Gachibowli News: హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ అపార్ట్ మెంట్ ఓనర్ ను హాస్టల్ యజమాని చితకబాదాడు. పోలీసులు సమక్షంలోనే దాడి జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనాకు ముందు అద్దెకు..?
ఐదేళ్ల క్రితం కరోనాకు ముందు పిచ్చయ్య అనే వ్యక్తి అమర్ నాథ్ రెడ్డికి 25 ప్లాట్లను అద్దెకు ఇచ్చాడు. అమర్ నాథ్ 25 ప్లాట్లను హాస్టల్ నిర్వహించడానికి అద్దెకు తీసుకున్నాడు. నెక్స్ట్ జెన్ లేడీస్ హాస్టల్ పేరిట హాస్టల్ నిర్వహించుకుంటూ వస్తున్నాడు. అయితే.. కరోనా అనంతరం అపార్ట్ మెంట్ అద్దె చెల్లించకుండా హాస్టల్ యజమాని అమర్ నాథ్ రెడ్డి మొండికేశాడు. అపార్ట్ మెంట్ యజమాని పలు మార్లు హెచ్చరించినా అతను అద్దె చెల్లించలేదు.
కోర్టును ఆశ్రయించిన అమర్‌నాథ్ రెడ్డి
హాస్టల్ ఖాళీ చేయాలి అనడంతో హాస్టల్ యజమాని అమర్ నాథ్ రెడ్డి కోర్టును ఆశ్రయించాడు. అద్దె కట్టకపోవడంతో ఇంటి యజమాని కూడా కోర్టుకు వెళ్లాడు. విచారణ అనంతరం గతంలో 9 ప్లాట్లు ఖాళీ చేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా పోలీసుల సహకారంతో ఇంటి యజమాని 9 ప్లాట్లను ఖాళీ చేయించాడు. తాజాగా మరో మూడు ఫ్లాట్లు ఖాళీ చేయాలంటూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
ALSO READ: Jobs in SBI: ఎస్బీఐలో 6589 ఉద్యోగాలు.. ఇంకా ఒక్కరోజే సమయం మిత్రమా.. ఇప్పుడే అప్లై చేసుకోండి..
పోలీసుల సమక్షంలోనే దాడికి దిగిన అమర్‌నాథ్ రెడ్డి
కోర్టు ఉత్తర్వులతో మూడు ప్లాట్లు ఖాళీ చేయిస్తుండగా హాస్టల్ యజమాని అమర్ నాథ రెడ్డి దాడికి దిగాడు. పిచ్చయ్యపై అటాక్ చేశాడు. పోలీసుల సమక్షంలోనే అమర్ నాథ్ రెడ్డి దాడికి పాల్పడ్డాడు. దాడిలో అపార్ట్ మెంట్ ఓనర్ పిచ్చయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే పిచ్చయ్యను ఆస్పత్రికి తరలించారు. దాడి అనంతరం అమర్నాథ్ రెడ్డి ని గచ్చిబౌలి పోలీసులు స్టేషన్ కు తరలించారు. అయితే గచ్చిబౌలి పోలీసుల కళ్లు కప్పి పోలీస్ స్టేషన్ నుంచి అమర్ నాథ రెడ్డి పరారు అయ్యాడు.
ALSO READ: Jobs in RRB: రైల్వేలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగాలు.. నెలకు రూ.35,400 జీతం.. డోంట్ మిస్
ఎమ్మెల్సీ అండతో రెచ్చిపోతున్న అమర్ నాథ్
ఇలా బిల్డింగ్లను అద్దెకు తీసుకొని అనంతరం అమర్నాథ్ రెడ్డి కబ్జాలకు పాల్పడుతున్నాడు. ఏపీకి చెందిన ఓ ఎమ్మెల్సీ అండతో రెచ్చిపోతున్నట్టు బాధితులు చెబుతున్నారు. బాధితుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.