Botsa Vs Payyavula: అసెంబ్లీ కంటే మండలిలో అధికార-విపక్ష మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తాము చెప్పినట్టు వినాల్సిందేనన్నది విపక్ష వైసీపీ మాట. సభ వ్యవహారాల మంత్రి, ఛైర్మన్ అందుకు అంగీకరించలేదు. చివరకు వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. ఇంతకీ మండలిలో గందరగోళానికి కారణమేంటి? వార్తల్లో నిలిచేందుకు వైసీపీ ఈ విధంగా వ్యవహరిస్తుందా? అవుననే అంటోంది అధికార పక్షం.
బుధవారం ఉదయం నుంచి సభా సమావేశాలు ప్రారంభమయ్యాయి. వైసీపీ గతంలో లేవనెత్తిన అంశాలపై అధికార పక్షం మాట్లాడుతోంది. ఈ క్రమంలో సభకు ఆటంకం ఏర్పడడంతో పలుమార్లు వాయిదా పడింది. వైసీపీ సభ్యులు ఛైర్మన్ పోడియం వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీనిపై అధికార పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది.
చైర్మన్ పోడియం చుట్టూ 23 మంది మార్షల్స్ మెహరించారు. మార్షల్స్ రక్షణలో సభ కొద్దిసేపు కొనసాగింది. మార్షల్స్ ఏర్పాటుపై వైసీపీ పక్ష నేత బొత్స అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇదేం దుష్ట సంస్కృతి అని చెప్పారు బొత్స సత్యనారాయణ.
చివరకు మండలి ఛైర్మన్ ఛైర్మన్ మోషేన్‌రాజు జోక్యం చేసుకున్నారు. నిరసన తెలియజేసే హక్కు విపక్షానికి ఉందన్నారు. సీట్లలో కూర్చుని నిరసన తెలపాలన్నారు. లేకుంటే నిలబడి నిరసన చేయవచ్చు అన్నారు. దీనిపై ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. మార్షల్స్‌ను తొలగించమంటే తొలగిస్తామన్నారు. పోడియం ఎక్కి నిరసన తెలియ జేస్తామంటే అంగీకరించేది లేదని తేల్చిచెప్పారు. మా పద్దతుల్లో సభను తాము నడిస్తామన్నారు.
ALSO READ: జగన్ పై సీఎం చంద్రబాబు పంచ్‌లు
వెంటనే శాసనసభా వ్యవహారాలు, ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. సభలో ఎప్పుడు మార్షల్ చూడలేదని విపక్ష నేత బొత్స సత్యనారాయణ చెప్పడాన్ని తప్పుబట్టారాయన. ఆయనకు మెమరీలాస్ అయ్యిందేమోనన్న అనుమానం కలుగుతుందన్నారు. సభలో మార్షల్స్‌ని వైసీపీ ఎలా ఉపయోగించిందో మరిచి పోయారన్నారా అంటూ ప్రశ్నించారు.
ఒక్కసారి గతాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటే బెటరన్నారు.పెద్దల సభను చాలా గౌరవంగా నడిపాలని నిర్ణయించామన్నారు. ఆ గౌరవాన్ని కాపాడు కోలేనప్పుడు వాకౌట్ చేయాలని మీరు తీసుకున్న నిర్ణయం సరైనదేనన్నారు. వెంటనే బొత్స జోక్యం చేసుకున్నారు. గతంలో మా సభ్యులు వ్యవహరించిన తీరు, మాట్లాడిన మాటలు చాలా హుందాగా ఉన్నాయన్నారు. ఒక్కసారి అధికార పార్టీ సభ్యులు గుర్తు చేసుకోవాలన్నారు.
మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. ఆనాటి సభాపతి మీద వైసీపీ మంత్రులు ఏం చేశారో గుర్తు చేసుకుంటే మంచిదన్నారు. ఛైర్మన్ మీద ఎలాంటి భాషను ఉపయోగించారు? దానిపై సభలో పశ్చాత్తాపం ప్రకటిస్తారా లేదా అని ప్రశ్నించారు. నిరసనల మధ్య సభ కొన్ని నిమిషాల సేపు కొనసాగింది. నిరుద్యోగులను ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని, అందుకు నిరసనగా తాము సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు విపక్ష నేత బొత్స సత్యనారాయణ.
మండలి ఆవరణలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు విపక్ష నేత బొత్స. మా మీద మార్షల్స్‌ని ప్రయోగిస్తారా? ఇదేం సంస్కృతి అని మండిపడ్డారు. దీనికి నిరసనగా సభ నుండి వాకౌట్ చేశామన్నారు. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు? జాబ్ కాలండర్ ఎప్పుడిస్తారో చెప్పలేదన్నారు. డీఎస్సీ ఇస్తామని చెబున్నారని, ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. గ్రూప్-2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు మోసం చేశారని, ఇది అసమర్థ ప్రభుత్వమని మండిపడ్డారు.
మా మీద మార్షల్స్ ని ప్రయోగిస్తారా..? ఇదేం సంస్కృతి: బొత్స సత్యనారాయణ
అందుకే మేము సభ నుండి వాకౌట్ చేశాం
నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు..చెప్పండి
జాబ్ కాలండర్ ఎప్పుడిస్తారు చెప్పండి
డీఎస్సీ ఇస్తాం అని ఇవ్వలేదు
గ్రూప్-2 అభ్యర్థులను సీఎం చంద్రబాబు మోసం చేశారు
ఇది అసమర్థ ప్రభుత్వం… pic.twitter.com/VbAdw9eGJv
— BIG TV Breaking News (@bigtvtelugu) March 12, 2025