E-Paper
Advertisement

హార్ధిక్ పాండ్యా, బుమ్రా లేకపోతే..టీమిండియాను ఉగాండా కూడా చిత్తుగా ఓడిస్తుంది

హార్ధిక్ పాండ్యా, బుమ్రా లేకపోతే..టీమిండియాను ఉగాండా కూడా చిత్తుగా ఓడిస్తుంది
Advertisement

Sushant Mehta On IND VS WI : టీమిండియా వర్సెస్ విండీస్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో శ్రేయస్ అయ్యర్ సేన చిత్తుగా ఓటమి పాలైంది. 250 పరుగుల టార్గెట్ పెట్టినా, ఊదిపారేశారు కరేబియన్లు. ఈ తరుణంలోనే టీమిండియా బౌలింగ్ దళంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్, యూట్యూబర్ సుశాంత్ మెహతా సోషల్ మీడియా వేదికగా హాట్ కామెంట్స్ చేశారు.

పాండ్యా, బుమ్రా లేకపోతే.. టీమిండియాను ఉగాండా కూడా చిత్తుగా ఓడిస్తుంది

హార్ధిక్ పాండ్యా, బుమ్రా లేకపోతే టీమిండియాను ఉగాండా కూడా చిత్తుగా ఓడిస్తుందంటూ సుశాంత్ మెహతా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. వీళ్లిద్దరూ లేకపోవడంతో టీమిండియాపై కరేబియన్లు ఊచకోత కోశారని ఫైర్ అయ్యారు. హార్ధిక్ పాండ్యా, బుమ్రా ఇద్దరూ లేకపోతే ఇంత దారుణంగా బౌలింగ్ చేస్తారా ? బౌలర్లకు అసలేం ట్రైనింగ్ ఇస్తున్నారు ? గౌతమ్ గంభీర్,మోర్నీ మోర్కెల్ పడుకున్నారా ? అంటూ అందరిని కడిగి పారేశారు.

Advertisement

ఆ ఇద్దరూ లేకున్నా, టీమిండియా గెలిచేలా బౌలర్లను తయారు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. 250 పరుగుల టార్గెట్ ఉన్న తరుణంలో, ఎలాంటి ప్రణాళిక లేకుండా.. అవలీలగా మ్యాచ్ గెలుస్తామన్నట్టు బరిలో దిగారని ఆగ్రహించారు. దీనిపై వెంటనే టీమిండియా యాజమాన్యం చర్యలు తీసుకోవాలని.. లేకపోతే కష్టమౌవుతుందని హెచ్చరించారు. లేకపోతే సిరాజ్, భువీ, షమీలను బరిలో దించాలని కోరారు. దీంతో ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్, యూట్యూబర్ సుశాంత్ మెహతా చేసిన వివాదస్పద వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Furqan Bhatti advice to Sahibzada Farhan IND VS PAK Asian Games 2026: టీమిండియాపై పగ తీర్చుకోడానికి.. ఆ ఫోటోను ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో

250 పరుగులు కాపాడుకోలేరా..? అందరూ వెళ్లి బావిలో దూకేయండి

Advertisement

వెస్టిండీస్ తో జరిగిన రెండో టీ20 సందర్భంగా టీ20 సందర్భంగా ఒక్కడంటే ఒక్కడు కూడా సరిగ్గా బౌలింగ్ చేయాలేదని ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్, యూట్యూబర్ సుశాంత్ మెహతా విమర్శలు చేశారు. అర్షదీప్ సింగ్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ కసితో బౌలింగ్ చేయలేదని ఫైర్ అయ్యారు. టెక్నిక్ తో బౌలింగ్ చేసింటే, మ్యాచ్ గెలిచేవాళ్లమన్నారు. మంచు ప్రభావం ఉన్నప్పటికీ, టెక్నిక్స్ తో బౌలింగ్ వేస్తే.. విండీస్ ఓడిపోయేదని తెలిపారు.

కానీ ఈ విషయంలో భారత బౌలర్లతో పాటు వాళ్లకు చెప్పాల్సిన కోచ్ గంభీర్ కూడా విఫలమయ్యారని మండిపడ్డారు. అసలు శివమ్ దూబేను ఎందుకు ఆడిస్తున్నారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. 2 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి.. విండీస్ కు ఊపు తెచ్చింది శివమ్ దూబేనంటూ ఓ రేంజ్ లో ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్, యూట్యూబర్ సుశాంత్ మెహతా రెచ్చిపోయారు. ఇప్పటికైనా బుమ్రా, పాండ్యాలకు ప్రత్యామ్నాంగ్ బౌలర్లను తయారు చేయాలని కోరారు.    లేకపోతే అందరూ కలిసి..కట్టకట్టుకుని బావిలో దూకేయండి అంటూ నిప్పులు చెరిగారు. దీంతో సుశాంత్ మెహతా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

Harmanpreet Kaur steps down as Indian women’s team captain : హర్మన్‌ప్రీత్ కౌర్ రాజీనామా వెనుక కుట్రలు…ఆ టీమిండియా క్రికెటర్ టార్చర్ భరించలేకనే ?

Related News

మైదానంలోకి వ‌చ్చి గంభీర్ రౌడీయిజం చేశాడు…ఓట‌మి భ‌యంతో రెచ్చిపోయాడు

సోష‌ల్ మీడియా వార్‌…పాపం, గిల్ చేసిన త‌ప్పుకు శ్రేయ‌స్ సేన బ‌లి

వాడికి బ్యాటింగ్ రాదు, బౌలింగ్ చేత‌కాదు…టీమిండియా ఓట‌మి కార‌ణం శివ‌మ్ దూబేనే

బౌండ‌రీ సైజు 80 మీటర్లు చేయండి..లేక‌పోతే 500ల ప‌రుగులు చేసినా క‌ష్ట‌మే

సంజు శాంస‌న్ సెంచ‌రీ మిస్…వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఘోర ఓటమి

విరాట్ కోహ్లీకి బలుపెక్కువ…బుమ్రా లేదు, వుమ్రా లేదంటూ తక్కువ అంచనా వేశాడు

సంజు జోలికి వస్తే తాట తీస్తా, చేతకాకపోతే తప్పుకో…గంభీర్‌కు డీకే వార్నింగ్

Big Stories

Advertisement
×