E-Paper
Advertisement

హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఆ మోడళ్లపై రూ.2.15 లక్షల వరకు ఆదా!

హోండా కార్లపై భారీ డిస్కౌంట్లు.. ఆ మోడళ్లపై రూ.2.15 లక్షల వరకు ఆదా!
Advertisement

Honda Car Discounts 2026: హోండా కార్స్ ఇండియా జూన్ 2026కు సంబంధించి తన కార్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించింది. ఎలివేట్, అమేజ్, సిటీ లాంటి మోడళ్లపై ఈ నెలలో గరిష్టంగా రూ. 2.15 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తోంది. క్యాష్ డిస్కౌంట్లు, ఎక్స్చేంజ్ బోనస్‌ లు, లాయల్టీ ఆఫర్లు, అదనపు వారంటీ  లాంటి బెనిఫిట్స్ కొనగోలుదారుల ముందుకు తీసుకొచ్చింది. ఈ ఆఫర్లు జూన్ 30 వరకే అందుబాటులో ఉంటాయని కంపెనీ ప్రకటించింది. ప్రతి సిటీలో, డీలర్‌ షిప్‌ ను బట్టి డిస్కౌంట్లలో చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది.

హోండా ఎలివేట్ పై రూ. 2.15 లక్షల తగ్గింపు

హోండా లైనప్‌ లో ఈ నెల అత్యధిక ప్రయోజనాలు అందిస్తున్న మోడల్ హోండా ఎలివేట్ SUV. ఈ SUVపై రూ. 2.15 లక్షల వరకు బెనిఫిట్స్ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ZX MT, ZX CVT లాంటి టాప్ వేరియంట్లపై భారీ తగ్గింపులు అందిస్తోంది. అలాగే V అపెక్స్ వేరియంట్‌ పై సుమారు రూ. 1.61 లక్షల వరకు, VX ట్రిమ్‌పై సుమారు రూ. 1.53 లక్షల వరకు ఆఫర్లు ఉన్నాయి. క్యాష్ డిస్కౌంట్ తో పాటు కొన్ని వేరియంట్లపై  యాక్సెసరీ ప్యాకేజీలు కూడా అందిస్తున్నారు. ఇందులో 360 డిగ్రీ కెమెరా, ప్రీమియం డాష్‌ క్యామ్ లాంటి ఆధునిక ఫీచర్లు ఉచితంగా లభించే అవకాశం ఉంది. హోండా ఎలివేట్ ప్రస్తుతం భారత మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న SUVలలో ఒకటిగా నిలుస్తోంది. ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడళ్లకు పోటీగా ఉంది.

హోండా అమేజ్ పై రూ. 67,000 తగ్గింపు

Advertisement

కాంపాక్ట్ సెడాన్ విభాగంలో హోండా అమేజ్ కూడా ఈ నెల ప్రత్యేక ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. అమేజ్ ZX MT వేరియంట్‌ పై గరిష్టంగా రూ. 67,000 వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. VX వేరియంట్‌పై సుమారు రూ. 48,000 వరకు, V వేరియంట్‌పై రూ. 28,000 వరకు డిస్కౌంట్లు లభిస్తున్నాయి. హోండా CNG కన్వర్షన్ ప్రోగ్రామ్‌ ను కూడా కొనసాగిస్తోంది. ఎంపిక చేసిన అమేజ్ వేరియంట్లపై CNG కిట్ ఇన్‌స్టాలేషన్‌కు రూ. 20,000 వరకు రీయింబర్స్‌ మెంట్ కూడా అందిస్తోంది. అమేజ్ విశాలమైన క్యాబిన్, సాఫ్ట్ డ్రైవింగ్ ఎక్స్ పీరియెన్స్, పెట్రోల్ ఇంజన్ కారణంగా వినియోగదారుల్లో మంచి ప్రజాదరణ పొందింది.

హోండా సిటీపై రూ. 1.56 లక్షల తగ్గింపు

ప్రీమియం సెడాన్ విభాగంలో ఉన్న హోండా సిటీపై కూడా ఈ నెల మంచి డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. హోండా సిటీ పెట్రోల్ వేరియంట్లపై సుమారు రూ. 1.56 లక్షల వరకు బెనిఫిట్స్ లభిస్తున్నాయి. అదే సమయంలో హోండా సిటీ e:HEV హైబ్రిడ్ మోడల్‌పై కూడా రూ. 1.97 లక్షల వరకు తగ్గింపులు ఉన్నాయి. ఈ ఆఫర్లు ముఖ్యంగా ప్రీ ఫేస్‌లిఫ్ట్ మోడళ్లకు, MY25 స్టాక్‌పై ఎక్కువగా వర్తిస్తాయి. ఇంధన సామర్థ్యం, ప్రీమియం ఫీచర్లు, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం కోరుకునే కస్టమర్లకు హోండా సిటీ మంచి ఆప్షన్ గా కొనసాగుతోంది.

Advertisement

Read Also: టాటా నుంచి మరో రెండు ఎలక్ట్రిక్ SUVలు.. ప్లాన్ అదిరింది మాస్టారూ!

Related News

యాక్టివా To బర్గ్‌ మన్.. ఏథర్ కోనార్క్‌ కు పోటీ ఇచ్చే 6 స్కూటర్లు ఇవే!

హ్యుందాయ్ కొత్త SUV పేరు ఇదే.. త్వరలో మార్కెట్లోకి ఎంట్రీ!

మరోసారి పెరిగిన అమేజ్ ధర.. ఆటోమేటిక్ వేరియంట్‌పై భారీ పెంపు!

స్విఫ్ట్ ధర మళ్లీ పెరిగింది.. ఇప్పుడు రేటు ఎంతంటే?

ఒకటి పెట్రోల్, మరొకటి ఫుల్ ఎలక్ట్రిక్.. హోండా నుంచి 2 కొత్త SUVలు వచ్చేస్తున్నాయి!

బైక్ లవర్స్ కు పండగే.. 3 నెలల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న 10 క్రేజీ టూ వీలర్స్ ఇవే!

JSW కాంబ్యాట్ SUV వచ్చేస్తోంది.. టయోటా ఫార్చ్యూనర్‌ కు ఇక చుక్కలేనా?

టాటా పంచ్ ధరల షాక్.. పెట్రోల్, EV మోడళ్లపై ఏకంగా రూ.20 వేల పెంపు!

Big Stories

Advertisement
×