E-Paper
Advertisement

ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ లొకేషన్ లీక్ అవ్వకూడదంటే.. ఈ హిడెన్ ఫీచర్‌ ఆన్ చేసుకోండి!

ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ లొకేషన్ లీక్ అవ్వకూడదంటే.. ఈ హిడెన్ ఫీచర్‌ ఆన్ చేసుకోండి!
Advertisement

iPhone Location Privacy: స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది. అయితే ఫోన్‌లో మన వ్యక్తిగత సమాచారం ఎంత ముఖ్యమో.. మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఎక్కడ ఎక్కువ సమయం గడుపుతున్నాం అనే లొకేషన్ వివరాలు కూడా అంతే సున్నితమైనవి. ఇవి ఇతరుల చేతికి చిక్కకుండా ఉండాలంటే ప్రైవసీ సెట్టింగ్స్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ఐఫోన్ యూజర్ల డేటా ప్రైవసీ కోసం యాపిల్ అందిస్తున్న కొన్ని ప్రత్యేక ఫీచర్లలో Limit Precise Location కూడా ఒకటి. ఈ సెట్టింగ్‌ను ఆన్ చేస్తే మొబైల్ నెట్‌వర్క్‌కు మీ ఖచ్చితమైన లొకేషన్ బదులుగా సుమారుగా ఉన్న ప్రాంతం మాత్రమే తెలిసేలా చేయవచ్చు. అసలు ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది? దీన్ని ఎలా ఆన్ చేయాలి? వంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఫీచర్ పనితీరు..

సాధారణంగా మనం ఫోన్ వాడుతున్నప్పుడు దగ్గర్లోని సెల్యులార్ టవర్ల ఆధారంగా మొబైల్ నెట్‌వర్క్ కంపెనీలు మన లొకేషన్‌ను సులభంగా పసిగడతాయి. మనం ఏ వీధిలో ఉన్నాం, ఏ షాపింగ్ మాల్‌లో ఉన్నామనేది కూడా ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ కొత్త ఫీచర్‌ను ఆన్ చేయడం వల్ల నెట్‌వర్క్ ఆపరేటర్లకు మీ లొకేషన్ గురించిన కేవలం ఒక సాధారణ అంచనా మాత్రమే ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. దీనివల్ల మీ ఫోన్ సిగ్నల్ క్వాలిటీ తగ్గదు, అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ సేవలకు ఎలాంటి అంతరాయం కలగదు.

Advertisement

Also Read: శాంసంగ్ నుంచి క్లిప్-ఆన్ ఇయర్ ఫోన్స్ వచ్చేశాయ్.. కిరాక్ లుక్, అదిరిపోయే ఫీచర్లు!

యాక్టివేషన్ విధానం..

ఈ ప్రైవసీ ఫీచర్‌ను మీ ఫోన్‌లో సెట్ చేసుకోవడం చాలా తేలిక. దీనికోసం ముందుగా ఐఫోన్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి, సెల్యులార్ ఆప్షన్‌‌పై క్లిక్ చేయాలి. అక్కడ సెల్యులార్ డేటా ఆప్షన్స్‌లోకి వెళ్తే Limit Precise Location టోగుల్ కనిపిస్తుంది.. దాన్ని ఆన్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేస్తే ఈ సెట్టింగ్ అమల్లోకి వస్తుంది. అలాగే అవసరం లేని యాప్‌‌లకు లొకేషన్ పర్మిషన్స్ తీసేయడం ద్వారా కూడా మన డేటాను మరింత సురక్షితంగా ఉంచుకోవచ్చు.

ట్రాకింగ్ గుర్తులు..

Advertisement

ఒకవేళ మీ ఫోన్ రహస్యంగా ట్రాకింగ్ అవుతుంటే కొన్ని స్పష్టమైన లక్షణాలు కనిపిస్తాయి. ఫోన్ హఠాత్తుగా స్లో అవ్వడం, బ్యాటరీ చాలా వేగంగా అయిపోవడం లేదా మీరు డౌన్‌లోడ్ చేయని కొత్త యాప్‌లు ఫోన్‌లో కనిపించడం వంటివి జరిగితే ఎవరో మిమ్మల్ని గమనిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. ఫోన్ ఎక్కువగా వేడెక్కుతున్నా, అనవసరమైన పాప్-అప్‌లు వస్తున్నా వెంటనే సెట్టింగ్స్‌లోని విపిఎన్ ప్రొఫైల్స్, బ్యాటరీ యూసేజ్‌ని చెక్ చేసుకోవడం మంచిది.

ప్రైవసీ ఆప్షన్స్ వాడటం..

యాపిల్ అందించే ఇలాంటి ఫీచర్లు మన డేటా ప్రైవసీకి కొండంత అండగా నిలుస్తాయి. డిజిటల్ యుగంలో మన లొకేషన్ వివరాలు ఇతరుల చేతికి చిక్కకుండా ఉండాలంటే.. అందుబాటులో ఉన్న ప్రైవసీ ఆప్షన్లను ఉపయోగించుకోవడమే ఉత్తమమైన మార్గం. మీ వద్ద కుడా ఐఫోన్‌ ఉంటే.. అందులోనూ ఈ చిన్న సెట్టింగ్ మార్చుకుని లొకేషన్ ట్రాకింగ్ భయాలు లేకుండా హాయిగా వాడేయండి.

Also Read: 110 ఇంచుల భారీ స్క్రీన్.. 6,000 నిట్స్ బ్రైట్‌నెస్.. హువావే కొత్త టీవీలు వచ్చేశాయ్!

Tags

Related News

రూ.1648కే 3 వస్తువుల కాంబో..ఇలాంటి ఆఫర్ ఎప్పుడూ చూసుండరు

ఐఫోన్ vs ఆండ్రాయిడ్: డిస్‌ప్లే పగిలినా, బ్యాటరీ పోయినా.. దేనికి రిపేర్ ఖర్చు ఎక్కువ?

రూ.1,999కే రియల్‌మీ 20000mAh పవర్ బ్యాంక్..ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్ అదిరిపోయాయి!

రూ.6,599కే బెస్ట్ టీవీ..ఆఫర్ పూర్తవకముందే కొనేయండి!

వేల రూపాయల ఫీచర్లు రూ.999కే..ఆఫర్ మాములుగా లేదుగా!

అమెజాన్ సేల్‌లో సగం ధరకే..బ్రాండెడ్ ఫ్రిజ్‌లు, వెంటనే కొనేయండి

రూ.1,500లోపు బెస్ట్ ఇయర్‌బడ్స్..బడ్జెట్ ధరలో పవర్‌ఫుల్ సౌండ్

Big Stories

Advertisement
×