Redmi Pad 2 Pro 5G price in India: ఈ రోజుల్లో కేవలం స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ చాలా చిన్నదిగా అనిపిస్తోంది. అలాగని ల్యాప్‌టాప్ ప్రతి చోటకీ మోసుకెళ్లడం కష్టంగా మారుతోంది. అందుకే స్టూడెంట్స్ ఆన్‌లైన్ క్లాసులకైనా, ఆఫీస్ వర్క్‌కైనా లేదా బీజీఎమ్‌ఐ లాంటి హెవీ గేమింగ్ ఆడటానికైనా టాబ్లెట్లు సూపర్ ఆప్షన్‌గా మారాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రెడ్‌మి కంపెనీ సరికొత్త ఫీచర్లు, 5G నెట్‌వర్క్ సపోర్ట్‌తో Redmi Pad 2 Pro 5G ని మార్కెట్లోకి తెచ్చింది. 12.1 ఇంచుల భారీ డిస్‌ప్లే ఉన్న ఈ కిల్లింగ్ గాడ్జెట్ ధర, ఫీచర్లు ఏంటో ఇప్పుడు చూద్దాం.
రెడ్‌మి కంపెనీ బడ్జెట్ ధరలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడంలో ఎప్పుడూ ముందే ఉంటుంది. ఈసారి టాబ్లెట్ మార్కెట్‌ను టార్గెట్ చేస్తూ, ప్రీమియం లుక్ , అదిరిపోయే గేమింగ్ ఫీచర్స్తో Redmi Pad 2 Pro 5G (8 GB RAM / 128 GB ROM) వేరియంట్‌ను లాంచ్ చేసింది. సాధారణంగా వైఫై టాబ్లెట్లలో సిమ్ కార్డ్ వేసుకోలేం, కానీ ఇందులో Wi-Fi + 5G రెండు ఆప్షన్లు ఉండటం వల్ల మీరు ఎక్కడున్నా సరే హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను ఎంజాయ్ చేయవచ్చు.
ఈ టాబ్లెట్ చేతిలోకి తీసుకోగానే మొదటగా మనల్ని ఇంప్రెస్ చేసేది దీని లార్జ్ 12.1-ఇంచుల 2K డిస్‌ప్లే. దీనికి తోడు 120Hz హై రీఫ్రెష్ రేట్ ఇచ్చారు. దీని వల్ల గేమింగ్ ఆడేటప్పుడు ఎక్కడా ల్యాగ్ లేకుండా విజువల్స్ చాలా స్మూత్‌గా, బ్యూటిఫుల్‌గా కనిపిస్తాయి. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియోలలో సినిమాలు చూసేటప్పుడు ఒక మినీ థియేటర్ ఎక్స్‌పీరియన్స్ రావడం గ్యారెంటీ.
ప్రాసెసర్: హెవీ మల్టీటాస్కింగ్ , గేమింగ్‌ను ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ పవర్‌ఫుల్ ఆక్టా-కోర్ గేమింగ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
ర్యామ్ & స్టోరేజ్: 8GB ర్యామ్ ఉండటం వల్ల ఒకేసారి 4, 5 యాప్స్ బ్యాక్‌గ్రౌండ్‌లో రన్ చేసినా టాబ్లెట్ అస్సలు హ్యాంగ్ అవ్వదు.ఇక 128GB ఇంటర్నల్ స్టోరేజ్ మీ గేమ్స్, సినిమాలు, ఫైల్స్ దాచుకోవడానికి పర్‌ఫెక్ట్‌గా సరిపోతుంది.
క్వాడ్ స్పీకర్లు: ఆడియో క్వాలిటీ నెక్స్ట్ లెవెల్ ఉండేలా ఇందులో డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో కూడిన 4 స్పీకర్లను అమర్చారు. సౌండ్ చాలా లౌడ్‌గా, క్లియర్‌గా ఉంటుంది.
పెద్ద డిస్‌ప్లే ఉంది కాబట్టి బ్యాటరీ కూడా అంతే గట్టిగా ఉండాలి కదా.. అందుకే ఇందులో ఏకంగా 10,000mAh భారీ బ్యాటరీని ఇచ్చారు. ఒక్క సారి ఫుల్ ఛార్జ్ చేస్తే చాలు.. 2 రోజుల పాటు నాన్-స్టాప్‌గా వాడుకోవచ్చు. దీనికి తోడు బాక్స్‌లోనే 33W ఫాస్ట్ ఛార్జర్ కూడా లభిస్తుంది.
వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారు, డిజిటల్ ఆర్టిస్ట్‌లు స్టైలస్ పెన్ సపోర్ట్ ఉన్న బిగ్ స్క్రీన్ టాబ్లెట్లను ఎక్కువగా సర్చ్ చేస్తున్నారు. ఈ రెడ్‌మి ప్యాడ్ కూడా స్టైలస్ పెన్ , ఎక్స్‌టర్నల్ కీబోర్డ్‌ను సపోర్ట్ చేస్తుంది. అంటే దీనిని మీరు మినీ ల్యాప్‌టాప్‌గా మార్చేయవచ్చు.
Also Read: వర్షం పడినా నో టెన్షన్.. ఐఎఫ్‌బీ టర్బో డ్రైయర్‌తో నిమిషాల్లో బట్టలు డ్రై
ధర వివరాలు:
Redmi Pad 2 Pro 5G (8GB + 128GB) ఒరిజినల్ ప్రైస్ రూ. 28,999 గా ఉంది. కానీ ప్రస్తుతం ఆన్‌లైన్ ఈ-కామర్స్ సైట్స్ , షియోమి స్టోర్లలో నడుస్తున్న క్రేజీ ఆఫర్ల ప్రకారం..
డీల్ ధర: ఇది కేవలం రూ. 23,999 కే ఆఫర్ ధరలో లభిస్తోంది.
బ్యాంక్ డిస్కౌంట్స్: మీ దగ్గర HDFC లేదా ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే అదనంగా రూ. 2,000 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంటే నెట్ ప్రైస్ కేవలం రూ.21,999 అవుతుంది. నో-కాస్ట్ ఈఏంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
రూ.22 వేల బడ్జెట్‌లో ఆల్ రౌండర్ 5G టాబ్లెట్ కావాలనుకునే వారికి Redmi Pad 2 Pro 5G ఒక వండర్‌ఫుల్ ఆప్షన్. స్టడీస్ కోసం.. ఆఫీస్ ప్రజెంటేషన్ల కోసం, ముఖ్యంగా పబ్‌జీ , ఫ్రీ ఫైర్ లాంటి హై-ఎండ్ గేమ్స్ ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ఇది వంద శాతం వర్త్ ఛాయిస్.