BigTV English

YSRCP Narasaraopet MP Seat : వైసీపీకి తలనొప్పిగా నరసరావుపేట పంచాయితీ.. కొత్త అభ్యర్థి కోసం సీఎం వేట

YSRCP Narasaraopet MP Seat : వైసీపీకి తలనొప్పిగా నరసరావుపేట పంచాయితీ.. కొత్త అభ్యర్థి కోసం సీఎం వేట

YSRCP Narasaraopet MP Seat : నరసరావుపేట ఎంపీ శ్రీకృష్ణ దేవరాయులు వైసీపీకి రాజీనామా చేయడంతో ఆ పార్టీ అధిష్టానం, పల్నాడు నేతల్లో అయోమయం మొదలైంది. అధిష్టానం ఎంపీ అభ్యర్థి వెంటపడింది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి మంగళవారం రాత్రి హుటాహుటిన తాడేపల్లికి వెళ్లారు. సీఎం జగన్ .. ఆయనతో చర్చించారు. గ్రౌండ్ లెవెల్ పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. ఇక.. తర్వాత ఎంపీగా ఎవరిని బరిలో దించితే బాగుంటుందనే దానిపై చర్చింది.


శ్రీకృష్ణ దేవరాయలు రాజీనామా చేయడంతో ఇప్పుడు ఎంపీ అభ్యర్థి పరిశీలనలో ఊహించని పేర్లు తెరపైకి వస్తున్నాయి. బుట్టా రేణుక, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మంత్రి విడదల రజనీల పేర్లు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరారు బుట్టా రేణుక. కానీ.. ఆమెకు గత ఎన్నికల్లో జగన్ సీటు సర్దుబాటు చేయలేకపోయారు. దీంతో.. ఆమె కాస్త అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈసారి కూడా తన సొంత ప్రాంతమైన రాయలసీమలో సీటు వచ్చే అవకాశం లేదు. దీంతో, ఆమెను నరసరావుపేట బరిలో దించాలని జగన్ బావిస్తున్నారు. స్థానికురాలు కాదు కాబట్టి.. జగన్ ప్రతిపాదనను ఆమె ఎంతవరకు స్వాగతిస్తారో తెలియదు.

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్నారు. అది కూడా కుదరకపోతే.. మంత్రి విడదల రజనీని నర్సారావుపేట అభ్యర్థిగా పోటీ చేయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గుంటూరు వెస్ట్ ఇంఛార్జ్ గా ఆమె పేరును ప్రకటించినా.. అక్కడ ఆమెకు వాతావరణం అనుకూలంగా కనిపించడంలేదు. దీంతో.. రజనీని నర్సారావు పేట ఎంపీగా పోటి చేయిస్తే బాగుంటుందని అధిష్టానం భావిస్తుంది. పల్నాడులో వైసీపీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఓ వైపు అసమ్మతి రాగాలు, మరోవైపు కీలకనేతల రాజీనాలు పార్టీకి తలనొప్పిగా మారాయి. జగన్ తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలే ఇంత వరకూ తీసుకొచ్చాయని వైసీపీ నేతలే చర్చించుకుంటున్నారు.


.

.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×