BigTV English

YCP Leaders: జగన్‌కు బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేతలు గుడ్‌బై!

YCP Leaders: జగన్‌కు బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేతలు గుడ్‌బై!

YCP Leaders: వైసీపీ లేనిపోని దూకుడు ప్రదర్శిస్తూ.. అనాలోచిత నిర్ణయాలతో తన గొయ్యి తానే తవ్వుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అమరావతిపై సొంత ఛానల్లో అక్కసు వెళ్లగక్కడంతో.. రాజధాని ప్రాంతంలో ఆ పార్టీ నేతలు ముఖం చూపించలేని పరిస్థితి నెలకొంది. తల్లికి వందనం నిధులపై తీవ్రఆరోపణలు చేశారు. దానిపై లోకేష్ సవాల్ విసిరితే ఆ పార్టీ నేతలు సైలెంట్ అయిపోయారు. గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు చేసిన అరాచకాలు, జగన్‌ వ్యవహార శైలి ఆ పార్టీకి తీవ్ర నష్టం చేశాయన్న విశ్లేషణలున్నాయి. స్థానిక సంస్థలు దగ్గరపడుతున్న తరుణంలో ఇప్పుడూ అదే తీరు కొనసాగుతుండటంతో పార్టీ శ్రేణులు తమ దారి తాము చూసుకునే పనిలో పడ్డాయంటున్నారు.


వైసీపీకి గుడ్‌బై చెప్పిన పలువురు వైసీపీ కీలక నేతలు

వైసీపీ ఘోరపరాజయం తర్వాత ఆ పార్టీ కీలక నేతల్లో పలువురు పార్టీ మార్చేశారు. ఇప్పటికీ ఒక్కొక్కరుగా పార్టీ మారిపోతున్నారు. మిగిలిన వారిలో కూడా పలువురు అవకాశమిస్తే కూటమి పార్టీల్లోకి క్యూ కట్టడానికి సిద్దంగా ఉన్నారంటున్నారు. వైసీపీ తన వైఖరి వల్లే ప్రజల్లో మరింత వ్యతిరేకత తెచ్చుకుంటోంది. ఇటీవల అమరావతిపై సొంత ఛానల్‌లో అక్కసు వెళ్లగక్కి తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకుంది. అమరావతి రాజధానిపై సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కృష్ణంరాజు అనే జర్నలిస్ట్‌ చేసి వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారి తీశాయి.


వరుసగా అరెస్ట్ అవుతున్న జగన్ సన్నిహితులు

రెడ్‌బుక్ ఎఫెక్ట్‌తో అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం వ్యవహరించి వైసీపీ నేతలు, జగన్ సన్నిహితులు వరుసగా జైలు బాట పడుతున్నారు. అయినా జగన్ టీమ్ వైఖరి మారకపోతుండటంతో కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఆ క్రమంలో వైసీపీకి మంత్రి నారా లోకేష్ వరస సవాళ్లతో ఆ పార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. మొన్న విశాఖలో అర్సా భూ కేటాయింపులపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి లోకేష్ సవాలు విసిరితే వైసీపీ నేతలు స్పందించ లేదు. తాజాగా తల్లివందనం పథకంపై ఆరోపణలు నిరూపించాలని సవాలు చేశారు. తల్లికి వందనం పథకంపై వైసీపీ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్టులు పెట్టి ఆరోపణలు గుప్పించింది.

సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్.. అని యద్దేవా..

వైసీపీ ప్రచారంపై లోకేష్ తీవ్రంగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించడానికి 24 గంటల సమయం ఇచ్చిన ఆయన.. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. లోకేష్ సవాలుపై జగన్ సహా ఆ పార్టీ నేతలు ఎవరూ నోరు మెదపకపోవడం విమర్శల పాలవుతోంది. ఇచ్చిన గడువు ముగియడంతో లోకేష్ .. సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్ .. అంటూ సోషల్ మీడియాలో ఎద్దేవా చేశారు. తదుపరి చర్యలకు సిద్దంగా ఉండాలని మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

జగన్ ఏకపక్ష నిర్ణయాలతో తీవ్రంగా నష్టపోయిన వైసీపీ

గత వైసీపీ ప్రభుత్వంలో కొందరు నేతలు చేసిన పనులు, కొందరు కార్యకర్తలు, అధినేత జగన్‌ వ్యవహార శైలి, ఆయన ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాలతో ఆ పార్టీకి తీవ్ర నష్టం జరిగిందన్న విశ్లేషణలు ఉన్నాయి. దాంతో గత సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి జిల్లాలు సహా, వివిధ జిల్లాల్లో వైసీపీ తుడుచుపెట్టు కుపోయింది. ఇటీవల జరిగిన టీచర్స్‌, పట్టభద్రు ల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ వైసీపీ ఊసే వినిపించలేదు. దీంతో నేతలతోపాటు, కార్యకర్తలు దిగాలు పడుతున్నారు. దీనికితోడు స్థానిక సంస్థలైన పం చాయతీలు, మునిసి పాలిటీలు, జడ్పీల్లోనూ ఉన్న వైసీపీ ప్రతినిధులు నెమ్మదిగా జారుకుం టున్నా రు.

ఇప్పటికీ మారని వైసీపీ నేతల వ్యవహారశైలి

ఇప్పటికి కూడా వైసీపీ అధ్యక్షుడు, ఇతర నేతల వ్యవహారాశైలి మార్చుకోవడం లేదని.. రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ప్రతినిధులు కూటమిలో చేరిపోతున్నారు. ఇంకా అనేక మంది పార్టీ మారాలని చూస్తున్నా ఇటు ఆమోదం లభించడంలేదు. ఇటీవల టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పార్టీ ఎమ్మెల్యేలకు ఒక వర్తమానం పంపారు. వైసీపీ నుంచి వచ్చే వారిని ఇష్టానుసారం పార్టీలో చేర్చుకోవద్దని.. ముందు తమకు సమాచారం ఇచ్చి.. ఆమో దం పొందిన తర్వాతే చేర్చుకోవాలని ఆదేశించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీని వాస్‌ కూడా ఈ విషయాన్ని బహిరంగంగానే ప్రకటించారు.

కూటమి పార్టీల్లో చేరడానికి వైసీపీ నేతల యత్నాలు

ఆ క్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ల్లో చాలామంది వైసీపీ నేతలు కూటమిలో చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నా గ్రీన్ సిగ్నెల్ రావడం లేదంట. స్థానిక ఎమ్మెల్యేలు కూడా ఆయా మునిసిపాలిటీలు, స్థానిక సంస్థల్లో అక్రమాలకు పాల్పడి ప్రజల్లో చెడ్డపేరు తెచ్చుకున్నవారిని చేర్చుకోవ డానికి ఇష్టపడడం లేదంట. కొందరు వస్తామన్నా వద్దని చెబుతున్నారు. ఇతరులను లాక్కోవడా నికి ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదు. వచ్చే ఏడాది వరకూ స్థానిక సంస్థల ఎన్నికలకు గడువు ఉంది. కానీ నాలుగేళ్లు పూర్తవడంతో మునిసిపల్‌ చైర్మన్లు, సర్పంచ్‌లు, జడ్పీ చైర్మన్లపై అవిశ్వాస తీర్మానాలు పెడు తున్నారు. వచ్చే మార్చి నాటికి మునిసిపల్‌ పాలకవర్గాల గడువూ ముగిసిపోతోంది. 2026 సెప్టెంబరు నాటికి జడ్పీటీసీలకు ఐదేళ్లు పూర్తవుతాయి. ఇంతలో కంగారు ఎందుకనేలా కూటమి నేతలు ఉన్నా రు. వైసీపీలో మిగిలి ఉన్న ఎక్కువమంది టీడీపీ, జనసేనల వైపు మొగ్గు చూపుతున్నా ఆమోదం లభించడం లేదంటున్నారు.

Also Read: సైలెంట్ మోడ్‌లో గుడివాడ.. మళ్లీ యాక్టివ్ అవుతారా?

వివిధ జిల్లాల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన వైసీపీ

మునిసిపల్‌ పాలకవర్గాలకు 2021 మార్చి 10న ఎన్నికలు జరిగాయి. 18వ తేదీన చాలా ప్రమాణ స్వీకారాలు జరిగాయి. ఈ ఏడాది మార్చి 18తో పాలకవర్గాలకు నాలుగేళ్లూ నిండిపోయాయి. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో వైసీపీ అధికారం అండతో వాటిని కైవసం చేసుకుంది. అప్పుడు గెలిచిన వారంతా .. ఇప్పుడు సైలెంట్ అయ్యారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం కూటమి పార్టీల్లోకి క్యూ కట్టడానికి రెడీగా ఉన్నారు. మొత్తానికి వైసీపీ పరంగా వరుసగా జరుగుతున్న తప్పిదాలతో ఆ తమ దారి తాము చూసుకోవడం బెటర్ అని వైసీపీ శ్రేణులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది.

-Story By Apparao, Bigtv Live

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×