E-Paper
Advertisement

లీటర్ వాటర్ తో 280 కి.మీ రేంజ్.. హైడ్రోజన్ స్కూటర్ సంచలనం!

లీటర్ వాటర్ తో 280 కి.మీ రేంజ్.. హైడ్రోజన్ స్కూటర్ సంచలనం!
Advertisement

Bajaj Introduces Hydrogen Scooter: భారతీయ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న బజాజ్.. ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో వినియోగదారులను ఆకట్టకుంటుంది. ఇటీవల విడుదలైన బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ కు ప్రజల నుంచి ఓ రేంజ్ లో స్పందన లభించింది. ఇప్పుడు అదే సక్సెస్‌ను మరో క్రేజీ ఆవిష్కరణకు రెడీ అవుతోంది. కొత్తగా హైడ్రోజన్ టెక్నాలజీతో పనిచేసే చేతక్ స్కూటర్‌ ను పరిచయం చేయాలని ప్రయత్నిస్తోంది. భవిష్యత్తు రవాణాలో సరికొత్త ముందడుగు వేయబోతోంది.

నీటిని ఫ్యూయెల్ గా వాడుకుంటూ..

చేతక్ స్కూటర్‌కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, మరింత పర్యావరణ అనుకూలమైన మోడల్ ను అందుబాటులోకి తీసుకురావాలని బజాజ్ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే హైడ్రోజన్ వేరియంట్‌ పై పని చేస్తోంది. ఈ టెక్నాలజీ ప్రధానంగా హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్‌ పై ఆధారపడి పని చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే.. ఈ స్కూటర్ నీటిని ఉపయోగించి పవర్ ను ఉత్పత్తి చేసి, స్కూటర్‌ ను నడిపేలా డిజైన్ చేస్తున్నారు. ఈ విధానం వల్ల ఎలాంటి కాలుష్యం ఉండదు.

లీటర్ వాటర్ తో 280 కిలో మీటర్ల ప్రయాణం

Advertisement

ఈ కొత్త స్కూటర్‌ లో స్పెషల్ అట్రాక్షన్ రేంజ్.  కేవలం లీటరు నీటితో సుమారు 280 కిలోమీటర్ల వరకు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఇది సాధారణ ఎలక్ట్రిక్ స్కూటర్లతో పోలిస్తే చాలా ఎక్కువ. సుదూర ప్రయాణాలను సులభంగా చేసే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, హైడ్రోజన్ వినియోగం వల్ల ఛార్జింగ్ కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.

డిజైన్ గురించి..

Advertisement

డిజైన్ విషయానికి వస్తే, ఈ హైడ్రోజన్ వేరియంట్ ప్రస్తుతం ఉన్న చేతక్ ఎలక్ట్రిక్ మోడల్‌ను పోలి ఉండే అవకాశముంది. క్లాసిక్ లుక్‌ ను కొనసాగిస్తూ, ఆధునిక ఫీచర్లను కూడా ఇందులో యాడ్ చేసేలా కంపెనీ ప్రయత్నిస్తోంది. సౌకర్యవంతమైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ తో పాటు, డిజిటల్ ఫీచర్లు, కనెక్టివిటీ ఆప్షన్లు కూడా ఇందులో ఉండే అవకాశం ఉంది.

ఇప్పటికే పేటెంట్ పొందిన బజాజ్!

ఇప్పటికే ఈ హైడ్రోజన్ టెక్నాలజీకి సంబంధించిన పేటెంట్‌ను కంపెనీ పొందినట్లు తెలుస్తోంది. ఇది కేవలం కాన్సెప్ట్ మాత్రమే కాకుండా, వాస్తవ రూపం దాల్చే దశలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, అధికారికంగా మార్కెట్లో విడుదల చేసే తేదీ, ధర వివరాలు కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, వినియోగదారులు ఈ స్కూటర్‌ను తక్కువ డౌన్ పేమెంట్‌ తో కొనుగోలు చేసే అవకాశం ఉండవచ్చని తెలుస్తోంది. సుమారు రూ.20,000 డౌన్ పేమెంట్‌ తో ఈ స్కూటర్ ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ క్రేజీ స్కూటర్ కు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తంగా బజాజ్ చేతక్ హైడ్రోజన్ స్కూటర్ పొల్యూషన్ ప్రీ రవాణా దిశకగా కీలక ముందడుగుగా చెప్పుకోవచ్చు. కాలుష్యం తగ్గించడంతో పాటు, తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశాన్ని బజాజ్ అందిస్తుంది.

Read Also: తక్కువ టైమ్‌ లో ఫుల్ ఛార్జ్.. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న టాప్ EV స్కూటర్లు ఇవే!

Related News

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

నల్లగొండ జిల్లాలో ఎలక్ట్రిక్ వెహికల్స్ జోరు, ఏడాదిలో 11 వేలకు పైగా కొనుగోళ్లు!

432 కి.మీ రేంజ్.. అరగంటలో ఛార్జింగ్.. 11 వేల కి.మీ నడిపిన తర్వాత క్రెటా EV రివ్యూ!

జావా 42 బాబర్‌కు అదిరిపోయే లుక్.. ఆల్ స్టార్స్ ఎడిషన్ ఏముంది భయ్యా!

ఆగస్టులో అదరగొట్టిన టాప్ 5 కార్లు.. నంబర్ వన్‌ ఏదంటే?

టాటా ఈవీలపై కళ్లు చెదిరే ఆఫర్లు.. హారియర్ పై ఏకంగా రూ.2.75 లక్షల తగ్గింపు!

మహీంద్రా పేరు వెనుక ఇంత పెద్ద కథ ఉందా? కంపెనీ అసలు పేరు ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Big Stories

Advertisement
×