Gundeninda GudiGantalu Today episode November 18th: గత ఎపిసోడ్ లో.. మీనాతో కలిసి అత్తింటికి వెళ్లిన బాలు.. దారిలోనే ఆ సేటు షాక్ ఇచ్చి డబ్బులు కట్టాలని కారును తీసుకొని వెళ్తారు. ఇక ఇంటికి వెళ్లిన మీనాను ఇంట్లో వాళ్ళ ముందు అవమానిస్తాడు. ఇక ఇక్కడి నుంచి వెళ్లెవరకు ఏమి మాట్లాడొద్దు బాధ పడతారు. ఇంటికి వెళ్లిన తర్వాత ఎన్ని తిట్టినా పడతాను అని అంటుంది. ఇక సేటు దగ్గరకు వెళ్లిన బాలును షేటు దారుణంగా అవమానిస్తాడు. కాళ్ళు పట్టుకొని సారీ చెప్పాలని అనగానే నీ కారు వద్దు ఏమి వద్దు అని అక్కడ నుంచి వచ్చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ లో.. రోహిణికి యాక్సిడెంట్ అయ్యిందని దినేష్ చెప్పడంతో వాళ్ళ అమ్మ రోహిణికి ఫోన్లు చేస్తుంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా రోహిణి లిఫ్ట్ చేయదు. నా టెన్షన్స్ నాకుంటే మధ్యలో ఈవిడ ఒకటే ని రోహిణి వాళ్ళ అమ్మని బ్లాక్ చేస్తుంది.. ఇప్పుడే మనోజ్ ప్రభావతి రోహిణి దగ్గరకు వస్తారు. రోహిణిని మీ నాన్నతో పండగ పూట కూడా మాట్లాడుకున్నా ఉంటే ఏం బాగుంటుంది అమ్మ ఒకసారి ఫోన్ చెయ్ వాడు నేను మాట్లాడతాను మీరు ఒకసారి వెళ్లి వస్తే అందరికీ బాగుంటుంది కదా అనేసి రోహిణి అడుగుతుంది ప్రభావతి.. దానికి రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది. రోహిణి ప్రభావతి చెప్పినట్టు విని ఫోన్ చేస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చెప్తుంది. ఏమైంది అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఆంటీ అంటే ఇంకా నాన్న రాలేదు అక్కడ సిగ్నల్స్ లేవు అని చెప్పాను కదా అనేసి అంటుంది. అవునా అమ్మ అయితే ఇంకొకసారి ఫోన్ చేస్తే మీ నాన్నని దీపాలు పండుగకి ఇక్కడికి రమ్మని చెప్పు ప్రభావతి అంటుంది.
ఇక ప్రభావతి మనోజ్ రోహిణి చెప్పింది విని బయటకు వెళ్ళిపోతారు. రోహిణి విద్యకు కాల్ చేసి మలేషియా డ్రామా మళ్ళీ మొదలైంది అని చెప్తుంది. మలేషియా నాన్నని తీసుకురమ్మని చెప్తున్నారు. ఇకంగా పండక్కి మలేషియా కి వెళ్ళమని మా ఆంటీ చెప్తుందని రోహిణి విద్యతో అంటుంది. ఒక విద్యా సెటైర్లేస్తుంది ఇంకేం స్పెషల్ ఫ్లైట్ కి మీరిద్దరూ అక్కడికి వెళ్లేసి ఎంజాయ్ చేసారండి అని అంటుంది. దానికి కోపంతో రగిలిపోయిన రోహిణి ఏంటి కౌంటర్ ఇస్తున్నావా నీ ఫోన్ ని స్విచ్ ఆఫ్ చెయ్యి పండగ అయిపోయేంతవరకు నేను ఏదో ఒకటి మేనేజ్ చేసి మా నాన్న చేశాడని మా నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని ఏదో ఒకటి చెప్పేస్తానని రోహిణి అంటుంది. ఇప్పటికైతే ఈ గండం నుంచి బయట పడాలని అనుకుంటుంది రోహిణి.
ఇక బాలు తాగేసి ఇంటికి వస్తాడు. నా కారు పోయిందన్న విషయం నువ్వు అబద్ధం చెప్పావు అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వెళ్తావా అసలు అబద్ధాలు ఎందుకు చెప్పావు ఇంటి ఓనర్ కి నేను అసలు నిజం చెప్పాలి నాకు కారు సర్వీస్ కి ఇవ్వలేదు సేటు డబ్బులు కట్టలేదని తీసుకెళ్లాడని చెప్తానని అంటాడు. ఇక బాలు ఓనర్ తో మాట్లాడతానని అక్కడికి వెళ్తాడు ఇంట్లో వాళ్ళందరూ అతను మంచోడు కాదు అతను దగ్గరికి వెళ్ళదు అనేసి అన్నా కూడా బాలు వినకుండా ఇంటి ఓనర్ తలుపు తడతారు. ఇక మీనా వాళ్లు అక్కడ వాళ్ళు తలుపు తీయగానే ఏమైంది అందరూ కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చారని అడుగుతారు. మా రవ్వ లడ్డు చేసింది అది ఇద్దామని ఇక్కడికి వచ్చాము అని అంటే రవ్వ లడ్డు ఇవ్వడానికి ఇల్లంతా రావాలా అనేసి ఇంటి ఓనర్ భార్య అడుగుతుంది. కానీ మీనా మీకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చామని కవర్ చేస్తుంది. ఇక ఇంట్లోకి వెళ్ళగానే బాలు ఈ పూలగంప చేసిన పనికి నేను ఎన్నిసార్లు అవమానాలు ఎదుర్కొన్నాను నన్ను ఎంతమంది అన్నారు మా నాన్నను ఎంతగా ఇది చేసిందో మా నాన్న ఆరోగ్యం ఇలా అవడానికి ఈ పూలకంపే కారణం దీన్ని జీవితంలో క్షమించను అని మీనా ను గోరంగా అవమానిస్తాడు. ఇక పార్వతి తన కూతుర్ని అలా అనడంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన బాలు మీరు కన్నీళ్లు పెట్టుకోవద్దు అత్తయ్య గారు మీ కూతురు చేసిందానికి నాకు మూడు క్వార్టర్లు నీళ్లు వచ్చేవి మీరు ఏడవకండి ఎందుకంటే ఇప్పుడు నేను కదా భరించేది అని బాలు వాళ్ళ అమ్మతో అంటాడు.
తనకి పార్వతి అదేం లేదు బాబు తెలియక చేసింది కదా అవన్నీ మనసులో పెట్టుకోవద్దు అనేసి అంటుంది. బాలు మీనా ను తిట్టిన తిట్టు తిట్టకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ ముందర తిడతాడు. ఈ రోజులు నేను సంతోషంగా ఉన్నానని మా అమ్మ వాళ్ళ అనుకున్నారు కానీ ఈ మాటలు విన్న తర్వాత వీళ్ళందరూ బాధపడుతున్నారని మీనా అక్కడి నుంచి చెప్పకుండా వెళ్ళిపోతుంది. ఉదయం బాలు లేస్తాడు. పార్వతీ సుమతి బావ లేసాడు అమ్మ అనేసి అనగానే బాబు లేచావా టీ ఇవ్వమంటావా అని టీ తీసుకొచ్చి ఇస్తారు. అత్తయ్య గారు నేను రాత్రి ఏమైనా తప్పుగా మాట్లాడానా అంటే ఏం మాట్లాడలేదు బాబు అని అంటాడు ఏం సుమతి నువ్వైనా చెప్పు అంటే లేదు బావ అదేం లేదు మీరేం తప్పుగా మాట్లాడలేదు అని. ఇక శివుని అడిగితే శివ కూడా మీరేం తప్పుగా మాట లేదు బావ అనేసి అబద్ధం చెప్తాడు. స్నానానికి వేడి నీళ్లు పెట్టాను బాబు నీకు స్నానం చేసి రండి మీకు టిఫిన్ చేసి పెడతానని పార్వతి అంటుంది. ఇందాకటి నుంచి చూస్తున్నాను అన్ని మీరే చేస్తున్నారు ఆ పూలకంప ఏది కనిపించలేదు పూలు కోసుకోడానికి వెళ్లిందా అనేసి అడుగుతాడు. లేదు బాబు మీరు రాత్రి అన్న మాటలకి బాధపడి మీ ఇంటికి వెళ్ళింది అనేసి అంటారు. నన్ను ఇక్కడ వదిలేసి మా ఇంటికి వెళ్లడమేంది ఎవరైనా అత్తింట్లో తిడితే పుట్టింటికి వెళతారు.. దానికి శివ కౌంటర్ ఇస్తాడు మీరు పుట్టింట్లో తిట్టారు కదా బావ అందుకే అత్తింటికి వెళ్లిందని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఇక రేపటి ఎపిసోడ్ లో మీనా కోసం బాలు తన ఇంటికి వెళ్తాడు. ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్లో చూడాలి..