BigTV English

Indian Cricket Team Home Season 2024-25 : భారత్ బిజీ షెడ్యూల్.. రానున్న బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్

Indian Cricket Team Home Season 2024-25 : భారత్ బిజీ షెడ్యూల్.. రానున్న బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్

BCCI Announces Indian Cricket schedule for 2024-25 Home Season: ఒకవైపు నుంచి టీ 20 ప్రపంచకప్ పోటీలు ముమ్మరంగా సాగుతున్నాయి. టీమ్ ఇండియా సూపర్ 8కి చేరింది. మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ సమయంలో స్వదేశంలో భారత్ ఆడే సిరీస్ ల షెడ్యూల్ ను బీసీసీఐ ప్రకటించింది. సెప్టెంబర్ నుంచి వరుసగా బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్ మూడు దేశాలు భారత్ లో పర్యటించనున్నాయి.


అయితే 2023- 2024 ప్రారంభంలో ఇంగ్లండ్ మన దేశానికి వచ్చి ఐదు టెస్ట్ మ్యాచ్ లు ఆడింది. రూల్ ప్రకారం అయితే, మనవాళ్లు ఇంగ్లండ్ వెళ్లాలి. మరి వీళ్లు వెళ్లకుండానే, వాళ్లు మళ్లీ ఇండియా వచ్చేస్తున్నారు. అయితే అప్పుడు టెస్ట్ మ్యాచ్ లు మాత్రమే ఆడింది. ఇప్పుడు మాత్రం 5 టీ 20 మ్యాచ్ లు, 3 వన్డేలు ఆడేందుకు రానుంది.

బహుశా టీమ్ ఇండియా విదేశీ పర్యటనల షెడ్యూల్ ఇంకా బీసీసీఐ ప్రకటించలేదు. ఒకవేళ వస్తే, అందులో కచ్చితంగా ఇంగ్లండ్ పర్యటన ఉంటుంది. అయితే ఈ మధ్యలో ఛాలెంజర్స్ ట్రోఫీ ఒకటి ఉంది.


మొత్తానికి రాబోయే రోజుల్లో టీమ్ ఇండియా బిజీ బిజీ షెడ్యూళ్ల మధ్య గడిపే అవకాశాలున్నాయి. ఇంతకీ ఆ షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దామా..

బంగ్లాదేశ్ టూర్ షెడ్యూల్:

తొలి టెస్ట్: సెప్టెంబర్ 19-24 (చెన్నై వేదిక)
రెండో టెస్ట్ : సెప్టెంబరు 27-అక్టోబరు 1 (కాన్పూర్)

బంగ్లాదేశ్ మూడు టీ 20ల సీరీస్:

తొలి టీ 20: అక్టోబరు 6 (థర్మశాల)
రెండో టీ 20: అక్టోబరు 9 ( ఢిల్లీ)
మూడో టీ 20: అక్టోబరు 12 ( హైదరాబాద్)

న్యూజిలాండ్ టూర్ షెడ్యూల్:

తొలి టెస్ట్: అక్టోబర్ 16-20 (బెంగళూరు వేదిక)
రెండో టెస్ట్ : అక్టోబర్ 24-28 (పుణె)
మూడో టెస్ట్: నవంబర్ 1-5 (ముంబయి)

Also Read: ఆఫ్గాన్ మ్యాచ్ లో.. నల్లబ్యాడ్జీలతో టీమ్ ఇండియా

ఇంగ్లండ్ టూర్ షెడ్యూల్:

జనవరి 22, 2025 నుంచి ప్రారంభం:
తొలి టీ 20: జనవరి 22 (చెన్నై)
రెండో టీ 20: జనవరి 25  ( కోల్ కతా)
మూడో టీ 20: జనవరి 28  ( రాజ్ కోట్)
నాలుగో టీ 20: జనవరి 31  ( పుణె)
ఐదో టీ 20:  ఫిబ్రవరి 2  ( ముంబయి)

3 వన్డేల సిరీస్:

తొలి వన్డే: ఫిబ్రవరి 6 (నాగపూర్)
రెండో వన్డే: ఫిబ్రవరి 9  ( కటక్)
మూడో వన్డే: ఫిబ్రవరి 12  ( అహ్మదాబాద్ )

Tags

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×