E-Paper
Advertisement

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?

జెడ్పీ పీఠం రేసులో బొత్స అనూష.. ప్రత్యర్థులకు గట్టి పోటీనా?
Advertisement

Botsa Anusha: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విజయనగరం జిల్లా పరిషత్ (ZP) పీఠం చుట్టూ సమీకరణాలు మునుపెన్నడూ లేనంతగా వేడెక్కుతున్నాయి. ఈసారి జడ్పీ చైర్మన్ స్థానం రిజర్వేషన్ బీసీ మహిళకు దక్కే అవకాశాలు బలంగా కనిపిస్తుండటంతో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ కుటుంబం నుంచి ఆయన కుమార్తె డాక్టర్ బొత్స అనూషను బరిలోకి దించేందుకు రంగం సిద్ధమైనట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.

టార్గెట్ ఏమాత్రం మిస్ కాకుండా..

బొత్స కుటుంబం నుంచి అనూష ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతుందనే అంశంపై గతంలోనే బొత్స సత్యనారాయణ స్వయంగా స్పష్టమైన సంకేతాలు ఇవ్వడం, జిల్లా రాజకీయాలు, క్షేత్రస్థాయి పరిణామాలపై ఆమెకు పూర్తి అవగాహన ఉండటం, గతంలోనే జిల్లావ్యాప్తంగా పర్యటించి కేడర్‌తో బలమైన సంబంధాలు ఏర్పరచుకోవడంతో బీసీ మహిళ రిజర్వేషన్ ఖరారైతే ఆమెనే టాప్ కంటెండర్‌గా రంగంలోకి దించాలని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అనూషకు పార్టీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు అప్పగించినప్పటికీ, చిన్న శ్రీనుపై టార్గెట్ ఏమాత్రం మిస్ కాకూడదనే పట్టుదలతో వైసీపీ ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఏ జడ్పీ పీఠం కోసమైతే చిన్న శ్రీను పార్టీ మారాడో, సరిగ్గా అదే స్థానంలో ఆయనను, ఆయన వర్గాన్ని రాజకీయంగా కోలుకోలేని విధంగా దెబ్బకొట్టాలని వైసీపీ నాయకత్వం భావిస్తోంది.

చిన్న శ్రీనుకు తగిలేలా..

Advertisement

ఈ పోరులో చిన్న శ్రీనుకు గట్టి చెక్ పెట్టాలంటే ఆయన స్థాయిని ఎదుర్కొనేలా బొత్స కుటుంబం నుంచి అభ్యర్థి బరిలో ఉండటమే కరెక్ట్ అని పార్టీ వర్గాలు గట్టిగా ఫిక్స్ అయ్యాయి. ఒకవేళ ప్రత్యర్థి కూటమి/టీడీపీ శిబిరం నుంచి చిన్న శ్రీను తన కుమార్తె సిరిని జడ్పీ రేసులో నిలిపినా, అనూషను ఢీకొట్టడం సులువు కాదని వైసీపీ లెక్కలు వేస్తోంది. దీని ద్వారా అటు పార్టీ పరంగా జడ్పీ పీఠాన్ని నిలబెట్టుకోవడంతో పాటు, ఇటు చిన్న శ్రీనుకు రాజకీయంగా, వ్యక్తిగతంగా గట్టి గుణపాఠం చెప్పవచ్చని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కేడర్‌ను మోహరించడంతో సహా ఎన్నికల బరిలోకి దూకేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని, అధిష్టానం నుంచి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ రావడమే తరువాయి అని వైసీపీ శ్రేణులు స్పష్టం చేస్తున్నాయి.

Also read: ఉప్పల్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ టీ20 మ్యాచ్.. బ్లాక్‌లో టికెట్ల విక్రయం.. నలుగురు అరెస్ట్!

Tags

Related News

బిగ్ బ్రేకింగ్.. అక్టోబర్ 15 నుంచి ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు!

సీఎం చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ భేటీ.. ఈ అంశాలపై కీలక చర్చ!

విశాఖ మేయర్ పీఠం కోసం తీవ్ర ఉత్కంఠ పోరు.. టీడీపీ, వైసీపీలో వినిపిస్తున్న పేర్లు ఇవే?

రాజమండ్రి మున్సిపల్ మేయర్ ఆశావహులకు బిగ్ షాక్.. తలకిందులైన లెక్కలు!

రోడ్లు, బ్రిడ్జి కోసం మెడకు ఉరి వేసుకుని నిరసన తెలిపిన గ్రామస్తులు.. ఎక్కడంటే?

విశాఖ మేయర్ రేసులో చాలామంది ప్రముఖులు.. బాలయ్య చిన్నకుమార్తె తేజస్విని కూడా!

స్థానిక సంస్థల ఎన్నికల వేళ సీన్ రివర్స్.. జనసేనలోకి వంగవీటి రాధా! విజయవాడ మేయర్‌గా బరిలోకి

Big Stories

Advertisement
×