YS Sharmila : వైఎస్ షర్మిల వదినమ్మకు సపోర్ట్‌గా నిలిచారు. భారతిపై ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను చీల్చి చెండాడారు. అలాంటి మాటలు తీవ్రవాదంతో సమానమని మండిపడ్డారు. ఆ సైకో గాళ్లను నడిరోడ్డు మీద ఉరి తీయాలని డిమాండ్ చేశారు. తప్పుడు కూతలు కూసిన వెధవలపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రేటింగ్స్ కోసం పిచ్చి వార్తలు రాసే యూట్యూబ్ ఛానెళ్లపైనా చర్యలు ఉండాలన్నారు. ఇలాంటి చెత్త చేష్టలు చేసే వాళ్లు ఏ పార్టీ అయినా, ఎంతటి వారైనా శిక్ష పడాల్సిందేనని తేల్చిచెప్పారు షర్మిల.
అంతా మీవల్లే.. సైతాన్ సైన్యం..
ఇటు భారతికి మద్దతు ఇస్తూనే.. అటు వైసీపీ, టీడీపీలపైనా అటాక్ చేశారు షర్మిల. ఇలా వ్యక్తిత్వ హననానికి పాల్పడే నీచ వ్యవస్థ ఏపీలోనే ఉందంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ విష సంస్కృతికి బీజం వేసిందే వైసీపీ, టీడీపీ అంటూ మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే సైతాన్ సైన్యానికి ఆ రెండు పార్టీలే ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా జగనన్నపైనా దారుణమైన కామెంట్స్ చేశారు.
జగన్‌పై డైరెక్ట్ అటాక్
అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఉచ్చం, నీచం, మానం, మర్యాద లేకుండా ప్రవర్తించారని.. రక్త సంబంధాన్ని మరిచారని.. జగన్ టార్గెట్‌గా ఘాటైన విమర్శలు చేశారు షర్మిల. రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగారని.. మనిషి పుట్టుకను అనుమానించి రాక్షసానందం పొందారని తీవ్రంగా మండిపడ్డారు. అన్యం పుణ్యం ఎరుగని పసి పిల్లలను సైతం ఇందులోకి గుంజారని వాపోయారు. షర్మిల చేసిన ఈ కామెంట్స్ అన్నీ నేరుగా జగన్‌ను ఉద్దేశించే అని అంటున్నారు. అన్నాచెల్లిల మధ్య విభేదాలు వచ్చినప్పుడు షర్మిలను ట్రోల్ చేస్తూ.. వైసీపీ సోషల్ మీడియా పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టింది. షర్మిల అసలు వైఎస్సార్ కూతురే కాదనే మీనింగ్ వచ్చేలా వ్యాఖ్యలు చేశారు. వాటిని గుర్తు చేస్తూ.. ఇప్పుడు షర్మిల ఇలా హాట్ కామెంట్స్ చేశారని చెబుతున్నారు.
మీ కాలకేయులే..
మీరు పెంచి పోషించిన కాలకేయులే ఇప్పుడు వ్యవస్థను భ్రష్టు పట్టించారని.. ఈ దారుణ సంస్కృతిని వెలివేయడానికి అన్ని పార్టీలు ముందుకు రావాలని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల పిలుపు ఇచ్చారు. సోషల్ మీడియాలో దారుణ ప్రచారాన్ని షర్మిల తీవ్రంగా ఖండించారు.
Also Read : ఏపీ పాలిటిక్స్‌లో కవిత కలకలం..
షర్మిల స్ట్రాంగ్ మెసేజ్
జగన్‌తో గొడవలు ఉన్నా కూడా.. వదినపై కోపం ఉన్నా.. భారతిపై టీడీపీ కార్యకర్త కిరణ్ చేసిన దారుణమైన కామెంట్స్‌ను ఖండిస్తూ తన రాజకీయ పరిణితిని చాటుకున్నారు షర్మిల. అదే సమయంలో సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్య, అసభ్య ప్రచారాలకు మీరే కారణం అంటూ వైసీపీని బోనులో నిలబెట్టారు. వైఎస్ షర్మిల చేసిన ట్వీట్ ట్రెండింగ్ అవుతోంది. అందరినీ ఆలోచింపజేస్తోంది.
భారతి రెడ్డి గారి మీద సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చాలా బాధాకరం. ఇలాంటి నీచపు కామెంట్స్ తీవ్రవాదంతో సమానం. ఈ సైకో గాళ్లను నడి రోడ్డు మీద ఉరి తీసినా తప్పులేదు. తప్పుడు కూతలు కూసిన వెధవలను, రేటింగ్స్ కోసం ఎంటర్ టైన్ చేసే యూట్యూబ్ ఛానళ్లపై కఠిన చర్యలు ఉండాల్సిందే. కూటమి…
— YS Sharmila (@realyssharmila) April 11, 2025