Luck Signs: అదృష్టం పట్టే ముందే కొన్ని సంకేతాలు మీకు కనిపిస్తాయట. విశ్వం నుంచి వచ్చే ఆ సిగ్నల్సే మీకు ప్యూచర్‌లో గోల్డెన్ డేస్ రాబోతున్నాయని సూచిస్తాయట. ఇంతకీ ఆ సిగ్నల్స్ ఏంటో.. ఎలాంటి సంకేతాల ద్వారా మీకు అదృష్టం పట్టబోతుందో ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.
అద్బుతాలు ఎప్పుడూ చెప్పి రావంటారు. కానీ అదృష్టం రాబోయే ముందు మీకు కొన్ని సంకేతాలు పంపిస్తుందట. ఆ సంకేతాల ద్వారా మీ జీవితంలో అద్బుతాలు జరగొచ్చట. మీ జీవితంలో రాబోయే గోల్డెన్ డేస్ ను మీరు ముందే తెలుసుకోవచ్చని పండితులు చెప్తున్నారు. ఇంతకీ ఆ సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పూలు లేని చోట అకస్మిక సువాసన: మీకు ఆకస్మికంగా సుగంధ భరితమైన వాసన వచ్చినా.. లేదంటా మీ చుట్టూ పూలు లేకపోయినా అకస్మాత్తుగా పూల పరిమళం మీ ముక్కుపుటాలను తాకినా అది దైవిక శక్తుల ప్రభావం అని చెప్తున్నారు పండితులు. ఇలాంటి సంకేతమే మీకు జీవితంలో అద్బుతం జరగబోతుందని చెప్పే సిగ్నల్ అంటున్నారు.
మనసులో ఒక్కసారిగా కొత్త ఆలోచన: ఎప్పుడూ మూస ధోరణిలో ఆలోచించే మీకు ఏదైనా ఆలోచన హఠాత్తుగా వచ్చిందంటే అది మీ జీవితంలో మార్పు కోసం వచ్చే సంకేతంగా బావించాలట. ఇలా కొత్త ఆలోచన సడెన్‌గా రావడం అనేది చంద్రుడికి సంబంధించిన చర్యగా జ్యోతిష్యులు చెప్తున్నారు. అయితే ఇలాంటి ఆలోచన మీ జీవిత దిశను మార్చేస్తుందట.
మరిచిపోలేని ఆలోచన లేదా ఐడియా: ఏదైనా కొత్తగా ఐడియా కానీ ఆలోచన కానీ మీకు వచ్చిన తర్వాత ఆ ఆలోచన నిరంతరం మీ మెదడును తొలచివేస్తూనే ఉంటుంది. మీరు ఆ ఆలోచన ప్రకారం చేయాలి.. లేదా ఆ ఐడియాను ఫాలో కావాలి అనేది మీ మనసులో మారుమోగుతూనే ఉంటుంది. అది కూడా మీ జీవితంలో మార్పుకు సంకేతంగా బావించాలట.
నిరంతరం ఒక సంఖ్యపై చూపు పడటం: మీరు ఏదైనా ఆలోచించినా..? పని చేస్తున్నా నిరంతం మీ మదిలో ఒక సంఖ్య మెదలడం కూడా మార్పు సంకేతమట. ఆ సంఖ్య ద్వారానే మీ జీవితంలో మార్పు వస్తుందని బావించాలట. ఉదాహారణకు మీ మనసు ఎప్పుడూ ఐదవ నెంబర్ మీద లగ్నం అవుతుంటే.. మీ జీవితం కూడా ఐదవ తేదీన మారిపోవడమో.. ఐదవ సంఖ్యతో ముడిపడిన డబ్బు రావడమో ఇలాంటి మార్పులు వస్తాయట. అలాగే అదే సంఖ్య మీ జీవితానికి ప్రత్యేకత తీసుకొస్తుందని పండితులు చెప్తున్నారు.
అంతరంగంలో మధురమైన స్వరం వినిపించడం: మీరు అనుకోకుండా మీలోనే ఒక మధురమైన స్వరాన్ని వినడం. ఆ స్వరం మీకు పాటలు పాడినట్టు లేదా ఎవరో మీకు ఏదో చెప్తున్నట్టు అనిపించడం. ఇలాంటి సంకేతం కూడా మీకు మంచి శకునంగా బావించాలట. అలాగే ఆ స్వరం మీకు జరగబోయే ప్రమాదాల గురించి కూడా హెచ్చిరించవచ్చట.
ఎప్పుడో విన్న మాటలు అకస్మాత్తుగా గుర్తుకు రావడం: ఏదో తెలియని సమస్యతో పరిష్కారం దొరక్క ఇబ్బంది పడుతున్న మీకు ఎప్పుడో ఎవరో చెప్పిన మాటలు సడెన్‌గా గుర్తుకు రావడం. ఆ మాటల్లోనే మీ సమస్యకు పరిష్కారం దొరకడం లాంటివి కూడా మీకు శుభసూచకాలట. వీటినే దైవ మార్గదర్శక సంకేతాలుగా పండితులు చెప్తుంటారు.
కలల ద్వారా సంకేతాలు రావడం: రోజులు గడిచినా మరచిపోతేని కలలు త్వరలో జరిగే సంఘటనలకు సూచన. ఉదాహరణకు డబ్బు కలలో కనిపిస్తే త్వరలో మీకు డబ్బు లభించే అవకాశం ఉంటుంది. అలాగే చాలా మందికి దేవుడు కలలో కనిపించి వారిని మార్గనిర్దేశకత్వం చేస్తుంటాడు.
ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.