E-Paper
Advertisement

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?

హోండా సిటీ vs హ్యుందాయ్ వెర్నా.. CVTలో ఏది బెస్ట్?
Advertisement

Honda City CVT vs Hyundai Verna CVT: హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా.. భారత మార్కెట్లో మంచి గుర్తింపు ఉన్న రెండు ప్రీమియం సెడాన్లు. రెండు కార్లలోనూ 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు మాన్యువల్, CVT గేర్‌ బాక్స్ ఆప్షన్లు ఉన్నాయి. అయితే డ్రైవింగ్‌లో, ముఖ్యంగా CVT వెర్షన్ల పనితీరులో ఏ కారు ముందు ఉంటుంది? వాస్తవ పరిస్థితుల్లో నిర్వహించిన పరీక్షల్లో ఏం తేలిందంటే?

ఇంజిన్, పవర్‌ లో సిటీ ముందంజ!

హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా రెండూ నాలుగు సిలిండర్ల 1.5 లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగిస్తున్నాయి. సిటీ 1,498cc ఇంజన్ 121hp పవర్, 145Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు వెర్నా 1,497cc ఇంజన్ 115hp పవర్, 144Nm టార్క్‌ ను అందిస్తుంది. అంటే, పవర్ విషయంలో సిటీకి 6hp, టార్క్‌ లో 1Nm ఆధిక్యం ఉంది. అంతేకాదు, సిటీ కెర్బ్ వెయిట్ 1,168 కిలోలు కాగా, వెర్నా 1,224 కిలోల బరువు ఉంటుంది. సిటీ దాదాపు 55 కిలోలు తేలికగా ఉండటం కూడా ప్రారంభ యాక్సిలరేషన్‌లో దానికి ఉపయోగపడింది. ట్రాన్స్‌ మిషన్ విషయానికి వస్తే సిటీలో 7 స్టెప్ CVT, వెర్నాలో 8 స్టెప్ CVT అందుబాటులో ఉన్నాయి.

0-100 కి.మీలో వెర్నా దూకుడు

Advertisement

పరీక్షల్లో ప్రారంభంలో హోండా సిటీ మంచి ఆధిక్యాన్ని చూపించింది. 20kmph, 40kmph, 60kmph వరకు సిటీ వెర్నా కంటే వేగంగా దూసుకెళ్లింది. అయితే, ఆ తర్వాత వెర్నా పుంజుకుంది. 0-100 కి.మీ వేగాన్ని సిటీ 11.84 సెకన్లలో చేరుకోగా, వెర్నా 11.57 సెకన్లలోనే పూర్తి చేసింది. అంటే, ఈ పరీక్షలో వెర్నా సుమారు 0.27 సెకన్ల తేడాతో ముందుంది. ఇక 120 కి.మీ వరకు వెళ్లే సమయంలో తేడా మరింత పెరిగింది. సిటీకి 16.20 సెకన్లు పట్టగా, వెర్నా 14.36 సెకన్లలోనే ఆ వేగాన్ని అందుకుంది.

రోలింగ్ యాక్సిలరేషన్‌లోనూ వెర్నా జోష్!

కారు ఇప్పటికే కదులుతున్నప్పుడు వేగం పెంచే పరిస్థితిని రోలింగ్ యాక్సిలరేషన్ అంటారు. 20-80 కి.మీ కిక్‌డౌన్ పరీక్షలో వెర్నా 6.49 సెకన్లలో పూర్తి చేయగా, సిటీకి 6.69 సెకన్లు పట్టింది. అదేవిధంగా 40-100 కి.మీ పరీక్షలో వెర్నా 8.18 సెకన్ల సమయం తీసుకోగా, సిటీ 8.27 సెకన్లు తీసుకుంది. రెండు పరీక్షల్లోనూ వెర్నా ముందుంది. అయితే రోజువారీ డ్రైవింగ్‌ లో ఈ తేడా చాలా పెద్దగా అనిపించకపోవచ్చు.

ధర విషయంలో వెర్నా ముందు!  

Advertisement

ధరలను పరిశీలిస్తే కూడా హ్యుందాయ్ వెర్నా CVT కొంత తక్కువ ధరకే లభిస్తోంది. వెర్నా CVT ధరలు రూ.14.46 లక్షల నుంచి రూ.17.21 లక్షల వరకు ఉన్నాయి. హోండా సిటీ CVT ధరలు రూ.14.61 లక్షల నుంచి రూ.17.46 లక్షల వరకు ఉన్నాయి. అంటే వెర్నా ప్రారంభ ధర సిటీ కంటే రూ.15,000 తక్కువ. టాప్ వేరియంట్లలో ఈ తేడా రూ.25,000 వరకు ఉంది.

Read Also: CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

Tags

Related News

CNG నింపుతుండగా భారీ పేలుడు.. కారు యజమానులు ఈ 3 విషయాల్లో జాగ్రత్త!

కియా కార్లపై అదిరిపోయే పండుగ ఆఫర్లు.. ఏకంగా రూ.1.70 లక్షల వరకు తగ్గింపు!

టాటా కార్లపై కళ్లు చెదిరే అక్టోబర్ ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.1.25 లక్షల బెనిఫిట్!

సెకెండ్ హ్యాండ్ కారు కొంటున్నారా? మైలేజీతో పాటు ఇవి కూడా చెక్ చేయండి!

భారత్‌లోకి BYD లగ్జరీ బ్రాండ్ డెంజా ఎంట్రీ.. తొలి కార్లు ఇవే!

ఏప్రిలియా నుంచి క్రేజీ మ్యాక్సీ స్కూటర్లు.. చూస్తే మతిపోవాల్సిందే!

అక్టోబర్‌లో అదిరే 5 ఫేస్‌ లిఫ్ట్ కార్లు.. కొత్త లుక్, అదిరిపోయే ఫీచర్లు!

Big Stories

Advertisement
×