BigTV English

Chain Snatching: కూకట్‌పల్లిలో చైన్ స్నాచింగ్.. తాగేందుకు నీళ్లడిగి 2తులాల బంగారంతో పరారైన దొంగ

Chain Snatching: కూకట్‌పల్లిలో చైన్ స్నాచింగ్.. తాగేందుకు నీళ్లడిగి 2తులాల బంగారంతో పరారైన దొంగ

Chain Snatching: హైదరాబాద్ మహానగరంలో రోజు రోజుకి చైన్ స్నాచింగ్ కేసులు పెరిగిపోతున్నాయి. ముందుగా రెక్కీ నిర్వహిస్తున్న దుండగులు పథకం ప్రకారమే చోరీలకు పాల్పడుతున్నారు. ఒంటరి మహిళలు, వృద్ధులు టార్గెట్ చేసుకుని రాత్రి, పగలు అనే తేడా లేకుండా మెడలో గొలుసు లాక్కొని పారిపోతున్నారు.


తాజాగా కూకట్ పల్లి టెంపుల్ బస్టాండ్ దగ్గరలోని ఓ ఇంట్లో చోరి జరిగింది. తెల్లవారు జామున ఓ మహిళ ఇళ్లు ఊడుస్తుండగా అటుగా వచ్చిన వ్యక్తి త్రాగడానికి మంచినీళ్లు అడిగాడు. మంచినీళ్లు ఇవ్వడానికి ఇంట్లోకి వెళ్లిన మహిళను చూసి చుట్టు పక్కల ఎవరూ లేరని గమనించిన దొంగ చాకచక్యంగా ఇంట్లోకి చొరబడి ఆ మహిళ మెడలోని రెండు తులాల బంగారపు గొలుసుని దోచుకెళ్లాడు. భయంతో ఆ మహిళ ఆ దొంగ వెంట పరుగులు తీసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

మరోవైపు.. బస్సుకోసం ఎదురుచూస్తున్న ఓ వృద్ధురాలికి లిఫ్ట్ ఇస్తా అంటూ నమ్మించి, మెడలో గొలుసు లాక్కెల్లాడు చైన్ స్నాచర్. శ్రీకాకులం జిల్లా పలాస మండలం కోసంగిపురంలో జరిగింది ఈ ఘటన. భర్త కోసం హాస్పిటల్‌కి వెళ్లి వస్తున్న యశోదను చైన్ స్నాచర్ టార్గెట్ చేశాడు. మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకున్నాడు. ఓ తోటలోకి తీసుకెళ్లి కత్తితో బెదిరించాడు. మెడలో ఉన్న తాళిని తెంచుకెళ్లాడు. దీంతో ఆమె స్థానికులకు జరిగింది చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన కాశీబుగ్గ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఉదయంపూట అందరూ తిరుగుతన్న టైమ్ లోనే కేపీహెచ్‌లో ఇలాంటి ఘటన జరగడంతో.. కాలనీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చైన్ స్నాచర్లు ఇంతకి తెగించారా అంటూ కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన అంతా ఆ ఇంట్లోని సీసీ కెమరాలో రికార్డ్ అయింది. సీసీ పుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు పోలీసులు.

Also Read: చిత్తూరులో కాల్పులు కలకలం.. అసలేం జరిగింది? నలుగురి అరెస్ట్

ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. చిత్తూరులో యాక్షన్‌ సినిమాను తలిపించే సీన్‌ జరిగింది. తెల్లవారుజామున ఓ షాపింగ్‌ సెంటర్‌లోకి ఎంటరైన దొంగల ముఠా.. డమ్మీ గన్స్‌తో చోరికి యత్నించింది. యజమానిని బెదిరించి డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. చాకచక్యంగా దొంగల ముఠా నుంచి తప్పించుకున్న ఓనర్‌..షెటర్‌ను క్లోజ్‌ చేసి దొంగలను నిర్భందించాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

బుల్లెట్‌ ప్రూఫ్ జాకెట్స్‌తో రంగంలోకి దిగిన పోలీసులు ఆపరేషన్ చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా ఆక్టోపస్‌ను రప్పించారు. అప్పటికే స్థానికులతో కలిసి దొంగలు ఉన్న షాప్‌ను చుట్టుముట్టారు. తప్పించుకునేందుకు దొంగలు తీవ్రంగా ప్రయత్నించారు. పోలీసులు బిల్డింగ్‌లపై నుంచి జంప్‌ చేస్తూ వెంబడించారు. స్థానికులతో కలిసి నలుగురు దొంగలను పట్టుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. వారి కోసం గాలిస్తున్నారు. ఈ దొంగల ముఠా ఏపీకి చెందిన వారిగా గుర్తించారు. ఒకరు చిత్తూరుకు చెందినవాడు కాగా, ముగ్గురు అనంత, మరో ముగ్గురు కర్నూలు జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు పోలీసులు.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×