E-Paper
Advertisement

8 కేజీల వాషింగ్ మిషన్‌లే ఎందుకు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి? కారణాలివే!

8 కేజీల వాషింగ్ మిషన్‌లే ఎందుకు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి? కారణాలివే!
Advertisement

8kg Washing Machine: ప్రస్తుతం ప్రతీ ఇంట్లో వాషింగ్ మిషన్ తప్పనిసరిగా మారింది. అయితే మార్కెట్లో రకరకాల కెపాసిటీలు ఉన్నప్పటికీ మెజారిటీ కుటుంబాలు 8 కేజీల వాషింగ్ మిషన్ లనే ఎక్కువగా ఇష్టపడుతున్నాయి. అసలు ఈ 8 కేజీల వేరియంట్ ఎందుకంత పాపులర్ అయింది? దీనివల్ల రోజూవారీగా కలిగే 5 కీలక ప్రయోజనాలేంటో ఈ కథనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మధ్యతరగతికి పర్ఫెక్ట్ ఛాయిస్

దేశంలో చాలావరకు 4 నుండి 6 మంది సభ్యులు ఉన్న చిన్న కుటుంబాలే ఎక్కువ. 8 కేజీల సామర్థ్యం ఉన్న వాషింగ్ మిషన్ ఈ తరహా కుటుంబాల సరిగ్గా సరిపోతుంది. బట్టలు తక్కువైనా, కాస్త ఎక్కువగా ఉన్న కూడా ఈ వాషింగ్ మిషన్.. ఏంతో తెలిగ్గా ఉతికేస్తుంది.

బెడ్ షీట్లు, దుప్పట్లు వేయడం సులువు

Advertisement

చిన్న సైజు వాషింగ్ మిషన్లలో బెడ్ షీట్లు, దుప్పట్లు (Blankets) వేయడం చాలా కష్టం. ఒకవేళ వేసినా అవి వాషింగ్ మిషన్ డ్రమ్ లో సరిగ్గా క్లీన్ కావు. అదే 8 కేజీల వేరియంట్ లో డ్రమ్ సైజ్ పెద్దగా ఉండటం వల్ల భారీ సైజు దుప్పట్లను కూడా చాలా తేలికగా శుభ్రం చేసుకోవచ్చు.

సమయం, కరెంట్, నీరు ఆదా

తక్కువ కెపాసిటీ వాషింగ్ మిషన్ ఉంటే రోజుకు రెండు మూడు సార్లు సైకిల్ రన్ చేయాల్సి వస్తుంది. అదే 8 కేజీల మిషన్ అయితే ఒకేసారి ఎక్కువ బట్టలు ఉతికేయవచ్చు. దీనివల్ల సమయంతో పాటు విద్యుత్, నీటి వినియోగం గణనీయంగా తగ్గుతుంది.

అధునాతన ఫీచర్లు

Advertisement

ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న 8 కేజీల మోడళ్లలో కంపెనీలు ఇన్వర్టర్ మోటార్, ఇన్-బిల్ట్ హీటర్, స్మార్ట్ కనెక్టివిటీ వంటి అత్యాధునిక ఫీచర్లను అందిస్తున్నాయి. ఇవి మిషన్ లైఫ్ టైమ్ ను పెంచడమే కాకుండా బట్టలు మురికి లేకుండా మెరిసిపోయేలా చేస్తాయి.

Also Read: షాపింగ్‌ ప్రియులకు గుడ్ న్యూస్.. ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ తేదీలు ఫిక్స్.. ఆఫర్ల పూర్తి లిస్ట్ ఇదిగో!

బడ్జెట్ కు తగ్గ ప్రతిఫలం

6 లేదా 7 కేజీల వాషింగ్ మిషన్ల ధరకు.. 8 కేజీల మోడల్ కు మధ్య ధర విషయంలో పెద్దగా తేడా ఏమీ ఉండదు. కాస్త ఎక్కువ డబ్బు డబ్బుతోనే ఎక్కువ సామర్థ్యం, మెరుగైన పెర్ఫార్మెన్స్ లభిస్తుండటంతో వినియోగదారులు 8 కేజీల వైపే అధికంగా మొగ్గు చూపుతున్నారు.

Also Read: ఫ్రిడ్జ్ డోర్‌పై అయస్కాంతాలు.. కరెంట్ బిల్లుపై పడే ప్రభావం ఎంత? నిజానిజాలివే!

Related News

పవర్‌ఫుల్ కెమెరా, బిగ్ బ్యాటరీ.. Sony Xperia 1 IX లోని స్పెషల్ ఫీచర్లు ఇవే!

Galaxy Watch 4, Classic యూజర్లకు బ్యాడ్ న్యూస్.. ఇక సెక్యూరిటీ అప్‌డేట్స్ రావు!

వివో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. రూ.13,000 ఆదా చేసుకునే ఛాన్స్, ఆఫర్ లిమిటెడ్!

తక్కువ ధరలో అదుర్స్ అనిపించే వాచ్ కావాలా? ఈ స్మార్ట్‌వాచ్ మిస్ కావద్దు!

80ల్లో ఫోన్ కాల్.. త్వరగా మాట్లాడకపోతే జేబు ఖాళీ, ఇంట్లో ల్యాండ్‌లైన్ ఉంటే.. అదో స్టేటస్

రూ.30వేలలోపు బెస్ట్..కూకా Y74 ప్లస్ 55 ఇంచుల టీవీ రివ్యూ!

తక్కువ ధరలో బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్.. రెస్టారెంట్ స్టైల్ ఫుడ్ ఇంట్లోనే

అంతరిక్షంలో అడుగుపెట్టి.. సొంత శాటిలైట్లతో సత్తా చాటి.. 80ల్లో ISRO అంటే ఫ్లవర్ కాదు ఫైర్!

Big Stories

Advertisement
×