OTT Movie : జోహన్నెస్‌బర్గ్ క్రిమినల్ సామ్రాజ్యంలో మసిరే కుటుంబం అధిపత్యం చెలాయిస్తుంది, కానీ వారి కుటుంబం సూపర్‌న్యాచురల్ శక్తుల శాపం కారణంగా ప్రమాదంలో పడుతుంది. సీజన్ 3లో, మో మసిరే, వెరోనికా మసిరే కొత్త శత్రువులను ఎదుర్కొంటారు. ఈ సామ్రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవడానికి అసాధ్యమైన ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందం ప్రమాదకరంగా మారుతుంది. ఇది మసిరే సామ్రాజ్యాన్ని కూల్చివేయడమే కాకుండా, వారి కుటుంబ సభ్యుల జీవితాలను కూడా ప్రమాదంలోకి నెట్టివేస్తుంది. ఈ కొత్త శత్రువు ఎవరు? మర్మమైన మెర్మైడ్ శాపం మసిరేలను ఎలా ప్రభావితం చేస్తుంది? మో ఈ గందరగోళాన్ని ఆపగలడా? ఈ సినిమా పేరు. ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళితే ..
స్టోరీలోకి వెళితే
ఈ స్టోరీ జోహన్నెస్‌బర్గ్ లోని మసిరే కుటుంబం క్రిమినల్ సామ్రాజ్యం చుట్టూ తిరుగుతుంది. సీజన్ 2 ముగింపులో సైమన్ మసిరే అనూహ్యంగా మిస్సింగ్ అవుతాడు. మో మసిరే కుటుంబ బాధ్యతలను స్వీకరించడంతో, సీజన్ 3 మో నాయకత్వంపై దృష్టి పెడుతుంది. సైమన్ సోదరి అయినటువంటి వెరోనికా, తన గత 20 సంవత్సరాల సెక్రెట్స్ ను ఎదుర్కొంటూ కుటుంబాన్ని ఏకం చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ సీజన్ కేప్ టౌన్ కింగ్‌పిన్‌తో ఒక అసాధ్యమైన ఒప్పందం చుట్టూ తిరుగుతుంది. ఇది మసిరేలను కొత్త శతృత్వానికి దారితీస్తుంది. ఈ కొత్త శత్రువు మసిరే ఆధిపత్యాన్ని సవాలు చేస్తుంది.
సీజన్ 3 డ్రగ్ ట్రాఫికింగ్, హైస్ట్‌లు, అంతర్గత కుటుంబ డైనమిక్స్‌పై దృష్టి సారిస్తుంది. అయితే మెర్మైడ్ శాపం మరింత రక్తపాత డిమాండ్‌లతో కథకు మిస్టికల్ లేయర్‌ను జోడిస్తుంది. మరో వైపు కొత్త డిటెక్టివ్ మసిరేలను విచారణ చేయడానికి వస్తాడు. ఆతరువాత స్టోరీ ఓ రేంజ్ లో నడుస్తుంది. చివరికి కేప్ టౌన్ కింగ్‌పిన్‌తో చేసిన ఒప్పందం వెనుక నిజమైన ఉద్దేశ్యం ఏమిటి ? ఇది మసిరే సామ్రాజ్యాన్ని ఎలా ప్రమాదంలోకి నెట్టివేస్తుంది? అనే విషయాలను ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను చూసి తెలుసుకోండి.
Read Also : పాటల ప్రపంచంలో రారాజుగా ఓ అనాథ … ప్రియురాలితో స్టేజ్ షో లు … దుమ్ముదులుపుతున్న పంజాబీ మూవీ
ఈ దక్షిణాఫ్రికా క్రైమ్ ఫాంటసీ వెబ్ సిరీస్ పేరు ‘Kings of Jo’burg’. షోనా ఫెర్గూసన్ సృష్టించిన ఈ సిరీస్ జోహన్నెస్‌బర్గ్‌లోని క్రిమినల్ అండర్‌వరల్డ్‌ను నడిపించే మసిరే కుటుంబం చుట్టూ తిరుగుతుంది. ఇందులో క్రైమ్, డ్రామా, సూపర్‌న్యాచురల్ అంశాలు కలిసి ఉంటాయి. ఈ సీజన్‌లో కొన్ని రివ్యూలు బలహీనంగా ఉన్నప్పటికీ, దాని బోల్డ్ స్టోరీలైన్ మరియు క్యారెక్టర్ డైనమిక్స్ కారణంగా ఇది దక్షిణాఫ్రికా ఆడియన్స్‌లో ప్రజాదరణ పొందింది. ఇది నెట్‌ఫ్లిక్స్ ( Netflix) ఓటీటీలో 2025 జూన్ 13న ఈ సిరీస్ విడుదలైంది.