E-Paper
Advertisement

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

జస్ట్ రూ.1.25 లక్షలకే అవోర్ EX1.. కొనేముందు ఈ 5 విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!
Advertisement

Avor EX1 Electric Bike: దేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మార్కెట్ రోజు రోజుకు మరింత వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్‌ కు చెందిన EV స్టార్టప్ అవోర్ ఎలక్ట్రిక్.. కొత్త EX సిరీస్‌ ను భారత మార్కెట్లో తీసుకొచ్చింది. ఇందులో EX1, EX2, EX2S అనే మూడు మోడళ్లు ఉన్నాయి. వీటిలో EX1 అత్యంత సరసమైన ధరలో లభించే ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. ఈ బైక్ కొనుగోలు చేయాలనుకుంటే ముందుగా తెలుసుకోవాల్సిన ఐదు ముఖ్యమైన విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1.అవోర్ EX1 ధర

అవోర్ EX1 ప్రారంభ ధర రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు. EX సిరీస్‌ లో ఇదే అత్యంత తక్కువ ధర కలిగిన మోడల్. కంపెనీ ఇప్పటికే ప్రీ బుకింగ్‌లను ప్రారంభించింది. కేవలం రూ.799 చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. త్వరలోనే డెలివరీలు ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది.

2.బ్యాటరీ కెపాసిటీ, రేంజ్

Advertisement

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో 3.24kWh బ్యాటరీ ప్యాక్ అందించారు. ఫుల్ ఛార్జ్‌ తో 160 కిలోమీటర్ల IDC రేంజ్ అందిస్తుందని కంపెనీ తెలిపింది. రోజువారీ నగర ప్రయాణాలకు ఈ రేంజ్ చాలామందికి సరిపోతుంది. బైక్‌ తో పాటు 750W ఛార్జర్ అందిస్తారు. దీని ద్వారా బ్యాటరీని 20 నుంచి 80 శాతం వరకు సుమారు మూడు గంటల్లో ఛార్జ్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.

3.పనితీరు గురించి..

అవోర్ EX1లో 7.5kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంది. ఈ బైక్  గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని కేవలం 3.2 సెకన్లలో చేరుకుంటుందని కంపెనీ వెల్లడించింది. రైడర్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎకో, సిటీ, స్పోర్ట్ అనే మూడు రైడింగ్ మోడ్‌లను అందించారు. రివర్స్ మోడ్ కూడా ఇందులో ఉంది.

4.ఫీచర్ల గురించి..

Advertisement

అవోర్ EX1లో 7 అంగుళాల LCD డిస్‌ ప్లేతో పాటు స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంది. బైక్‌కు సంబంధించిన సమాచారం మొబైల్ యాప్ ద్వారా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జియోఫెన్సింగ్, క్రాష్ అలర్ట్స్, ప్రిడిక్టివ్ హెల్త్ ట్రాకింగ్ లాంటి కనెక్టెడ్ ఫీచర్లను కూడా కంపెనీ అందిస్తోంది. వీటితో పాటు హిల్ హోల్డ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రీజెనరేటివ్ బ్రేకింగ్ లాంటి ఆధునిక ఫీచర్లు కూడా ఈ బైక్‌లో ఉన్నాయి.

5.కలర్స్, వారెంటీ గురించి..  

అవోర్ EX1 మూడు రంగుల్లో లభిస్తుంది. స్టార్‌లిట్ బ్లూ, మెటియోర్ రెడ్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లను కంపెనీ అందిస్తోంది. అంతేకాదు, కంపెనీ 5 సంవత్సరాలు, 60,000 కిలోమీటర్ల వారంటీ కూడా అందిస్తోంది. దీంతో బైక్‌ను ఎక్కువకాలం నమ్మకంగా ఉపయోగించుకోవచ్చని చెప్పవచ్చు.

Read Also: ఏథర్ సూపర్ సర్‌ ప్రైజ్.. కొత్త EL స్కూటర్‌ లాంచ్ డేట్ ఫిక్స్!

Related News

ఆగస్టులో దేశీ మార్కెట్ లో లాంచ్ కానున్న కొత్త కార్లు.. ఏ మోడల్ ఎప్పుడు వస్తుందో తెలుసా?

ఏథర్ సూపర్ సర్‌ ప్రైజ్.. కొత్త EL స్కూటర్‌ లాంచ్ డేట్ ఫిక్స్!

MG విండ్సర్‌ ఔట్.. ఇండియన్ EV మార్కెట్‌ లో కొత్త చాంపియన్!

జూలైలో మారుతి సుజుకికి బంపర్ సేల్స్.. వారెవ్వా.. ఒక్క నెలలో అన్ని లక్షల కార్లు అమ్మిందా?

హోండా నుంచి 3 కొత్త కార్లు.. ఏ మోడళ్లు వస్తున్నాయో తెలుసా?

జూలైలో టాటా అమ్మకాల జోరు.. వామ్మో.. ఒక్క నెలలో అన్ని కార్లు అమ్మిందా?

2030 నాటికి కియా నుంచి 8 ఎలక్ట్రిఫైడ్ కార్లు.. EV, హైబ్రిడ్, CNGపై భారీ ప్లాన్!

Big Stories

Advertisement
×