E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              

Karthika Deepam 2 Serial Today Episode October 6th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ తో జ్యోత్స్న పెళ్లి చేస్తానన్న దీప              
Advertisement

Karthika Deepam 2 serial today Episode: దక్షిణమూర్తి ఆఫీసుకు వెళ్లి జ్యోత్స్నను సూరజ్‌ పీఏగా నియమించి వెళ్లాక జ్యో్త్స్న మాలిని దగ్గరకు వెళ్తుంది. ఆరోజు ఏమన్నావు నాకు ఎక్కడా జాబ్‌ రాకుండా చేస్తానన్నావు కదా ఇప్పుడు చూసు నీ కొడుకు దగ్గరే పీఏగా చేరిపోయాను ఇక నువ్వు ఈ ఆఫీసులో ఈ చాంబర్‌లో ఉండిపోతావు అంటూ వార్నింగ్‌ ఇస్తే.. మీ తాత అధికారం ఇచ్చాడని రెచ్చిపోకు నువ్వు ఆప్ట్రాల్‌ పీఏవు అంటుంది. పీఏ అంటే ఏంటో తెలుసా..? అత్త పీ అంటే ప్రేమించిన, ఏ అంటే అమ్మాయి మొత్తంగా సూరజ్‌ ప్రేమించిన అమ్మాయి ఇక నుంచి నువ్వు నీ కొడుకు క్యాబిన్‌లోకి వెళ్లాలంటే నేనే పర్మిషన్‌ ఇవ్వాలి. అసలు నువ్వు ఈ ఆఫీసులో ఎవరు..? ఏ పోస్ట్‌ లేదా..? ఊరికే వచ్చి కూర్చున్నావా..? అంటూ జ్యోత్స్న వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో మాలిని ఇరిటేట్‌ అవుతుంది కోప్పడుతుంది. కానీ తాను ఎందుకొచ్చానో.. ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు అత్త అంటూ చెప్తుంది. మాలిని కోపంగా చూస్తుంటే.. ఇక ఉంటాను నా డ్యూటీ నీ కొడుకు దగ్గరే కదా అంటూ జ్యోత్స్న వెళ్లిపోతుంది.

తర్వాత జ్యోత్స్న దగ్గరకు వెళ్లిన దీప, కార్తీక్‌ అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థం అవుతుందా..? అని అడిగితే.. నేను జాబ్‌ కోసం మాత్రమే ఇదంతా చేస్తున్నాను అని జ్యోత్స్న చెబితే.. దీని ఎంత ప్రమాదం జరుగుతుందో తెలుసా..? అని దీప అంటే ఆల్‌రెడీ ప్రమాదం జరుగుతూనే ఉంది.. నువ్వు ఇక్కడ జాబ్‌ చేస్తున్నావని ఇంట్లో తెలిస్తే ఏమవుతుందో తెలుసా..? అంటూ కార్తీక్‌ అడిగితే.. ఇంట్లో నేను చెప్పను మీరు కూడా చెప్పొద్దు అంటుంది జ్యోత్స్న. మనం చెప్పకపోయినా మాలిని అత్త ఒక కేజీ స్వీట్‌ తీసుకొచ్చి అందరికీ పంచిపెట్టి మరీ చెప్తుంది అంటూ దీప చెప్పగానే.. చెప్పని తర్వాత ఏం జరుగుతుందో నేను చూసుకుంటాను అంటుంది జ్యోత్స్న.

Advertisement

వాళ్లను నమ్మొద్దు మన కుటుంబం రోడ్డున పడటానికి కారణం వాళ్లే నువ్వు మళ్లీ ఇక్కడే వచ్చి చేరావు అంటూ దీప చెబితే.. మిమ్మల్ని మాలిని ఊరికే రానివ్వలేదు.. తన గోల్‌ కోసం మిమ్మల్ని వాడుకుంటుంది అంటూ జ్యోత్స్న చెప్తుంది. అందుకు కార్తీక్‌ మాత్రం దక్షిణమూర్తి మాట కాదనకుండా మాలిని, సూరజ్‌ ఒప్పుకున్నారంటే ఏదో చేయబోతున్నారు అంటూ హెచ్చరిస్తాడు. అందుకు జ్యోత్స్న మీ దారికి నేను అడ్డు రాను.. నా దారికి మీరు అడ్డు రావొద్దు.. ఇన్ని రోజులు వీళ్లు మనతో ఆడుకున్నారు కదా..? మనం ఇప్పుడు వీళ్లతో ఆడుకోవాలి. మీ ఆట మీరే ఆడుకోండి.. నా ఆట నేనే ఆడుకుంటాను.. ఇక నన్ను మీరేం అడగకండి బావ అంటూ వెళ్లిపోతుంది.

జ్యోత్స్న దగ్గరకు వెళ్లిన సూరజ్‌ గొడవ పడతాడు. ఆఫీసులో ఉన్నన్ని రోజులు నువ్వు ఆఫ్‌ మైండ్‌తో పని చేయాలి అని చెప్తాడు. పక్కనే ఉన్న డాక్టర్‌ దగ్గరకు వెళ్లి టెస్ట్ చేయించుకుని రిపోర్ట్‌ తీసుకుని రా అప్పుడు నమ్ముతాను. అయినా నువ్వు ఇక్కడి వారం రోజుల కన్నా ఎక్కువ ఉండవు అంటాడు. ఎందుకు అంత టార్చర్‌ పెడతావా..? అంటూ అడిగితే.. అంత లేదు నీ పని నువ్వు చూసుకో అంటూ వెళ్లిపోతాడు సూరజ్‌. మాలిని, కార్తీక్‌, దీప దగ్గరలకు వెళ్లి జ్యోత్స్నను ఆఫీసులోకి తీసుకురావడం మీ ప్లానేనా..? అంటూ నిలదీస్తుంది. అందుకు కార్తీక్‌.. నేను ముందే చెప్పాను జ్యోత్స్న గురించి నువ్వే వినలేదు అంటూ చెప్తాడు. జ్యోత్స్నకు తిక్క రేగితే అది ఏం చేస్తుందో కూడా నువ్వు అంచనా వేయలేవు అంటూ చెప్పగానే..

Advertisement

మీరింతకు ఏం ప్లాన్‌ తో వచ్చారు అంటూ గట్టిగా అడిగితే.. నీ కొడుకును మా చెల్లితో ఎగరేసుకుపోదాం అనుకున్నాం. సూరజ్‌కు జ్యోత్స్నకు ఆఫీసులోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం అంటూ దీప చెప్పగానే.. మాలిని షాక్‌ అవుతుంది. మీరు చెప్పేది నిజమైతే అది జరగదు.. జరగకుండా నేను చేస్తాను.. ఎందుకంటే ఆ మనిషే లేకుండా చేస్తాను అంటూ వార్నింగ్‌ ఇస్తుంది మాలిని. తన కొడుకు తనతో చెప్పకుండా ఏ పని చేయడని జ్యోత్స్నతో పెళ్లి పీటల వరకు తీసుకొచ్చింది నేను పెళ్లి ఆపింది నేను ప్రతీకారాన్ని తీర్చుకుంది నేనే అంటూ మాలిని చెప్తుంది. కార్తీక్‌, దీప ఆలోచిస్తూ శివనారాయణ టిఫిన్‌ సెంటర్ దగ్గర వెళ్తారు. అక్కడ ఫుల్లుగా జనం ఉండటం చూసి హ్యాపీగా ఫీలవుతారు. ఇంతలో ఇవాళ్టీ కార్తీకదీపం2 ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

హేటర్స్ కి అనసూయ దిమ్మతిరిగే రియాక్షన్!

బిగ్ బాస్ 10లో నామినేషన్స్ సెగలు.. ఆమెపై విరుచుకుపడ్డ కంటెస్టెంట్స్!

చంపేయ్ దేవుడా.. నరకం భరించలేకపోతున్నా – సుప్రీత

సుప్రీత మధ్యలోనే చదువు ఆపిందా.. కన్నీళ్లు తెప్పించే స్టోరీ!

ఈ గుర్తింపు బిగ్ బాస్ పెట్టిన భిక్ష.. రోహిత్ తీరుపై కౌశల్ మండిపాటు!

Karthika Deepam 2 Serial Today Episode October 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి షాక్ ఇచ్చిన సూరజ్ – పీఏగా జ్యోత్స్న అపాయింట్            

Ninnu kori Serial Today Episode October 5th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ ను జీవన్ చంపేస్తాడా..? చంద్ర కనిపెడుతుందా..? 

Big Stories

Advertisement
×