Vijay Bouncer: వెండితెరపై వందల మంది రౌడీలను ఒంటిచేత్తో తరిమికొట్టే హీరోలను మనం నిత్యం చూస్తూనే ఉంటాం. కానీ, నిజ జీవితంలోకి వచ్చేసరికి వారు కూడా సాదాసీదా రక్షణ వలయంలోనే తిరుగుతుంటారు. అయితే, కోలీవుడ్ స్టార్, ‘తలపతి’ విజయ్ మాత్రం రీల్ లైఫ్‌లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ తాను అందరికంటే భిన్నమని నిరూపించుకున్నారు. సమాజంలో మార్పు అనేది మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలని నమ్మే విజయ్, తాజాగా తీసుకున్న ఒక సంచలన నిర్ణయం ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది అవును.. తన పర్సనల్ సెక్యూరిటీ కోసం ఒక మహిళా బౌన్సర్‌ను నియమించుకుని, సినిమా ఇండస్ట్రీలోనే సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టారు.
సౌత్ ఇండియాలోనే అత్యధిక ఫ్యాన్ బేస్ మరియు క్రేజ్ ఉన్న హీరోల్లో తలపతి విజయ్ టాప్‌లో ఉంటారు. ఆయన ఎక్కడికి వెళ్లినా అభిమానుల కోలాహలం, తోపులాట చాలా కామన్‌గా జరుగుతుంటాయి. అలాంటి హై-ప్రొఫైల్ సెక్యూరిటీ విభాగంలో, సాధారణంగా భారీ కాయం ఉన్న మగ బౌన్సర్లను మాత్రమే మనం చూస్తుంటాం. కానీ, విజయ్ ఆ పాత పద్ధతులకు స్వస్తి పలికారు. మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్న ఈ రోజుల్లో, అత్యంత కఠినమైన పర్సనల్ సెక్యూరిటీ విభాగంలోనూ వారికి సమాన అవకాశాలు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు.
Also read :మెగాస్టార్ 158 సెట్స్ లోకి ఎంట్రీ.. భారీ అంచనాలు, అంతకుమించిన అనుమానాలు!
సాధారణంగా సెలబ్రిటీల భద్రతను చూసుకోవడం అంటే చాలా పెద్ద టాస్క్. ముఖ్యంగా విజయ్ లాంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ పబ్లిక్‌లోకి వస్తే జనాన్ని కంట్రోల్ చేయడం ఎవరికైనా కత్తిమీద సామే అవుతుంది. అలాంటి చోట ఒక మహిళా బౌన్సర్‌ను తన రక్షణ వలయంలో చేర్చుకోవడం సామాన్యమైన విషయం కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేవలం భద్రతకు సంబంధించిన నిర్ణయం మాత్రమే కాదు.. స్త్రీ శక్తిని గౌరవించే ఒక గొప్ప సంకేతం కూడా.పురుషులకు ఏమాత్రం తీసిపోని విధంగా మహిళలు కూడా ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొగలరని విజయ్ ఈ చర్య ద్వారా అందరికీ చాటిచెప్పారు. అంతేకాదు, బాడీగార్డ్ వృత్తి అనగానే కేవలం పురుషులకే పరిమితం అనే అపోహను బద్దలు కొడుతూ, ఎంతోమంది మహిళలకు ఈ రంగంలోకి రావడానికి విజయ్ ఒక పెద్ద ఇన్సిపిరేషన్‌గా నిలిచారు.
ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో విజయ్ ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కేవలం సినిమాల్లోనే డైలాగులు చెప్పి చేతులు దులుపుకునే రకం కాదు మా అన్నా అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. అందుకే తలపతి అంటే మాకు కేవలం ఒక హీరో కాదు.. అదో ఎమోషన్ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా మహిళా లోకం నుంచి విజయ్ కి భారీ మద్దతు లభిస్తోంది. సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ హీరోలు ఉన్నప్పటికీ, సమాజంలో ఒక మంచి మార్పును తెచ్చే నిర్ణయాలు తీసుకోవడంలో తానూ ఎప్పుడూ ముందే ఉంటానని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు.
Also read :ఆ హిట్ సినిమా రీమేక్ ? అనిల్ రావిపూడి కొత్త సినిమా కథపై సరికొత్త లీక్స్ !
ప్రస్తుతం విజయ్ పొలిటికల్ మీటింగ్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన పాల్గొనే ప్రతి కార్యక్రమంలోనూ ఇప్పుడు ఈ మహిళా బౌన్సర్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కట్టుదిట్టమైన భద్రత మధ్య విజయ్ నడుచుకుంటూ వస్తుంటే, ఆయన పక్కనే అంతే హుందాగా, అలర్ట్‌గా ఉంటూ డ్యూటీ నిర్వహిస్తున్న ఆమె విజువల్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ క్రేజీ అప్‌డేట్ విజయ్ ఇమేజ్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లిందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాటలతో కాకుండా చేతలతో సమాజానికి సందేశాన్ని ఇచ్చిన తలపతి విజయ్ నిజంగానే రియల్ లైఫ్ సూపర్ స్టార్ అనిపించుకున్నారు.