E-Paper
Advertisement

ఈ కారు ధర అక్షరాలా రూ. కోటి 78 లక్షలు.. స్పీడ్ చూస్తే మతిపోవాల్సిందే!

ఈ కారు ధర అక్షరాలా రూ. కోటి 78 లక్షలు.. స్పీడ్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW భారత మార్కెట్లో తన కొత్త 2026 BMW X6 M60i కూపే SUVను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధర రూ.1.78 కోట్లు(ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించింది. కంపెనీ ఈ SUVను పూర్తిగా CBU మోడల్‌ గా భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.

ఒకే వేరియంట్ లో అందుబాటులోకి!

కొత్త BMW X6 ప్రస్తుతం M60i వేరియంట్‌ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఇందులో 4.4 లీటర్ ట్విన్ టర్బో V8 పెట్రోల్ ఇంజిన్‌ ను అందించారు. దీనికి 48V మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్ కూడా జత చేశారు. ఈ ఇంజిన్ గరిష్టంగా 530 హార్స్‌ పవర్, 750Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌ కు 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌ బాక్స్‌ ను జత చేశారు. ఈ పవర్ నాలుగు చక్రాలకు చేరుతుంది. రియర్ వీల్ స్టీరింగ్, అడాప్టివ్ సస్పెన్షన్, లిమిటెడ్ స్లిప్ డిఫరెన్షియల్, xDrive ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ లాంటి హైటెక్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

4.3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగం

Advertisement

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే.. ఈ SUV కేవలం 4.3 సెకన్లలోనే గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. లీటర్‌కు సుమారు 7.89 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. డిజైన్ పరంగా BMW X6 చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ముందు భాగంలో అడాప్టివ్ LED హెడ్‌ లైట్లు, బ్లాక్ కిడ్నీ గ్రిల్, పెద్ద ఎయిర్ ఇంటేక్స్, స్పోర్టీ బంపర్ ఉన్నాయి. పక్క నుంచి చూస్తే వాలుగా ఉండే రూఫ్‌ లైన్ ఈ SUVకు ప్రత్యేక లుక్‌ను ఇస్తుంది. 21 అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, ఎరుపు రంగు బ్రేక్ కాలిపర్స్, బ్లాక్ ORVMలు, వెనుక భాగంలో నాలుగు ఎగ్జాస్ట్ టిప్స్ కూడా ఇందులో ఉన్నాయి. ఈ SUV పొడవు 4,960 మిల్లీమీటర్లు కాగా, బూట్ స్పేస్ 580 లీటర్లుగా ఉంది.

ప్రీమియం ఫీల్‌ ఇంటీరియర్   

ఇంటీరియర్ కూడా పూర్తిగా ప్రీమియం ఫీల్‌ను అందిస్తుంది. M బ్యాడ్జింగ్‌తో కూడిన లెదర్ స్టీరింగ్ వీల్, ప్రత్యేక డ్యాష్‌బోర్డ్ డిజైన్, లగ్జరీ సీట్లు ఇందులో ఉన్నాయి. సీట్లకు పలు కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

Advertisement

ఫీచర్ల పరంగా 14.9 అంగుళాల ఇన్ఫోటైన్‌ మెంట్ స్క్రీన్, 12.3 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, వైర్‌ లెస్ ఆపిల్ కార్‌ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, పనోరమిక్ సన్‌ రూఫ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ సీట్లు, హెడ్ అప్ డిస్‌ ప్లే, వైర్‌ లెస్ ఛార్జర్, 16 స్పీకర్ల హార్మన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ లాంటి ఫీచర్లు ఉన్నాయి.

భద్రత కోసం 360 డిగ్రీ కెమెరా, పార్కింగ్ అసిస్టెంట్, లెవెల్-2 ADAS టెక్నాలజీని అందించారు. ముందరి సీట్లకు మసాజ్ ఫంక్షన్ కూడా ఆప్షనల్‌ గా లభిస్తుంది. భారత మార్కెట్లో ఈ కొత్త BMW X6 M60i, ఆడి SQ8,  పోర్షే కయెన్నే కూపే GTS, మెర్సిడెస్ AMG GLE 53 కూపే లాంటి ప్రీమియం SUVలకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Read Also: హోండా 0 ఆల్ఫా ఈవీ ఇంటీరియర్ లీక్.. భారీ టచ్‌ స్క్రీన్‌ తో డిజైన్ అదిరింది భయ్యా!

Related News

ఈ కార్లు ఒకప్పుడు భారత్‌లో తిరిగేవని తెలుసా? ఇప్పుడు రోడ్లపై కనిపిస్తే షాక్ అవ్వాల్సిందే!

ప్రపంచంలోని ఐదు వింతైన బైక్‌లు.. వీటి డిజైన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

అక్టోబర్‌లో దుమ్మురేపనున్న కొత్త ఈవీలు.. స్కూటర్లు, బైక్స్ లిస్ట్ ఇదే!

కారుపై ఏకంగా 20 టన్నుల రాళ్లు.. టాటా ఏరిస్ బలం చూపించేందుకు మైండ్ బ్లోయింగ్ టెస్ట్!

చిన్న కార్ల కోసం సుజుకి మాస్టర్ ప్లాన్.. ‘రీవ్ లైట్’ హైబ్రిడ్ వచ్చేస్తోంది!

రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ ఎంట్రీ డేట్ ఫిక్స్.. ధర అనౌన్స్ మెంట్ ఎప్పుడంటే?

మహీంద్రా విజన్ ఎస్ వచ్చేస్తోంది.. కనెక్టెడ్ టెయిల్‌లైట్లతో అదిరిపోయే లుక్!

టాటా ఏరిస్ విడుదల.. రూ.5.29 లక్షలకే కొత్త సెడాన్!

Big Stories

Advertisement
×