VinFast Expands India EV Portfolio: వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్ ఫాస్ట్ భారత మార్కెట్ పై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే దేశంలో తన ఆపరేషన్స్ ప్రారంభించిన ఈ కంపెనీ, త్వరలో మూడు కొత్త ఎలక్ట్రిక్ కార్లను భారతీయ వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో చౌకైన మైక్రో SUV నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ SUV వరకు ఉన్నాయి.
ఈ లిస్టులో తొలుత వచ్చే మోడల్ ఇదే. కంపెనీ నుంచి భారత్ లో అత్యంత తక్కువ ధరలో వచ్చే EVగా భావిస్తున్నారు. చిన్న పరిమాణం, బాక్సీ డిజైన్, సిటీ ట్రాఫిక్ కు అనుకూలమైన డ్రైవింగ్ తో VF3 ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లలో మంచి ఆదరణ పొందింది. ఇది సిటీలో ఎక్కువగా డ్రైవ్ చేసే వారికి ఉపయోగపడేలా రూపొందించారు. చిన్న రోడ్లు, ట్రాఫిక్ ప్రాంతాల్లో సులభంగా నడపడానికి అనుకూలంగా ఉంటుంది. డిజైన్ పరంగా VF3 మినీ SUV లుక్ ను కలిగి ఉంటుంది. ముందు భాగంలో V షేప్ స్టైలింగ్, బలమైన వీల్ ఆర్చ్ లు, బాడీ క్లాడింగ్ లాంటి ఫీచర్లు ఉంటాయి. చిన్న కారు అయినప్పటికీ దృఢంగా తయారు చేశారు. ఈ మోడల్‌లో 18.64 kWh బ్యాటరీ ప్యాక్ వచ్చే అవకాశం ఉంది. ఇది సుమారు 210 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వొచ్చని సమాచారం. ధర రూ.8 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్య ఉండొచ్చని అంచనా.
ఇది VF3 కంటే పెద్దది కాగా, సబ్ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUV సెగ్మెంట్ లో పోటీ ఇవ్వనుంది. భారత మార్కెట్లో ఇది టాటా నెక్సాన్ ఈవీ, మహీంద్రా XUV400 వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. VF5 డిజైన్ మరింత ఆకట్టుకునేలా ఉంటుంది. V షేప్ LED DRLలు, స్పోర్టీ బంపర్, రూఫ్ రైల్స్, 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ లాంటి ఫీచర్లు అందించవచ్చు. ఈ SUVలో డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, సన్ రూఫ్ లాంటి లేటెస్ట్ ఫీచర్లు ఉండొచ్చని సమాచారం. బ్యాటరీ ఆప్షన్ల విషయానికి వస్తే, 29.6 kWh, 37.23 kWh బ్యాటరీ ప్యాక్ లతో వచ్చే అవకాశం ఉంటుంది. రేంజ్ సుమారు 268 నుంచి 326 కిలోమీటర్ల వరకు ఉండవచ్చని తెలుస్తోంది.
ఇది కంపెనీ నుంచి ప్రీమియం సెగ్మెంట్‌లో వచ్చే SUV. ఇటీవల ఈ మోడల్ కు సంబంధించిన పేటెంట్ భారత్ లో దాఖలైంది. VF8 కొత్త టెక్ ఫ్లూయిడ్ డిజైన్‌తో మరింత స్టైలిష్ గా కనిపిస్తోంది. ఇందులో పెద్ద టచ్ స్క్రీన్, 360 డిగ్రీ కెమెరా, ADAS, పవర్డ్ సీట్లు, ఎయిర్ ప్యూరిఫైయర్ వంటి హైటెక్ లాంటి ఫీచర్లు ఉండనున్నాయి. VF8లో 60.13 kWh బ్యాటరీ ప్యాక్ తో కూడిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. ఇది సుమారు 500 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంటుంది.
Read Also: జస్ట్ రూ.8కే క్యాబ్ రైడ్.. విన్ ఫాస్ట్ ఎలక్ట్రిక్ టాక్సీ సర్వీసులు వచ్చేస్తున్నాయ్!