Horoscope Today : ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు ‘బ్రహ్మశ్రీ రామడుగు శ్రీకాంత్ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన ఆగస్ట్ 9వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మేషరాశి: ప్రాపంచిక విషయాలకు దూరంగాఉండాలని యోచిస్తారు స్థిరమైన అభిప్రాయాలు మీ దృక్పథాన్ని తెలియజేస్తాయి ఋణానుబంధాలు గుర్తు చేసుకుంటారు పెద్దవాళ్ళ సలహాలు పాటిస్తారు మార్పులు స్వీకరిస్తారు ఆలోచనా సరళిని మారుస్తారు భాగస్వామి తరుపు బంధువులతో కలిసి గడుపుతారు వృత్తి, వ్యాపారాలలో సరికొత్త బాధ్యతలు చేపడతారు
ఈరోజు మీ అదృష్ట సంఖ్య5
కలిసివచ్చేరంగు: సిల్వర్ రంగు
అనాథలకు శక్తిమేరకు దానంచేయండి.
వృషభరాశి: ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఇతరుల నుండి రావాల్సిన సొమ్ము అందుతుంది. కొత్త మార్పులు సూచితం. ఆత్మీయులను కలుసుకుంటారు. కొన్ని జ్ఞాపకాలు బాధిస్తాయి. తీవ్రమైన ఆలోచనలు మానుకోండి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య7
కలిసివచ్చే రంగు: నారింజ రంగు
మూగజీవాలకు ఆహారం సమర్పించండి.
మిథునరాశి: కొన్నివిషయాల్లో జాగ్రత్తగాఉండాలి. మానసికంగా దృఢంగా ఉండండి. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగాఉండండి. పరధ్యానం పనికిరాదు. మిత్రులు శతృవులుగా మారే అవకాశం ఉంది. పై అధికారుల పెత్తనం నచ్చదు. అకారణ కోపం కారణంగా నష్టపోతారు. శుభగ్రహాల అనుకూలత వల్ల సమస్యల నుండి బయటపడుతారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య4
కలిసివచ్చే రంగు: నేవీ బ్లూ కలర్
దేవాలయంలో సింధూరం సమర్పించండి
కర్కాటకరాశి: ఉల్లాసవంతంగా ఉంటారు. మీ ఆనందానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరు. రావు అనుకున్న కాంట్రాక్టులు చేతికందుతాయి. ఊహించని లాభాలు పొందుతారు. లాటరి ప్రైజులు గెలుచుకుంటారు. మద్యపానానికి దూరంగా ఉండండి. ఆహారం వికటించి అనారోగ్యం పాలవుతారు.
ఈరోజు మీ అదృష్ట సంఖ్య 8
కలిసివచ్చేరంగు: నేరేడు పండురంగు
దుర్గాదేవి ఆలయంలో మినపగారెలు సమర్పించండి.
సింహరాశి: అష్టమి శని ప్రభావం తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. ఓపికతో నడుచుకోవడమే శ్రీరామరక్ష. కొందరు మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు. మొండిపట్టుదలతో నష్టాన్ని కొని తెచ్చుకుంటారు. భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండటం మంచిది. మీ రహస్యాలు కొందరికి చేరుతాయి. పనిలో అశ్రద్ధ వద్దు.
ఈరోజు మీ అదృష్టసంఖ్య 6
కలసివచ్చేరంగు: ఆకుపచ్చ రంగు
నవధాన్యాలను పారేనీటిలో వదలండి.
కన్యారాశి: శారీరక శ్రమ అధికం. కోర్టు ముందు నిలబడాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక సమస్య ఒకటి పరిష్కారమవుతుంది. మిమ్మల్ని ఓడించాలనుకున్న వారంతా దైవానుగ్రహంతో చట్టంముందు దోషులుగా నిలబడుతారు. శరీరంపై గాయాలు బాధిస్తాయి. వైద్యుల సలహాలు పాటించకపోతే తీవ్ర అనారోగ్యానికి గురవుతారు.
ఈరోజు మీ అదృష్టసంఖ్య8
కలిసివచ్చే రంగు:ఎరుపు
కాలభైరవున్ని దర్శనం చేసుకోండి.
ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట
తులారాశి: వ్యాపారంలో నష్టం రావడంతో దిగ్బ్రాంతికి గురవుతారు. లోకం పోకడ నచ్చదు. పోరాడటం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించుకుంటారు. శతృపీడ తగ్గుతుంది. మాట్లాడే విధానం ఎదుటి వారిని రెచ్చగొట్టే విధంగా ఉంటుంది. బంగారంపై రుణాలు పొందుతారు. వంశపారంపర్య బాధ్యతలు చేపడతారు.
ఈరోజు మీఅదృష్టసంఖ్య2
కలిసివచ్చే రంగు: ఆకాశనీలం
నాగదేవతలకు పాలతో అభిషేకం జరిపించండి.
వృశ్చికరాశి: రాజకీయంగా మీ నిర్ణయాలు లాభిస్తాయి. మీమాటకు విలువ పెరుగుతుంది. అధికార ప్రాప్తి కలుగుతుంది. మీ ఎదుగుదల కొందరికి అసూయ కలిగిస్తోంది. భాగస్వామి ప్రవర్తన బాధ కలిగిస్తోంది. తలకు మించిన భారం మోయాల్సి ఉంటుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య5
కలిసి వచ్చేరంగు:గుమ్మడిపూవు రంగు
ఆంజనేయదండకం చదువుకోండి.
ధనస్సురాశి: ముఖస్తుతులకు పొంగిపోకండి. ఆర్థిక లావాదేవిల్లో జాగ్రత్త. ఎదుటి వారిని అంచనా వేయడంలో పొరబడుతారు. సోదరుల అండదండలుంటాయి. తప్పని తెలిసినా కూడా కొన్ని విషయాల్లో మీ బలహీనతలకు లొంగిపోతారు. కొందరికి వాగ్దానం చేయాల్సి వస్తుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య3
కలిసి వచ్చేరంగు: ఆకుపచ్చ రంగు
సూర్యనారాయణ స్వామిని పూజించండి.
మకరరాశి: చంద్రబలం యోగిస్తోంది. బంధువర్గంతో ఆనందంగా గడుపుతారు. స్వల్పంగా రుణ ఒత్తిడి ఏర్పడుతుంది. సోదరులతో చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటారు. మీ పిల్లలు మీ అభిప్రాయాలను తెలుసుకుని మసులుకుంటారు. సంఘంలో గౌరవం ఏర్పడుతుంది.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య8
కలిసి వచ్చేరంగు: బూడిదరంగు
కులదైవాన్ని తలచుకుని ప్రార్థించండి.
కుంభరాశి: కొన్ని విషయాల్లో పంతం పడుతారు. చివరికి మీ మాట నెగ్గించుకుంటారు. పదునైన ఆయుధాల వల్ల గాయాలు ఏర్పడుతాయి. సమాజ హితమైన ఆలోచనలు చేస్తారు. సన్నిహితులతో కలిసి సమావేశాలు నిర్వహిస్తారు. సంతాన విషయంలో సంతృప్తిగా ఉంటారు. వారి విద్యాభివృద్ధికై ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తారు.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య9
కలిసివచ్చే రంగు: కాటుక రంగు
సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కందులు సమర్పించండి.
మీనరాశి: ఆశించిన ఫలితాలు శూన్యం. కొన్ని కొన్నిసార్లు తీవ్ర అసహనానికి గురవుతారు. మీ నిజాయితిని నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీర్ఘకాలిక సంబంధాలకై ప్రయత్నాలు చేస్తారు. ఎంత ప్రయత్నించినా చివరి నిమిషంలో అవకాశాలు చేజారిపోతాయి. నమ్మి ప్రయాణాలు చేయకండి.
ఈరోజు మీఅదృష్ట సంఖ్య6
కలిసి వచ్చేరంగు: తెలుపు
జమ్మిచెట్టుకి ప్రదక్షిణలు చేసి పరమాన్నం నైవేద్యంగా సమర్పించండి.
ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే