టెక్నాలజీ రోజు రోజుకు మరింత అభివృద్ధి చెందుతోంది. ఏఐ, రోబోట్ లు మనుషుల పనిని మరింత సులభతరం చేస్తున్నాయి. అదే సమయంలో ఏఐ కారణంగా చాలా మంది నిరుద్యోగులుగా మారిపోతున్నారనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక టెక్నాలజీలో ముందుండే జపాన్ మరో ముందడుగు వేసింది. ఏఐ సరికొత్త ఆవిష్కరణకు కారణం అయ్యింది అక్కడ ఏకంగా ఏఐ స్టోర్ ఓపెన్ అయ్యింది. ఈ షాప్ ను ఓ రోబో నడిపిస్తుండగా, దానితో ఏఐ పని చేయించడం విశేషం. లాసన్ అనే కంపెనీ టోక్యోలోని మినాటోలో ఈ ఫ్యూచర్ స్టోర్ ను పైలెట్ ప్రాజెక్టు ఓపెన్ చేసింది.
ఈ కొత్త స్టోర్ ప్రత్యేకత ఏంటి?
ఈ స్టోర్ సాధారణ సూపర్ మార్కెట్ కాదు. ప్రతి కస్టమర్ కృత్రిమ మేధస్సు ద్వారా పర్యవేక్షించబడతారు. వస్తువులను సెలెక్ట్ చేసుకునే సమయంలో రోబో సాయం చేస్తుంది. స్టోర్ లోని కెమెరాలు దుకాణదారుడి కదలికలను విశ్లేషిస్తాయి. ఒక వ్యక్తి ఏ వస్తువు ఎక్కడుందో తెలియకపోయినా, ఇప్పటికే ఆ వినియోగదారుడు ఆ ప్రొడక్ట్ ను కొనుగోలు చేసినా, డిజిటల్ ధరకు సంబంధించిన ట్యాగ్ ఆటోమేటిక్ గా రేటింగ్‌లు, డిస్కౌంట్ సమాచారాన్ని డిస్ ప్లే చేస్తుంది.
ఏఐ ఎంత వరకు జోక్యం చేసుకుంటుంది?
లాసన్ కంపెనీ ఈ వ్యవస్థలో KDDI కార్పొరేషన్ కు సంబంధించిన డిజిటల్ టెక్నాలజీలను ఉపయోగించారు. మరో మాటలో చెప్పాలంటే, అన్ని అంశాలు ఏఐ ద్వారా మానీటర్ చేయబడుతాయి. సిఫార్సులు చేయడం, ప్రవర్తనను విశ్లేషించడం, ఉత్పత్తులను ఎంచుకోవడం లాంటి పనులు ఏఐ ద్వారా నిర్వహించబడతాయి. షాపింగ్ అనుభవాన్ని మెరుగుపరచడమే కాకుండా కస్టమర్ అవసరాలను ప్రత్యక్షంగా అంచనా వేయడానికి కూడా ఉపయోగపడుతుంది.
స్టోర్ లో ఉన్న ఇతర ప్రత్యేకతలు ఏంటి?
ఈ స్టోర్ లో స్పెషల్ గా చెప్పుకోవాల్సింది రోబో చెఫ్ లు. ఈ చెఫ్ లో రెడీమేడ్ ఫుడ్ తయారు చేస్తారు. అంతేకాదు, స్టోర్ చుట్టూ కూల్ డ్రింక్స్ ప్యాకేజీలను తరలించడంలోనూ రోబోలు సాయపడుతాయి. కొనుగోలు చివరిలో, సెల్ఫ్ చెక్ అవుట్ అనేది నిజమైన సిబ్బంది ద్వారా కాకుండా వారి అవతార్ ద్వారా నిర్వహించబడుతుంది.
ఇది కేవలం టెస్టింగ్ కోసమేనా?
ప్రస్తుతం ఈ ప్రాజెక్టును కంపెనీ పైలెట్ ప్రాజెక్టుకు అమలు చేస్తోంది. వ్యవస్థ పనితీరను పూర్తి స్థాయిలో అంచనా వేసేందుకు దీనిని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే, దేశ వ్యాప్తంగా వీటిని విస్తరించాలనే ఆలోచనలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది.
నిజానికి జపనీస్ స్టోర్ లలో చాలా వరకు రోబోలు అందుబాటులో ఉన్నాయి. కానీ, ఇప్పటి వరకు పూర్తిగా రోబోలు, ఏఐ ద్వారా నడిచే స్టోర్ అనేది లేదు. కొత్త ఓపెన్ అయిన ఈ స్టోర్ భవిష్యత్ లో మరింత విస్తరించే అవకాశం ఉంటుంది. స్టోర్ లోని ఏ వస్తువులను కొనాలో కస్టమర్లకు చెప్పడం నుంచి, బరువైన వస్తువులను ఎత్తడం, కస్టమర్ల కోసం ఫుడ్ రెడీ చేయడం లాంటి విధానాలు మరింత కొత్తగా ఉన్నాయి.
Read Also: ఇంకా IRCTC అకౌంట్ కు ఆధార్ లింక్ చెసుకోలేదా? టికెట్లు బుక్ చెయ్యలేరు!