E-Paper
Advertisement

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు.. ఓ వైపు పిటిషన్లు, రిపీట్ అయ్యే ఛాన్స్ అంటూ నేతలకు అలర్ట్

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు.. ఓ వైపు పిటిషన్లు, రిపీట్ అయ్యే ఛాన్స్ అంటూ నేతలకు అలర్ట్
Advertisement

Amaravati: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఎన్నికలను ఎలాగైనా ఆపాలని వైసీపీ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగేలా వ్యూహ రచన చేస్తోంది. ఈ క్రమంలో వైసీపీ న్యాయస్థానం తలుపుతట్టింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌‌సిగ్నల్‌ ఇవ్వడాన్ని స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది.

స్థానిక ఎన్నికల్లో వైసీపీకి ఎత్తుకు పైఎత్తులు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది వైసీపీ. సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందు జరిగేలా ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్ల మీద పిటీషన్లు దాఖలు చేస్తోంది. ఇటీవల హైకోర్టు స్థానిక ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో ఆ తీర్పుపై వైసీపీ నేతలు అప్పిరెడ్డి, కడప మాజీ మేయర్‌సురేశ్‌ లు సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ముందు వచ్చింది.

Advertisement

ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ సర్‌ ఇంకా కొనసాగుతోందని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించేలా ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫున న్యాయవాది విజ్ఞప్తి చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఏ క్షణమైనా ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉందని, అత్యవసరంగా ఈ కేసును విచారించాలని కోరారు. ఆ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం, శుక్రవారం ఈ పిటిషన్లపై వాదనలు వింటామని తెలిపింది.

నేతలతో సజ్జల కీలక మంతనాలు

ఓ వైపు ఈ వ్యవహారం జరుగుతుండగా మరోవైపు నేతలు, కేడర్‌ను అలర్ట్ చేసింది వైసీపీ హైకమాండ్. గతంలో వైసీపీ అనుసరించిన విధానాలను కూటమి ఫాలో అయితే ఇబ్బందులు తప్పవని భావించింది. ఆ విధంగా నేతలకు దిశానిర్దేశం చేశారు స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీ రీజనల్ కో-ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉండాలన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు రెడీగా ఉండాలన్నారు.

Advertisement

బీసీ రిజర్వేషన్లు, ఎస్‌ఐఆర్‌పై న్యాయపరమైన పరిణామాలు కొనసాగుతున్నాయని, వాటిపై స్పష్టత వచ్చేవరకు సైలెంట్‌గా ఉండాల్సిన అవసరం లేదన్నారు. అభ్యర్థుల ఎంపిక నుంచి నామినేషన్ల వరకు ప్రతి అంశంపై ముందస్తు కసరత్తు జరగాలని, ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రాలు, ఎన్‌ఓసీలు, పన్నుల సర్టిఫికెట్లు అత్యంత కీలకమన్నారు. సర్టిఫికెట్లు ఇవ్వకుండా ప్రతిపక్ష అభ్యర్థులను ఎన్నికల బరి నుంచి తప్పించాలని చూస్తారని, సర్వర్ పని చేయడం లేదన్న షాక్‌తో సర్టిఫికెట్లను నిలిపివేసే అవకాశముందని అలర్ట్ చేశారు.

అభ్యర్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా అడ్డుకునే అవకాశం

వెంటనే గ్రామ, వార్డు సచివాలయాలు, మీ సేవా కేంద్రాల్లో వెంటనే సర్టిఫికెట్ల కోసం దరఖాస్తులు చేయాలని, దరఖాస్తు తీసుకోకపోయినా సర్వర్ పని చేయకపోయినా వీడియో ఆధారాలు సేకరించాలని సూచించారు. ప్రతి జిల్లాలో కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చి ఎకనాలెడ్జ్‌మెంట్ తీసుకోవాలన్నారు. సర్టిఫికెట్ల జారీలో ఉద్దేశపూర్వకంగా జాప్యం చేస్తే ఆధారాలతో ఎస్‌ఈసీ ముందుకు వెళ్దామని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిద్దామని తేల్చిచెప్పారు.

ALSO READ: ఆర్టీసీ – బొలెరో ఢీ.. స్పాట్‌లో 24 మందికి పైగానే, నంద్యాల జిల్లాలో ఘటన

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జెడ్పీటీసీ, ఎంపీపీ, జెడ్పీ చైర్‌పర్సన్ స్థానాలపై ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలని, రిజర్వేషన్లు ప్రకటించే వరకు వేచి చూడకుండా సామాజిక వర్గాల వారీగా బలమైన అభ్యర్థులను గుర్తించాలన్నారు. ఒక్కో స్థానానికి ఒక్కరే కాకుండా మరొక అభ్యర్థిని సిద్ధం చేయాలన్నారు. రిజర్వేషన్లు ప్రకటించిన తర్వాత నోటిఫికేషన్‌కు ఎక్కువ సమయం ఉండదని తేల్చిచెప్పారు. ప్రతి జిల్లాలో లీగల్ వార్‌రూమ్ ఏర్పాటు చేయాలని, ప్రతి నియోజకవర్గంలో ప్రత్యేక ఎన్నికల టీమ్ 24 గంటలు అందుబాటులో ఉండాలన్నారు.

నామినేషన్లకు అడ్డంకులు సృష్టించినా, అక్రమ కేసులు పెట్టినా వెంటనే లీగల్ టీమ్‌కు సమాచారం ఇవ్వాలన్నారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి, ఎన్నికల రోజు స్పందించడం కంటే, సమస్య రాకుండా ముందే గుర్తించాలన్నారు. జిల్లా అధ్యక్షులు, రీజినల్ కోఆర్డినేటర్లు, నియోజకవర్గ సమన్వయకర్తలు సమన్వయంతో పని చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ పూర్తి బలంతో బరిలోకి దిగుతుందన్నారు.

Related News

ఆర్టీసీ – బొలెరో ఢీ.. స్పాట్‌లో 24 మందికి పైగానే, నంద్యాల జిల్లాలో ఘటన

ఈసీకి సంచలన లేఖ రాసిన వైసీపీ పార్టీ.. షాక్ లో కూటమి సర్కార్!

అల్లూరి జిల్లాలో ఘోరం.. 5 నెలల పసిబిడ్డను దారుణంగా చంపేసిన కన్నతండ్రి!

జగన్ రాజకీయ భవిష్యత్తు కటకటాలే.. వివేకా హత్య కేసుపై మంత్రి మండిపల్లి ధ్వజం

కడప గడ్డ నుంచి జగన్‌కు సీఎం చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్, రూ. 40 కోట్ల సుపారీకి సమాధానం చెప్పాలి

వైసీపీ ఎంపీ ఉన్నా.. అభివృద్ధిలో వివక్ష లేదన్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

అనకాపల్లి జిల్లాలో విషాదం.. హిట్ అండ్ రన్ ఘటనలో దంపతులు మృతి!

Big Stories

Advertisement
×