Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ (Atlee) కలిసి ఒక భారీ సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా ఈ కాంబినేషన్ గురించి చర్చ జరుగుతునే ఉంది. కానీ ఈ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. కాబట్టి, ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు? అనే విషయంపై స్పష్టత లేదు. అయితే, సోషల్ మీడియా మరియు సినీ వర్గాల్లో మాత్రం ఫలానా హీరోయిన్ ఫైనల్ అయినట్టుగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటించనున్నానరనే టాక్ ఉంది. అందులో దేవర బ్యూటీ జాన్వీ కపూర్ (Janhvi Kapoor) లీడ్ రోల్‌లో నటించనుందని.. మిగతా హీరోయిన్లలో ఇద్దరు ఫారినర్స్ కూడా ఉంటారనే వార్తలు వచ్చాయి. మిగతా ఇద్దరు ముద్దుగుమ్మలు సౌత్ హీరోయిన్లను పరిశీలిస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ కమ్ హాలీవుడ్ బ్యూటీని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది.
బన్నీ కోసం SSMB29 బ్యూటీ?
మహేష్ బాబు (Mahesh babu), రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో వస్తున్న ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ ప్రస్తుతం జెట్ స్పీడ్‌లో జరుగుతోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కీలక పాత్రలో నటిస్తోంది. ముందుగా హీరోయిన్ అని ప్రచారం జరిగింది. కానీ ఆ తర్వాత ఆమె హీరోయిన్ కాదు.. విలన్‌గా నటిస్తుందనే వార్తలు వచ్చాయి. ఫైనల్‌గా.. అమ్మడు విలన్ లవర్‌గా అదిరిపోయే పాత్రలో నటించనున్నట్టుగా సినీ వర్గాలు తేల్చాయి. ఈ సినిమాలో మళయాళ హీరో కమ్ డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నట్టుగా టాక్ ఉంది. ఆయన ప్రియురాలిగా ప్రియాంక చోప్రా కనిపించనుందట. ఇటు బాలీవుడ్‌తో పాటు అటు హాలీవుడ్‌లో ప్రియాంక చోప్రాకు మంచి క్రేజ్ ఉంది. అందుకే.. ఎస్ఎస్ఎంబీ 29లో జక్కన్న ఆమెను తీసుకున్నాడు. ఇక ఇప్పుడు అల్లు అర్జున్, అట్లీ సినిమాలోను పింకీనే తీసుకోబోతున్నట్టుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే.. ఆమె మెయిన్ హీరోయినా? కాదా? అనేదే ఇక్కడ డౌట్?
జాన్వీ కపూర్ పరిస్థితేంటి?
దేవర సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన శ్రీదేవి తనయ జాన్వీ కపూర్.. ప్రస్తుతం రామ్ చరణ్‌తో పెద్ది సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే.. అల్లు అర్జున్‌తో ఛాన్స్ కొట్టేసిందని అన్నారు. కానీ ఇప్పుడు ఊహించని విధంగా ప్రియాంక చోప్రా రేసులోకి దూసుకొచ్చింది. ఈ చిత్రంలో నటించడానికి పింకీ ఏకంగా రూ.30 నుంచి 40 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్టుగా చెబుతున్నారు. అయినా కూడా ఆమెను అట్లీ దాదాపుగా ఫైనల్ చేశారట. అయితే.. ఐదుగురు హీరోయిన్లలో ప్రియాంక చోప్రా కూడా ఒకరా? లేదంటే ఆమెనే మెయిన్ లీడ్‌లో నటించనుందా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. కానీ ప్రియాంక బన్నీకి సూట్ అవదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ ముదురు బ్యూటీ బన్నీ సరసన సెట్ అవదని అల్లు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ లేకపోయినా.. ప్రియాంక ముదురుగా కనిపిస్తుందని అంటున్నారు. అయితే.. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. బన్నీ పుట్టినరోజు ఏప్రిల్ 8 వరకు వెయిట్ చేయాల్సిందే. ఆరోజు అట్లీ-బన్నీ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసే ఛాన్స్ ఉంది.