E-Paper
Advertisement

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!

టెస్లా కారులో గ్రోక్ AI.. ఇండియన్ యూజర్లకు సరికొత్త స్మార్ట్ ఫీచర్లు!
Advertisement

Tesla Brings Grok AI to Model Y in India: టెస్లా మోడల్ Y కొనుగోలు చేసిన భారతీయ వినియోగదారులకు కంపెనీ మరో ఆసక్తికరమైన అప్‌ డేట్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ SUVలో గ్రోక్ AI అసిస్టెంట్ తో పాటు పలు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఫీచర్లను పొందేందుకు అదనంగా ఎలాంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. కంపెనీ ఓవర్ ది ఎయిర్ సాఫ్ట్‌ వేర్ అప్‌ డేట్ ద్వారా వీటిని వినియోగదారులకు అందిస్తోంది.

గ్రోక్ AIతో ఈజీ వాయిస్ కమాండ్స్

టెస్లా మోడల్ Yలో గ్రోక్ AI అసిస్టెంట్‌ ను ఉపయోగించడం చాలా ఈజీ. స్టీరింగ్ వీల్‌ మీద ఉన్న వాయిస్ బటన్‌ ను నొక్కడం ద్వారా లేదంటే ‘హే గ్రోక్’ అని చెప్పడం ద్వారా దీనిని యాక్టివేట్ చేయవచ్చు. ఈ AI అసిస్టెంట్‌ తో డ్రైవర్ వాయిస్ కమాండ్ల ద్వారా అన్ని పనులను చేసే అవకాశం ఉంటుంది. ట్రావెల్ రూట్ సెట్ చేయడం, సమీపంలోని సూపర్‌ చార్జింగ్ స్టేషన్లు, కాఫీ షాపులు, రెస్టారెంట్లు, ఆసుపత్రులు, ఏటీఎంలు, టాయిలెట్లు లాంటి ప్రదేశాలను గుర్తించడం మరింత సులభంగా మారుతుంది.

భారతీయ భాషలకు సపోర్ట్

Advertisement

గ్రోక్ AI ప్రత్యేకతల్లో ఒకటి భారతీయ భాషలకు సపోర్టు ఇవ్వడం. ఇది తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మరాఠీ, గుజరాతీ లాంటి భాషల్లో వినియోగదారులతో మాట్లాడుతుంది. దీంతో డ్రైవింగ్ సమయంలో ఇంగ్లీష్ తెలియని వారికి కూడా ఈ ఫీచర్ ఉపయోగకరంగా ఉంటుంది.  వినియోగదారుడు తనకు నచ్చిన లాంగ్వేజ్ ను ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది.

కొత్త నావిగేషన్ ఫీచర్లు

ఈ తాజా అప్‌ డేట్‌ తో టెస్లా నావిగేషన్ వ్యవస్థ కూడా మరింత సూపర్ గా మారింది. డ్రైవర్ రోజువారీ ప్రయాణ అలవాట్లు, తరచుగా వెళ్లే ప్రాంతాలను గుర్తించి వాటి ఆధారంగా గమ్యస్థానాలను సూచిస్తుంది. ఇంతకుముందు ఇల్లు, ఆఫీస్లాంటి  ప్రదేశాలకే పరిమితమైన కొన్ని ఫీచర్లు ఇప్పుడు మరిన్ని డెస్టినేషన్స్ కు విస్తరించబడ్డాయి. అంతేకాదు, మల్టీ స్టాప్‌లతో కూడిన ప్రయాణాలను కూడా వాయిస్ కమాండ్ ద్వారా ప్లాన్ చేసుకోవచ్చు.

డ్రైవింగ్ టైమ్ లో మరింత సాయం

Advertisement

కారు డిస్‌ ప్లేలో కనిపించే హెచ్చరికలు, సూచనలు, ఇతర మెసేజ్ ల అర్థాన్ని కూడా గ్రోక్ AI వివరిస్తుంది. దీంతో కొత్తగా టెస్లా ఉపయోగిస్తున్న వారికి వెహికల్ లోని ఫీచర్లను అర్థం చేసుకోవడం మరింత సులభమవుతుంది.

టెస్ట్ డ్రైవ్‌లకు అవకాశం

ఈ AI అప్‌డేట్‌ను ప్రకటించిన సందర్భంగా టెస్లా మరో కీలక విషయాన్ని వెల్లడించింది. దేశంలోని తన డీలర్‌షిప్‌లలో మోడల్ Y ప్రీమియం RWD వేరియంట్ టెస్ట్ డ్రైవ్‌లను కూడా ప్రారంభించింది. దీంతో కొనుగోలు చేయాలనుకునే వారు కొత్త ఫీచర్లను స్వయంగా ఎక్స్ పీరియెన్స్ చేసే అవకాశం పొందుతున్నారు.

టెస్లా మోడల్ Y గురించి..

భారత మార్కెట్లో టెస్లా మోడల్ Y రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రీమియం RWD 5 సీటర్ ధర రూ.50.89 లక్షలు, ప్రీమియం AWD 7-సీటర్ ధర రూ.61.99 లక్షలు. ఈ ఎలక్ట్రిక్ SUVకు హ్యుందాయ్ ఐయోనిక్ 5, కియా EV6, BYD సీలియన్ 7 లాంటి మోడళ్లతో పోటీ పడుతున్నాయి.

Read Also: హోండా కార్లపై కళ్లు చెదిరే ఆఫర్లు.. ఆ మూడు మోడల్స్ పై ఏకంగా రూ.2.45 లక్షల డిస్కౌంట్!

Related News

థార్ కొనాలనుకుంటున్నారా? కాస్త ఆగండి.. కొత్త ఫేస్‌లిఫ్ట్ వచ్చేస్తోంది!

అపాచీ బైక్‌లకు బిగ్ అప్‌డేట్.. కొత్త వేరియంట్లు, అదిరిపోయే ఫీచర్లు ఇవే!

మారుతి బాలెనో vs టాటా ఆల్ట్రోజ్.. టాప్ వేరియంట్లలో ఏది బెస్ట్?

థార్ To డస్టర్.. దీపావళికి ముందే రాబోతున్న 5 అదిరిపోయే SUVలు!

మహీంద్రా BE 6 vs టాటా కర్వ్ EV.. రెండింటిలో ఏది తోప్ అంటే?

సీటు కింద ఏకంగా 70 లీటర్ల స్టోరేజ్.. ఎక్కువ బూట్ స్పేస్ కావాలంటే వీటిని కొనండి!

ఎర్టిగా To ఇన్నోవా.. ఆగస్టులో ఎక్కువగా అమ్ముడైన 7-సీటర్ కార్లు ఇవే!

సింగిల్ ఛార్జ్ తో 400 కి.మీ రేంజ్.. కళ్లు చెదిరే ఈవీ స్కూటర్లు ఇవే!

Big Stories

Advertisement
×