Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 22వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి: మంచికాలం నడుస్తుంది. సోదరులతో కలిసి దూరప్రయాణాలు చేస్తారు. మీ అమ్మగారితో కలిసి ఆనందంగా గడుపుతారు. మీ చుట్టూ ఉన్నవారినందరినీ సంతోషంగా ఉంచుతారు. ఇతరుల వద్ద తీసుకున్న రుణాలు తీర్చివేస్తారు. ఈరోజు మీఅదృష్ట సంఖ్య 6, కలసివచ్చేరంగు తెలుపు రంగు, మేడిచెట్టుకి 21ప్రదక్షిణలు చేయండి. పంచదార నైవేద్యంగా సమర్పించండి.
వృషభ రాశి: నూతన వ్యాపారాలు లాభిస్తాయి. కళలకు సంబంధించిన విషయాల్లో ఆసక్తి చూపిస్తారు. గతంలో వదిలేసిన పనులు ఇతరుల జోక్యంతో పూర్తవుతాయి. కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. సంతానం విషయంలో శుభవార్త వింటారు. ఈరోజు మీఅదృష్టసంఖ్య 7, కలిసి వచ్చేరంగు ఎరుపురంగు, తెల్లజిల్లేడు పూవులతో గణపతిని పూజించండి.
మిథున రాశి: ముఖ్యమైన విషయాల్లో అధికారులను కలవాల్సి ఉంటుంది. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటారు. సమయానికి అనుకున్న పనులు పూర్తవకుండా ఆటంకాలు ఎదురవుతాయి. మీ సమయస్పూర్తితో చివరి నిమిషంలో అనుకున్నవి దక్కించుకుంటారు. ఈరోజు మీఅదృష్ట సంఖ్య 3, కలిసి వచ్చేరంగు ఎరుపురంగు, కందులు+దొడ్డు ఉప్పు+బెల్లం ఎర్రబట్టలో కట్టి 3 దారులవద్ద విడిచి పెట్టండి.
కర్కాటక రాశి: ఆకాశం ఉరిమి పిడుగు పడ్డా ఏ చింతాలేకుండా ఉంటారు. ప్రతి విషయానికి ఆందోళన చెందకుండా అవ్వాల్సిన సమయానికి అన్నీ అవుతాయనే వేదాంత ధోరణితో గడుపుతారు. పుణ్యక్షేత్ర దర్శనాలకై ఆరాలు తీస్తారు. ఈరోజు మీఅదృష్ట సంఖ్య5, కలిసివచ్చేరంగు: కాషాయం రంగు
సింహరాశి: స్వప్నావస్థలో గడుపుతుంటారు. ధనం నీళ్ళలా ఖర్చు చేస్తారు. మీకంటే పెద్దవారు మీకు మంచి చెబితే నచ్చదు. ఎత్తు ప్రదేశాలలో తిరిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.ఈరోజు మీఅదృష్ట సంఖ్య 2, కలిసి వచ్చేరంగు పసుపు పచ్చరంగు, సూర్యనమస్కారాలు చేయండి.
కన్యారాశి : అర్థంలేని విషయాలన్నీ మీ ముందుకు వస్తాయి. టెండర్లు నిలిచిపోతాయి. రావాల్సిన ధనం అవసరానికి అందుతుంది. పోలీసు స్టేషన్, కోర్టు గొడవలు వెంబడిస్తాయి. ఈరోజు మీఅదృష్ట సంఖ్య8, కలిసి వచ్చేరంగు: ఊదారంగు. నరసింహస్వామిని దర్శించుకోండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి: ధనం మూలం ఇదం జగత్ అనే నానుడి నిజమని తెలుసుకుంటారు. గ్రహబలం అధికంగా ఉంది. శతృవులు ఏమీ చేయలేరు. తల్లితండ్రుల పాదసేవ చేసుకుంటారు. వస్త్ర వ్యాపారులకి కలిసి వస్తుంది. ఈరోజు మీఅదృష్టసంఖ్య 8, కలిసి వచ్చేరంగు బ్రౌన్ కలర్, నిరుపేదలకు సహాయం చేయండి.
వృశ్చికరాశి: దూరప్రయాణాలు కలిసి వస్తాయి. భోగపరమైన విషయాలపై ఆసక్తి చూపిస్తారు. ఇంటి బాధ్యతలు పూర్తిగా మీ జీవిత భాగస్వామికి వదిలేస్తారు. సంతానంతో చిన్న చిన్న మనస్పర్థలు ఏర్పడుతాయి. ఈరోజు మీఅదృష్టసంఖ్య 7, కలిసివచ్చే రంగు నలుపు రంగు.
ధనస్సు రాశి: పనులన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంటాయి. కన్నతల్లితో వ్యతిరేకత ఏర్పడుతుంది. సోదరులను సంప్రదించి సలహాలు స్వీకరించండి. గురువుల పాదసేవ చేసుకుంటారు. మిత్రుల రూపంలో మిమ్మల్ని మోసం చేసేవారే ఎక్కువగా ఉంటారు. ఈరోజు మీఅదృష్ట సంఖ్య4, పెంపుడు జంతువులకు పక్షులకు ఆహారం సమర్పించండి.
మకరరాశి: కలిసి వస్తుందనుకున్న ప్రతీవిషయం విఫలమవుతోంది. సర్పగ్రహాల దృష్టి అధికంగా ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళినా దెప్పి పొడుపు మాటలు మీలో కసిని పెంచుతాయి. ఇతరులలో స్పూర్తిని నింపుతారు. ఈరోజు మీఅదృష్ట సంఖ్య 4, కలసివచ్చేరంగు నీలంరంగు, వేంకటేశ్వరస్వామిని దర్శించుకోండి శుభం కలుగుతుంది.
కుంభరాశి: శక్తి దేవాలయాలను సందర్శిస్తారు. నీటితో ముడిపడ్డ వ్యాపారం కొనసాగిస్తారు. మీ సమూహంలో మీరే పెద్ధవారిలా వ్యవహరిస్తారు. మాటల్లో చెప్పాలంటే సొమ్మొకడిది సోకొకడిదిగా గడుపుతారు. ఈరోజు మీ అదృష్టసంఖ్య 8, కలిసివచ్చేరంగు నీలంరంగు, దుర్గాదేవికి 18 నిమ్మకాయలతో దండను సమర్పించండి.
మీనరాశి: ఆచితూచి అడుగులు వేయాల్సిన కాలం నడుస్తుంది. అనారోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. ఆర్థికంగా పరువాలేదనిపిస్తుంది. భార్యామణిపై అధికారం చెలాయించకండి. ప్రేమతో గడపండి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2, కలిసి వచ్చే రంగు పసుపు పచ్చ రంగు, నవగ్రహ ప్రదక్షిణలు చేయండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే