E-Paper
Advertisement

BMW Helmets: BMW నుంచి క్రేజీ హెల్మెట్లు.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?

BMW Helmets: BMW నుంచి క్రేజీ హెల్మెట్లు.. వీటి ప్రత్యేకత ఏంటో తెలుసా?
Advertisement

BMW System 8 Flip Up Helmets: BMW కంపెనీ సరికొత్త సిస్టమ్ 8 హెల్మెట్ జెనరేషన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సిస్టమ్ 8 కార్బన్, స్టాండర్డ్ సిస్టమ్ 8 పేరుతో వీటిని పరిచయం చేసింది. కాంపాక్ట్ టూరింగ్ ఫోకస్డ్ న్యూ సిస్టమ్ 8 హెల్మెట్ జనరేషన్‌ అందుబాటులోకి తీసుకురావడం పట్ల BMW మోటోరాడ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వీటి స్టైలింగ్ పాత జెనరేషన్ మాదిరిగానే ఉంది. కానీ, భద్రత, కంఫర్ట్ ను అప్‌ గ్రేడ్ చేసింది. ECE 22.06 స్టాండర్స్ కు అనుగుణంగా తయారు చేసింది.

సిస్టమ్ 8 హెల్మెట్ల ప్రత్యేకత ఏంటంటే?

ఈ రెండు హెల్మెట్లు మల్టీ జాయింట్ చిన్ బార్ మెకానిజంతో డిజైన్ ద్వారా ఫ్లిప్ అప్ చేయబడ్డాయి. ఓపెన్ ఉన్నప్పుడు కూడా హెల్మెట్‌ను కాంపాక్ట్‌ గా ఉంచుతుంది. ఇంటిగ్రేటెడ్ లాచ్ కారణంగా చిన్ సెక్షన్‌ ను పైకి లేపి రైడ్ చేసే అవకాశం ఉంటుంది. క్లోజ్ చేసినప్పుడు ఎయిర్ ఫ్లోను పెంచడానికి, లాంగ్ రైడ్స్లో అలసటను తగ్గించడానికి స్పాయిలర్‌ తో ఏరోడైనమిక్స్, ఏరోఅకౌస్టిక్స్ ను మెరుగు పరిచింది. వైజర్ సెటప్ రియల్ వెదర్ కు అనుగుణంగా ఉంటుంది. BMW పిన్‌ లాక్ 120 XLT మాక్స్ వ్యూ యాంటీ ఫాగ్ ప్రొటెక్షన్, పేలవమైన పరిస్థితులలో విజుబులిటీని పెంచేందుకు డ్యూయల్ లెన్స్ ను కలిగి ఉంటుంది.

Advertisement

ఇక ఈ హెల్మెట్ మోడల్స్ లో షెల్ నిర్మాణం ఉన్న చోట సేఫ్టీ టెక్నాలజీని కలిగి ఉంటుంది. సిస్టమ్ 8 కార్బన్ తక్కువ బరువు, మరింత స్ట్రాంగ్ గా ఉండేందుకు కార్బన్ అరామిడ్ గ్లాస్ ఫైబర్ మిశ్రమాన్ని ఉపయోగించారు. ఇది BMW స్పీక్‌ లో MIPS, MIPS ఇంటిగ్రే TXని కూడా లింక్ చేస్తుంది. ఇది ప్రమాదం సమయంలో తలకు ఎలాంటి గాయాలు కాకుండా కాపాడుతుంది.  ప్రామాణిక సిస్టమ్ 8 గ్లాస్ ఫైబర్, అరామిడ్ మిశ్రమాన్ని ఉపయోగిస్తుంది. భద్రతలో ఎక్కడా లోపం లేకుండా కాపడుతుంది.

కంపెనీ OEKO-TEX 100కి సర్టిఫైడ్ ఇన్నర్ ప్యాడింగ్, పలు డెన్సిటీస్ తో కూడిన పాలీస్టైరిన్ లోపలి నిర్మాణం, ఫిట్‌ ను స్టేబుల్ గా ఉంచడానికి ఉద్దేశించిన ఇంటిగ్రేటెడ్ నెక్ స్ట్రాప్‌ లను హైలైట్ చేస్తుంది. ఇది చిన్ సెక్షన్‌ను తెరవడానికి సెంట్రల్ బటన్, క్విక్ రిలీజ్ వైజర్ మెకానిజం, స్నాప్ ఇన్ బకిల్ స్టైల్ స్ట్రాప్, అడ్జెస్ట్ చేసే సన్ వైజర్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఆప్షనల్ వైజర్ కిట్‌లు, మల్టీపుల్ టిన్ట్‌లలో ప్లాన్ చేయబడ్డాయి. మిర్రర్ ఫినిషింగ్‌లు డిఫరెంట్ థిక్ నెస్ తో చీక్ ప్యాడ్‌లు ఫిట్‌ను చక్కగా ట్యూన్ చేసేలా రూపొందించబడ్డాయి.

8 రంగుల్లో అందుబాటులో

Advertisement

ఈ సిరీస్ హెల్మెట్లు BMW కనెక్టెడ్‌రైడ్ కమ్యూనికేషన్ సిస్టమ్ కోసం తయారు చేయబడ్డాయి. యాంటెనాలు, ఇంటర్‌ ఫేస్‌ లు  అన్ని సిస్టమ్ 8 హెల్మెట్‌ లలో ఇంటిగ్రేట్ చేయబడ్డాయి. రైడ్స్ ఎలాంటి ఇబ్బంది లేకుండా డ్రైవింగ్ అనుభూతిని పొందవచ్చు. సిస్టమ్ హెల్మెట్లు 8 ఐదు రంగుల్లో ఉన్నాయి. ధరకు సంబంధించి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Read Also: ఒక్క ఛార్జ్ తో 400 కిలో మీటర్ల రేంజ్, సింపుల్ ఎనర్జీ నుంచి అదిరిపోయే ఈవీ!

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×