Big Stories

Viral Wedding Card: తెలంగాణ యాసలో వెరైటీ వెడ్డింగ్ కార్డ్.. సోషల్ మీడియాలో వైరల్!

Telangana Slang Wedding Card: భారతీయ సాంప్రదాయంలో పెళ్లికి ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం పెళ్లి. వివాహం ఘనంగా జరుపుకోవాలని ప్రతీ ఇక్కరూ అనుకుంటారు. అందులో భాగంగానే నేటి తరం ప్రీ వెడ్డింగ్ షూట్ లని, మరికొందు సంగీత్ లని, ఇంకొందరు మంగళ స్నానాల వంటి కార్యక్రమాలతో  ఘనంగా పెళ్లిల్లు జరుపుకుంటున్నారు. అయితే మరికొందరు మాత్రం వెరైటీ వెడ్డింగ్ కార్డులతో పెళ్ళిల్లకు ఆహ్వానం పలుకుతున్నారు. తాము అందరికంటే భిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారు. అందులో భాగంగానే తమ క్రియేటివిటీని జోడించి వెరైటీ వెడ్డింగ్ కార్డులతో ట్రెండ్ సెట్ చేస్తున్నారు.

- Advertisement -

జగిత్యాలకు చెందిన ఓ పెళ్లి కొడుకు కూడా వెరైటీగా వెడ్డింగ్ కార్డు తయారు చేయించాడు. తెలంగాణ యాసలో కార్డ్ ప్రింట్ చేయించాడు. భీమారం మండలం ఈదుల లింగంపేటకు చెందిన వెల్మల గౌతమ్​ రెడ్డి, సుగుణ దంపతుల చిన్న కొడుకు సతీశ్​రెడ్డి తన పెళ్లి కార్డును ఎప్పటికీ గుర్తుండిపోయేలా వినూత్నంగా తయారు చేయించాడు. ఈ రోజు సతీష్ రెడ్డి , రుచితల వివాహం జరుగుతుండగా..వెల్మలోళ్ల లగ్గం పిలుపు అంటూ కార్డ్ ప్రింట్ చేయించారు.

- Advertisement -

Also Read: పండ్లు VS పండ్ల రసాలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్ ?

యాదించుకొని పిల్లా, జెల్లా, ముసలి, ముత్క అందరూ వచ్చి దీవెనార్తి ఇచ్చి కడుపు నిండా తిని పోతే మా దిల్ కుష్ అయితంటూ తెలంగాణ యాసలో వెడ్డింగ్ కార్డ్ ప్రింట్ చేయించారు. లగ్గం యాడనో ఎర్కన అంటూ పెళ్లి జరిగే ప్రాంతం పేరు, అర్సుకునేటోళ్లు, పిలిశేటోల్ల పేర్లు తెలిపారు. ప్రస్తుతం ఈ కార్డు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News