ్నస్టిక్ సెంటర్‌లో జరిగింది. బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. గతంలో రామతులసికి గుండె సమస్యతో ఆమెకు పేస్ మేకర్ అమర్చారు. దీంతో కిడ్నీ సమస్యలు కూడా ఉండటంతో ఆమెకు గత రెండు నెలల నుంచి ఏలూరులోని ఓ ఆస్పత్రిలో డయాలసిస్ చేస్తున్నారు.
తనకు పేస్ మేకర్ అమర్చిన విషయాన్ని వైద్యులకు తెలియజేశారు. కొద్ది రోజుల నుంచి ఆ మహిళకు తీవ్రమైన తలనొప్పిగా ఉందని.. డాక్టర్లకు చెప్పడంతో వాళ్లు సుస్మిత డయాగ్నోస్టిక్ సెంటర్‌కు ఎంఆర్ఐ స్కానింగ్ రాశారు. దీంతో మంగళవారం ఉదయాన్నే రామతులసి, ఆమె భర్త కలిసి స్కానింగ్ సెంటర్‌కి వెళ్లారు. సాధారణంగా స్కానింగ్ నిర్వాహకులు పేషెంట్లను.. గతంలో ఏమైనా సర్జీలు జరిగాయా, హార్ట్‌కు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఐరన్ రాడ్లూ ఉన్నాయా వంటి వివరాలు తెలుసుకుని స్కానింగ్ తీయాలి. కానీ వాళ్లు అవేమి అడగకుండా స్కానింగ్ మిషన్‌లోకి పంపించారు. పక్కనే ఆమె భర్తను ఉంచారు. స్కానింగ్ మొదలు పెట్టిన కొద్ది క్షణాల్లోనే రామతులసి కాళ్లు కొట్టుకుంటూ విలవిల్లాడింది.
Also Read: అతడే విలన్.. అతడే హీరో – బ్లాక్ మెయిల్ చేసి, మళ్లీ రక్షిస్తున్నట్లు నాటకమాడి ఘరానా మోసం
ఈ విషయాన్ని రామతులసి భర్త వాళ్లకు చెబుతున్నా.. వినకుండా ఏమి కాదు కదలకుండా పట్టుకోవాలని సూచించేరే తప్పా.. ఆమె దగ్గరికి ఒక్కరు కూడా రాలేదు. దీంతో తన భర్త కళ్లెదుటే ప్రాణాలు విడిచింది. కాగా స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు పేషెంట్ బ్రతికే ఉంది ఆస్పత్రికి తీసుకెళ్లండి అంటూ అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. అప్పటికే ఆమె మృతి చెందిందని గ్రహించిన బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఏలూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. స్కాన్ సెంటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. స్కానింగ్ తీసే సమయంలో అర్హత కలిగిన టెక్నీషియన్స్ లేరని, రేడియోలజీ డాక్టర్స్ కూడా హాస్పటల్‌లో లేరని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి నాగరత్నం తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశమేరకు స్కాన్ సెంటర్‌ను ఆమె పరిశీలించి త్వరలోనే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని పేర్కొన్నారు.