E-Paper
Advertisement

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!

బ్లాక్ లుక్‌లో టయోటా ఫార్చ్యూనర్.. కొత్త మోడల్ ఏముంది భయ్యా!
Advertisement

Toyota Fortuner Leader Edition 2026: ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా తన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీలో కొత్త స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. 2026 టయోటా ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌ ను మార్కెట్లో విడుదల చేసింది. సాధారణ ఫార్చ్యూనర్‌ తో పోలిస్తే ఈ కొత్త ఎడిషన్‌లో ప్రధానంగా ఎక్స్‌ టీరియర్, ఇంటీరియర్ డిజైన్‌లో మార్పులు చేశారు. ముఖ్యంగా బ్లాక్ కలర్ స్టైలింగ్, కొత్త అల్లాయ్ వీల్స్, బ్లాక్‌ మెరూన్ క్యాబిన్ ఈ మోడల్‌ కు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్లలో అందుబాటులో ఉండే ఈ ఎస్‌యూవీ ధరలు, ఫీచర్లు, ఇంజిన్ వివరాల గురించి తెలుసుకుందాం.

కొత్త ఎడిషన్ ధర ఎంత?

కొత్త ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌ను రెండు వేరియంట్లలో తీసుకొచ్చారు.  లీడర్ ఎడిషన్ 4×2 మాన్యువల్: రూ.36.51 లక్షలు కాగా, లీడర్ ఎడిషన్ 4×2 ఆటోమేటిక్: రూ.38.72 లక్షలు. ఆటోమేటిక్ వేరియంట్ ధర మాన్యువల్ మోడల్‌తో పోలిస్తే రూ.2.21 లక్షలు ఎక్కువగా ఉంది. ఈ ఎడిషన్ బుకింగ్‌లు 2026 అక్టోబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి. కలర్ ఆప్షన్ల విషయానికి వస్తే సూపర్ వైట్, ప్లాటినం వైట్ పెర్ల్, అటిట్యూడ్ బ్లాక్ రంగుల్లో ఈ ఎస్‌యూవీ లభించనుంది. గతంలో అందుబాటులో ఉన్న సిల్వర్ మెటాలిక్ కలర్‌ను ఈసారి తొలగించారు.

బ్లాక్ స్టైలింగ్‌తో కొత్త లుక్!

Advertisement

2026 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్‌లో బయటి లుక్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ముందు భాగంలో బ్లాక్‌డ్‌-అవుట్ గ్రిల్, బ్లాక్ అండ్ సిల్వర్ ట్రిమ్‌తో కూడిన ఫ్రంట్ బంపర్ ఈ కారుకు కొత్త రూపాన్ని ఇస్తాయి. బోనెట్‌పై బోల్డ్‌ గా కనిపించే ‘TOYOTA’ లెటర్స్ మరో స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. దీనికి అదనంగా కొత్త 18 అంగుళాల బ్లాక్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్‌ టోన్ బ్లాక్ రూఫ్, వెనుక భాగంలో బ్లాక్ ట్రిమ్‌తో కూడిన టెయిల్‌ గేట్‌ ను అందించారు. ఈ మార్పులతో సాధారణ ఫార్చ్యూనర్‌తో పోలిస్తే లీడర్ ఎడిషన్ మరింత ప్రత్యేకంగా కనిపిస్తుంది.

క్యాబిన్‌లోనూ కీలక మార్పులు

కారు లోపల బ్లాక్, మెరూన్ రంగులతో కూడిన డ్యూయల్‌ టోన్ అప్‌హోల్స్టరీని అందించారు. సీట్లకు సరిపోయేలా డోర్ ట్రిమ్‌లను రూపొందించారు.  డోర్ సిల్స్, యాంబియంట్ లైటింగ్ క్యాబిన్‌కు కొత్త లుక్‌ను తీసుకొస్తాయి. టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి. టైర్లలో గాలి ఒత్తిడిని పర్యవేక్షించేందుకు TPMS ఉపయోగపడుతుంది. యాంబియంట్ లైటింగ్ కూడా ఈ ఎడిషన్‌లో అందించిన ప్రత్యేక ఫీచర్లలో ఒకటి.

అదే 2.8 లీటర్ డీజిల్ ఇంజిన్!

Advertisement

ఈ స్పెషల్ ఎడిషన్‌లో ఇంజిన్ పరంగా పెద్దగా మార్పులు లేవు. ఇందులో 2.8 లీటర్, నాలుగు సిలిండర్ల డీజిల్ ఇంజిన్‌ను కొనసాగించారు. ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో కలిపినప్పుడు ఈ ఇంజిన్ గరిష్ఠంగా 204hp పవర్, 500Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్‌తో టార్క్ 420Nmగా ఉంటుంది. రెండు వేరియంట్లలోనూ 6-స్పీడ్ గేర్‌బాక్స్ అందుబాటులో ఉంది. ముఖ్యంగా, 2026 ఫార్చ్యూనర్ లీడర్ ఎడిషన్ కేవలం 4×2 డ్రైవ్ ఆప్షన్‌తోనే లభిస్తుంది. అంటే ఇందులో ఫోర్‌ వీల్ డ్రైవ్ ఆప్షన్ లేదు.

Read Also: స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

Tags

Related News

లాంచ్‌కు ముందే లీకైన MG విండ్సర్ EV ఇండల్జ్ ఎడిషన్.. కొత్త ఫీచర్లు ఇవే!

భారత్‌ లో జపాన్ ఎలక్ట్రిక్ స్కూటర్ల జోరు.. 10 వేల యూనిట్లు దాటేసిన అమ్మకాలు!

ఉద్యోగులకు BMW కార్లను గిఫ్ట్‌గా ఇచ్చిన లేడీ బాస్, అలా చూసి.. చలించిపోయి..

ఈవీలకు పెరుగుతున్న క్రేజ్.. కమర్షియల్ వెహికల్స్ మార్కెట్‌ ఏకంగా 158% జంప్!

స్కోడా స్లావియా ఫేస్‌లిఫ్ట్ వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే!

BE 07 TO విజన్ T.. మహీంద్రా నుంచి రాబోతున్న పవర్‌ఫుల్ ఎలక్ట్రిక్ SUVలు ఇవే!

హోండా కార్లపై అక్టోబర్‌ లో అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.2.34 లక్షల తగ్గింపు!

Big Stories

Advertisement
×