NTR Tweet: ‘I’m Game’…మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఇది.ఇక తాజాగా ఈ సినిమా నుండి ట్రైలర్ వదలగా ఆ ట్రైలర్ చూసిన వెంటనే విషెస్ చెప్పి ఒక్క ట్వీట్ తో సినిమా పై అంచనాలు పెంచేశాడు.ఇపుడు ఈ ట్వీటే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ట్రైలర్‌లో కనిపించిన ఎనర్జీ, యాక్షన్, స్టైల్ తనను బాగా ఆకట్టుకున్నాయని చెబుతూ, దుల్కర్‌పై ఉన్న అభిమానాన్ని ఎన్టీఆర్ మరోసారి బయటపెట్టాడు తారక్.ఇక ఈ ట్వీట్ ఇలా బయటకు రాగానే వేల సంఖ్యలో లైక్స్, షేర్స్ రావడంతో #ImGame, #NTR, #DulquerSalmaan అంటూ హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లోకి వెళ్లాయి.
ట్వీట్ లో ఏమన్నాడంటే …
తారక్ తన ట్వీట్ లో “Loved the fiery vibe of the #ImGame Trailer… Gripping and engaging throughout.. I’m sure my brother @dulQuer has something special on his hands yet again. Hope this bet pays off! Wishing him and the entire team all the very best!” అంటూ రాసుకురావడంతో మురిసిపోతున్నారు దుల్కర్ ఫ్యాన్స్.ఇక ట్వీట్ చూసిన మరికొంతమంది ఫ్యాన్స్ ఒక అడుగు ముందుకు వేసి ఇద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తే ఎలా ఉంటుందో అంటూ నెట్టింట డిబేట్లు పెట్టేస్తున్నారు కూడా.
ఇక ‘I’m Game’ ట్రైలర్ విషయానికి వస్తే.. మొదటి ఫ్రేమ్ నుంచే యాక్షన్, ఇంటెన్స్ విజువల్స్, స్టైలిష్ మేకింగ్‌తో ఆకట్టుకునేలా కట్ చేశారు దర్శకుడు నహాస్ హిదాయత్. ఇక ఈ సినిమాని కేవలం మాస్ యాక్షన్ మూవీగా కాకుండా ఎమోషన్స్, థ్రిల్లింగ్ మూమెంట్స్ కలిపిన కమర్షియల్ సినిమాగా తెరకెక్కించినట్టు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. అయితే ఈ ట్రైలర్ ఇదివరకే రావాల్సి ఉంది.కానీ లేట్ గా వచ్చినా ది బెస్ట్ అంటూ ట్రైలర్ ని తెగ మెచ్చేసుకుంటున్నారు మూవీ లవర్స్.
ఆగస్ట్ 20న రిలీజ్
ఇక దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో ఈ సినిమా చాలా స్పెషల్ అనే చెప్పాలి.కారణం 2023లో వచ్చిన King of Kotha తర్వాత ఆయన మలయాళంలో చేస్తున్న పెద్ద ప్రాజెక్ట్ ఇదే మరి.ఇక ఈ సినిమా దాదాపు 156 రోజుల పాటు 100కి పైగా లొకేషన్లలో షూటింగ్ చేశారని సమాచారం.ఇక సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతున్నాయని, పైగా సినిమాని ప్యాన్ ఇండియా వైడ్ గా సినిమా ని ఆగస్ట్ 20న రిలీజ్ చేయనున్నారనే వార్తలు సినిమా పై మరిన్ని అంచనాలు పెంచేశాయి.
also read :స్టార్ హీరోయిన్‌కే టోకరా.. క్రెడిట్ కార్డు నుంచి రూ.2.43 లక్షలు స్వాహా..!
ఇక ఈ సినిమాను ఆగస్టు 20న ఓణం సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తామంటూ మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు కూడా.ఇక ఈ సినిమాలో దుల్కర్‌తో పాటు ఆంటోని వర్గీస్, మిస్కిన్, కథిర్, కయాడు లోహర్, సంయుక్త విశ్వనాథన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జేక్స్ బీజోయ్ సంగీతం యాక్షన్ కొరియోగ్రఫీని అన్బరివ్ అందించారు.ఇక తారక్ విషయానికి వస్తే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ లో హీరోగా నటిస్తుండగా రుక్మిణీ వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెల్సిందే.ఇక ఈ సినిమాని వచ్చే ఏడు జూన్ 11న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికేఅనౌన్స్ చేశారు కూడా
ఎన్టీఆర్ ట్వీట్ ఎలాంటి బూస్టప్ ని ఇస్తుందో
మరోవైపు దుల్కర్ కూడా తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి చిత్రాలతో ఇప్పటికే ఇక్కడి ఆడియన్స్ కి దగ్గరైపోయాడు.ఇప్పుడు ‘I’m Game’తో మరోసారి పాన్ ఇండియా మార్కెట్‌ను టార్గెట్ చేస్తున్నాడు.చూడాలి మరి ఆగస్ట్ 20న రానున్న ఈ సినిమాకి ఎన్టీఆర్ ట్వీట్ ఎలాంటి బూస్టప్ ని ఇస్తుందో !
Loved the fiery vibe of the #ImGame Trailer… Gripping and engaging throughout.. I'm sure my brother @dulQuer has something special on his hands yet again. Hope this bet pays off! Wishing him and the entire team all the very best!https://t.co/WzfIsU9BBY@NAHASKh1…
— Jr NTR (@tarak9999) July 30, 2026