E-Paper
Advertisement

జస్ట్ రూ.15 వేలకే ఇథనాల్ కన్వర్షన్ కిట్.. సింపుల్ గా E20 నుంచి E100 మారిపోవచ్చు!

జస్ట్ రూ.15 వేలకే ఇథనాల్ కన్వర్షన్ కిట్..  సింపుల్ గా E20 నుంచి E100 మారిపోవచ్చు!
Advertisement

From E20 to E100: దేశంలో ఇథనాల్ వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం E20 ఇంధనం అందుబాటులో ఉండగా, భవిష్యత్తులో E85, E100 లాంటి హై ఇథనాల్ మిశ్రమాల వినియోగాన్ని విస్తరించాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పెట్రోల్ కార్లను ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలుగా మార్చే ఇథనాల్ కన్వర్షన్ కిట్లపై ఆసక్తి పెరుగుతోంది.

కేవలం రూ. 15 వేలకే ఇథనాల్ కన్వర్షన్ కిట్లు

ఇండియన్ షుగర్ అండ్ బయో ఎనర్జీ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ISMA) డైరెక్టర్ జనరల్ దీపక్ బల్లానీ  దేశంలో స్థానికంగా తయారయ్యే ఇథనాల్ కన్వర్షన్ కిట్ల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో రెడీ అయ్యే కన్వర్షన్ కిట్ల ధర కేవలం రూ.15,000 వరకు ఉండే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే ఇలాంటి కిట్ల ధర రూ.40,000 నుంచి రూ.60,000 మధ్య ఉంటోందని చెప్పారు. ఈ కిట్లు వాహనాలను హై ఇథనాల్ మిశ్రమాలతో కూడా నడిచేలా మారుస్తాయి. దీంతో ఇప్పటికే రన్నింగ్ లో ఉన్న లక్షలాది పెట్రోల్ కార్లను కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలుగా మార్చుకునే అవకాశం ఉంటుంది.

ఇథనాల్ కన్వర్షన్ కిట్లపై కొనసాగుతున్న పరీక్షలు

Advertisement

ఇథనాల్ కన్వర్షన్ కిట్ల సాంకేతికత పనితీరును అంచనా వేయడానికి ISMA, IIT ఢిల్లీ సహకారంతో ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది. ఇందులో BS4 ప్రమాణాలకు చెందిన మారుతి స్విఫ్ట్, BS6 ప్రమాణాల స్విఫ్ట్ డిజైర్ కార్లలో విదేశాల నుంచి తెప్పించిన ఇథనాల్ కన్వర్షన్ కిట్లను అమర్చారు. ఫిన్లాండ్‌ కు చెందిన eFlexFuel కంపెనీ తయారు చేసిన ఈ కిట్లను ఉపయోగించి కార్లను E15 నుంచి E100 వరకు ఉన్న వివిధ ఇథనాల్ మిశ్రమాలతో పరీక్షించారు. ఈ కిట్ ధర ప్రస్తుతం సుమారు రూ.45,000 వరకు ఉంది.

పరీక్షలలో భాగంగా BS4 స్విఫ్ట్ కారును 10,500 కిలోమీటర్లు నడిపారు. ఇందులో E100 ఇంధనంతో 1,000 కిలోమీటర్ల ప్రయాణం కూడా ఉంది. అదే సమయంలో BS6 స్విఫ్ట్ డిజైర్‌ ను 14,250 కిలోమీటర్లు పరీక్షించారు. అందులో 5,000 కిలోమీటర్లు పూర్తిగా E100 ఇంధనంతో ప్రయాణించింది.  పరిశోధకులు ఈ కార్ల పనితీరు, వేగం, స్టార్టింగ్ సామర్థ్యం, ఇంధన వినియోగం, ఉద్గారాలు, ఇంజిన్ పనితీరు లాంటి అనేక అంశాలను పరిశీలించారు. పరీక్షల అనంతరం ఎలాంటి అసాధారణ సమస్యలు, ఇంజిన్‌ ఇబ్బందులు కలగలేదని వెల్లడించారు.

Advertisement

ఈ కన్వర్షన్ కిట్‌ లో ప్రత్యేక ఇథనాల్ సెన్సార్ ఉంటుంది. ఇది ఇంధనంలో ఎంత ఇథనాల్ ఉందో గుర్తించి, దానికి అనుగుణంగా ఫ్యూయల్ ఇంజెక్షన్ వ్యవస్థను సర్దుబాటు చేస్తుంది. దీంతో వాహనం E15, E20, E85, E100 లాంటి వివిధ ఇంధన మిశ్రమాలతోనూ చక్కగా నడుస్తుంది. ఈ అధ్యయనం ఫలితాలు పాజిటివ్ గా ఉన్నాయి. BS4, BS6 పెట్రోల్ వాహనాలను ఫ్లెక్స్ ఫ్యూయల్ వాహనాలుగా మార్చే అవకాశం ఉందని పరిశోధనలో తేలిందని పరిశోధకులు తెలిపారు.

మార్కెట్ లోకి వచ్చేందుకు మరికొంత సమయం

ఇథనాల్ కన్వర్షన్ కిట్లను వెంటనే మార్కెట్లోకి తీసుకురావడం సాధ్యం కాదని దీపక్ బల్లానీ  స్పష్టం చేశారు.  దేశంలో తయారయ్యే కన్వర్షన్ కిట్లు అమ్మకానికి రావాలంటే ముందుగా నియంత్రణ సంస్థలు, ఆటోమోటివ్ టెస్టింగ్ ఏజెన్సీలు, వాహన తయారీ సంస్థల నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుందన్నారు. ఇథనాల్ కన్వర్షన్ కిట్లకు సంబంధించిన పరీక్షలు, ఆమోదం, స్థానిక తయారీ ప్రక్రియల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించాలని ISMA ఇప్పటికే సంబంధిత అధికారులను కోరింది. భవిష్యత్తులో ఈ కిట్లు అందుబాటులోకి వస్తే, హై ఇథనాల్ ఇంధన వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంది.

Read Also: E20 ఫ్యూయల్ తో ఇంజిన్ దెబ్బతింటే ఇన్సూరెన్స్ వస్తుందా? పాత కారు ఓనర్లకు కొత్త టెన్షన్!

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×