BigTV English

YS Jagan: మళ్లీ పాదయాత్ర చేస్తా ఎప్పుడంటే..? జగన్ సంచలనం

YS Jagan: మళ్లీ పాదయాత్ర చేస్తా ఎప్పుడంటే..? జగన్ సంచలనం

YS Jagan: వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ మరోసారి పాదయాత్రకు సిద్ధమయ్యారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు పాదయాత్ర ఉంటుందని ఆయన ప్రకటింటారు. అంతకముందు రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల పర్యటన ఉంటుందని నేతలకు వివరించారు. 2019 ఎన్నికల ముందు పాదయాత్ర చేసి.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.


ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత.. వరుసగా వైసీపీ నేతలపైన కేసులు పెట్టడం.. ఇతరత్రా అన్ని జరగడం.. వీటన్నిటిపైన జగన్ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈరోజు జరిగిన వైఎస్ఆర్సీపీ యువజన విభాగం సమావేశంలో.. మరొకసారి పాదయాత్ర చేపట్టబోతున్నట్లుగా జగన్ ప్రకటించారు. ఇప్పటికే ఓ వైపు సీఎం చంద్రబాబు ఎన్నికల్లో సూపర్ సిక్స్ అమలు చేస్తామంటూ అనేక హామీలు ఇచ్చారు. కానీ హామీలు అమల్లో విఫలమయ్యారంటూ పదేపదే విమర్శిస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు.. మరోసారి పాదయాత్ర చేపట్టబోతున్నానంటూ జగన్ చెప్పారు.

మీ అందరి భవిష్యత్తు తన చేతుల్లో ఉంది. నాయకులుగా నేను తయారు చేస్తాను. మీరు కూడా ప్రజల్లోకి వెళ్లండి అంటూ.. యువజన విభాగం నేతలకు దిశానిర్దేశం చేశారు. వాస్తవానికి ప్రజాసంకల్ప యాత్ర చూసినట్లైతే.. 2017 నవంబర్ 6 నుంచి దాదాపు 341 రోజులపాటు పాదయాత్ర కొనసాగింది. 2019 జనవరి 9వ తారీఖు వరకు దాదాపు 3648 కిలోమీటర్లు పైగా ఈ పాదయాత్ర కొనసాగించారు. మొత్తం మీద ఇది ఒక రాజకీయనాయకుడు చేపట్టిన అతిపెద్ద పాదయాత్ర అని చెప్పొచ్చు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు, లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. వాళ్లు తిరిగి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పరిస్థితి నెలకొంది.


Also Read: వైసీసీ నేతలకు మబ్బు వీడింది.. ఫోరెన్సిక్ నివేదిక, రంగంలోకి పోలీసులు, అరెస్టుల వంతు

అధికారంలోకి రావాలంటే.. మరొకసారి పాదయాత్ర చేయాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అన్నారా లేకుంటే.. ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ హామీలు అమల్లో ప్రభుత్వం విఫలమైంది. అలానే కక్ష్యపూరిత రాజకీయాలకు పాల్పడుతుంది. వైఎస్ఆర్‌సీపీ నేతలపైన కేసులు నమోదు చేస్తూ.. వాళ్లని జైలుపాలు చేస్తుందంటూ.. పదేపదే విమర్శిస్తూ వస్తున్న జగన్ మరోసారి పాదయాత్ర అయితే ప్రకటించారా అని ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి ప్రకటన దశలో ఉంది. ఎప్పుడు ప్రారంభిస్తారు.. ఎక్కడి నుంచి ఎక్కడివరకు ఆయన పాదయాత్ర ఉంటుందనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. గతంలో జగన్ పాదయాత్రలన్నిటినీ కూడా ఎమ్మెల్సీ రఘురాం ఆయన పర్యవేక్షణలో జరిగాయి. తిరిగి మరోసారి ఆయనకే ఈ భాధ్యతలన్ని అప్పజెప్పి రూట్ మ్యాప్‌లన్నిటినీ కూడా సిద్దం చేయించే అవకాశం కనిపిస్తోంది.

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×