E-Paper
Advertisement

Abhishek Sharma Car Collection: ఫెరారీ To BMW.. క్రికెటర్ అభిషేక్ శర్మ కార్ కలెక్షన్ చూస్తే మతిపోవాల్సిందే!

Abhishek Sharma Car Collection: ఫెరారీ To BMW.. క్రికెటర్ అభిషేక్ శర్మ కార్ కలెక్షన్ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Abhishek Sharma’s Luxurious Car Collection: ఇండియన్ క్రికెటర్ అభిషేక్ శర్మ రీసెంట్ గా అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. మైదానంలోనే కాదు, బయట కూడా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చున్నారు. క్రీజ్ లో తను నిలబడితే చాలు బౌలర్లను చీల్చి చెండాడుతాడు. బాల్ ఎలా వచ్చినా బౌండరీ లైన్ దాటించేస్తాడు. ప్రస్తుతం టీమిండియాలో టాప్ స్టార్ గా కొనసాగుతున్నాడు. క్రికెట్ అంటే అతడికి ఎంత ఇష్టమే, కార్ కలెక్షన్ అన్నా అంతే ఇష్టం. అందుకే ఆయన గ్యారేజీలో బోలెడు కార్లు కొలుదీరాయి. లగ్జరీ కార్లు, SUVలు, హై ఫర్మార్మెన్స్ మోడల్స్ బోలెడు ఉన్నాయి. ఆయా నివేదికల ప్రకారం ప్రస్తుతం అభిషేక్ శర్మ దగ్గర ఉన్న కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

⦿ ఫెరారీ పురోసాంగ్యూ

ఫెరారీ పురోసాంగ్యూ అనేది తొలి నాలుగు డోర్లు, నాలుగు సీట్లు ఉన్న కారు. ఇది 725 CV అంటే 715 హార్స్‌ పవర్ పంప్ చేసే  V12 ఇంజిన్‌ తో కూడిన స్పోర్ట్స్ కారు. డ్యూయల్ కాక్‌పిట్ ఆర్కిటెక్చర్‌ తో కూడిన ఫెరారీ లాంజ్. ఈ కారును ఆయన ఎంతో ఇష్టపడి కొనుగోలు చేశాడు. తన గ్యారేజీలో ఈ కారు ఠీవీగా పార్క్ చేసి ఉంటుంది. ఈ SUV ధర  రూ. 10.5 కోట్ల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. కస్టమైజేషన్ ఎంపికల ఆధారంగా దీని ధర రూ.12 కోట్ల వరకు ఉంటుంది.

⦿ హావల్ H9

Advertisement

శర్మ ఈ అద్భుతమైన హావెల్ H9 SUVని ఆసియా కప్ 2025 తర్వాత కొనుగోలు చేశాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆసియా కప్ లో అతడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. ఆ ఆనందంలో ఈ కారును కొనుగోలు చేశాడు. H9 అనేది 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ ఇంజిన్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, 12.4 కిమీ/లీ ఇంధన సామర్థ్యంతో కూడిన పెద్ద కారు ఇది. ఇది చక్కటి భద్రతా ఫీచర్లు కలిగి ఉంటుంది. ఈ కారు ధర సుమారు రూ. 25 లక్షలు ఉంటుంది.

⦿ BMW 320d

అభిషేక్ గ్యారేజీలో ఉన్న మరో లగ్జరీ కారు BMW 320d. ఇది 2.0 లీటర్ ట్విన్‌ పవర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ తో స్పోర్టీ లుక్ లో ఆకట్టుకుంటుంది. ఇది 188 హార్స్‌ పవర్‌ శక్తిని అందిస్తుంది. ఈ కారు కేవలం 6.8 సెకన్లలో 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుంది. లెదర్ సీట్లు, బ్రష్ చేసిన అల్యూమినియం పార్ట్స్, యాంబియంట్ లైటింగ్, హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ తో ఆకట్టుకుంటుంది. ఈ కారు ధర రూ. 45 లక్షల నుంచి రూ. 60 లక్షల వరకు ఉంటుంది.

⦿ మహీంద్రా థార్

Advertisement

అభిషేక్ దగ్గర మహీంద్రా థార్‌  కూడా ఉంది. ఈ కారు ఐకానిక్ డిజైన్, అప్ డేటెడ్ నియో రెట్రో లుక్, మంచి ఆఫ్ రోడ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ కారులో ఆయన అడ్వెంచర్ రైడ్స్ కు వెళ్తుంటాడు. సిటీ రైడ్లు, వీక్లీ ఆఫ్ రోడింగ్ కోసం దీనిని ఎక్కువగా వాడుతాడు. ఈ కారు ధర రూ. 16 లక్షల నుంచి రూ. 22 లక్షల వరకు ఉంటుంది.

Read Also: టాటా సియెర్రా EV లాంచ్ డేట్ ఫిక్స్, మార్కెట్ లోకి అడుగు పెట్టేది ఎప్పుడంటే?

Related News

తక్కువ ధర.. ఎక్కువ మైలేజ్.. మధ్యతరగతి కుటుంబాలకు బెస్ట్ కార్లు!

కార్ల కంపెనీల దగ్గరే చవకగా సెకండ్ హ్యాండ్ కార్లు కొనేయొచ్చు.. జస్ట్ ఇలా చేస్తే చాలు!

హ్యుందాయ్ బౌల్డర్ కు పేటెంట్.. రగ్గడ్ లుక్‌ లో అదిరిపోయిందిగా!

విన్‌ ఫాస్ట్ డబుల్ సర్‌ ప్రైజ్.. కొత్త ఈ-స్కూటర్, ఈ-బైక్‌కు పేటెంట్!

టాటా అవిన్యా X టెస్టింగ్ షురూ.. నెట్టింట వైరల్ అవుతున్న స్పై షాట్స్!

థార్‌ కు నెక్స్ట్ లెవల్ అవతారం.. విజన్ T వచ్చేస్తోంది!

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

Big Stories

Advertisement
×