BigTV English

YS Jagan Mohan Reddy: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్..

YS Jagan Mohan Reddy: ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వైఎస్ జగన్..

YS Jagan Mohan Reddy Oath as MLA(AP news live): మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడంతో సాధారణ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారాయన. మంత్రులు ప్రమాణ స్వీకారం చేశాక వైఎస్ జగన్ ప్రమాణం చేశారు. ఇటీవలి జరిగిన ఎన్నికల్లో కేవలం ఆ పార్టీ 11 సీట్లకే పరిమితమవ్వడంతో కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం విశేషం.


ముందుగా సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ తరువాత ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, టీజీ భరత్, కందుల దుర్గేశ్, ఎన్ ఎం డీ ఫరూక్, బీసీ జనార్థన్ రెడ్డి, నారా లోకేశ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరి తర్వాత వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేశారు. వారి తర్వాత ఎమ్మెల్యేలు ఆంగ్ల అక్షరాల క్రమంలో ఒక్కొక్కరుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.

ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి వెళ్లిపోయారని తెలుస్తోంది. అంతకుముందు అసెంబ్లీ గేటు వెనుక నుంచి ప్రాంగణంలోకి జగన్ వచ్చారు. గతంలో సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి మందడం మీదుగా అసెంబ్లీకి వచ్చేశారు. అయితే ఆ సమయంలో అమరావతి రైతులు నిరసన తెలుపుతారని భావించిన వేరే మార్గంలో వచ్చినట్టు సమాచారం.


ALSO READ: శపథం నెరవేరింది, రెండున్నరేళ్ల తర్వాత సభలో సీఎం చంద్రబాబు, వైసీపీకి మినహాయింపు

అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా వెంటనే లోపలికి వెళ్లలేదు జగన్. సభ ప్రారంభమై ఐదు నిమిషాల తర్వాత వెళ్లారు. ప్రమాణ స్వీకార సమయంలో తనవంతు వచ్చినప్పుడే సభలోకి జగన్ అడుగుపెట్టారు. అప్పటివరకు గతంలో డిప్యూటీ స్పీకర్‌కు కేటాయించిన ఛాంబర్‌లోనే వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి జగన్ కూర్చున్నారు. ఇంత సడన్‌గా జగన్ ఎలా వచ్చారంటూ చర్చించుకోవడం ఎమ్మెల్యేల వంతైంది.

 

Tags

Related News

Anchor Shyamala: ఏం చెప్పారు శ్యామలగారు.. భూమనను మించిపోయారుగా!

Tirumala News: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నెల దర్శన కోటా విడుదల వివరాలు ఇవే

Iconic Cable Bridge: కృష్ణానదిపై ఐకానిక్‌ కేబుల్‌ బ్రిడ్జి.. సీఎం చంద్ర‌బాబు అదిరిపోయే ప్లాన్‌

AP Assembly Sessions 2025: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

AP Liquor Scam: ఏపీ లిక్కర్ కేసు.. తెరపైకి కొత్త పేర్లు, నేతల గుండెల్లో గుబులు

Vivekananda Case: అవినాష్‌రెడ్డి మెడకు ఉచ్చు.. మళ్లీ రంగంలోకి సీబీఐ?

AP Govt: ఏపీలో సందడే సందడి.. ఇల్లు కట్టుకునేవారికి పండగే, ఇంకెందుకు ఆలస్యం

Aarogyasri Services: ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగించాలి.. సీఈవో విజ్ఞప్తి

Big Stories

×