E-Paper
Advertisement

Honda Shine 125: హోండా నుంచి షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్, లాంచింగ్ ఎప్పుడంటే?

Honda Shine 125: హోండా నుంచి షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్, లాంచింగ్ ఎప్పుడంటే?
Advertisement

Honda Shine 125 Limited Edition: హోండా పాపులర్ బ్రాండ్ షైన్ కు మార్కెట్ లో మంచి క్రేజ్ ఉంది. దేశ వ్యాప్తంగా మంచి ప్రజాదారణ పొందింది. తాజాగా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్‌ కు సంబంధించి కంపెనీ కీలక ప్రకటన చేసింది. త్వరలోనే లాంచ్ చేయనున్నట్లు వెల్లడించింది.  సైలెంట్ గా ఈ బైక్ గురించి తన అధికారిక వెబ్ సైట్ లో కీలక వివరాలను వెల్లడించింది. ఈ మోటార్ సైకిల్ ఇప్పటికే ఉన్న షైన్ 125 డిస్క్ వేరియంట్ ఆధారంగా తయారు చేస్తున్నట్లు తెలిపింది. మరికొద్ది రోజుల్లోనే లాంచ్ కాబోతుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ బైక్ డిజైన్ విషయంలో కొన్ని మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇంజిన్ కు సంబంధించి ఎలాంటి మార్పులు ఉండవని తెలుస్తోంది.

హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ మార్పులు ఇవే!

హోండా షైన్ 125  లిమిటెడ్ ఎడిషన్ పెర్ల్ సైరెన్ బ్లూ అనే కొత్త కలర్ వేరియంట్ లో అందుబాటులోకి రానుంది. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ మీద షైన్  గ్రాఫిక్స్‌ తో డార్క్ బ్లూ కలర్ ఫినిషింగ్ ను కలిగి ఉంది. అల్లాయ్ వీల్స్ బ్రౌన్ కలర్ లో ఉంటాయి. ప్రైమరీ డిస్క్ మోడల్‌ తో సహా ఇతర షైన్ 125 వేరియంట్‌లలో ఈ రకమైన కలర్స్ అందుబాటులో లేవు.

హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ ఇంజిన్

Advertisement

లిమిటెడ్ ఎడిషన్‌లో ఎలాంటి ఇంజిన్ మార్పులు లేవు. ఇది 123.94cc, ఎయిర్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. 7,500 rpm దగ్గర 10.6 hp పవర్ ను ఉత్పత్తి చేస్తుంది. 6,000 rpm దగ్గర 11 Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ డైమండ్ టైప్ ఫ్రేమ్‌ ను కలిగి ఉంటుంది. టెలిస్కోపిక్ ఫ్రంట్ సస్పెన్షన్, వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌లు ఉంటాయి.

హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ స్పెసిఫికేషన్లు

షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ పొడవు 2,046mm, వెడల్పు 741mm, ఎత్తు 1,116mm ఉంటుంది. దీని వీల్‌ బేస్ 1,285mm, గ్రౌండ్ క్లియరెన్స్ 162mm. కెర్బ్ బరువు 113 కిలోలు. సీటు ఎత్తు 791mm, సీటు పొడవు 651mm. ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 10.5 లీటర్లు ఉంటుంది.

Advertisement

Read Also: MV అగస్టా రష్ టైటానియో లిమిటెడ్ ఎడిషన్ లాంచ్, డిజైన్ భలే ఉంది గురూ!

హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ ధర

ఇక హోండా షైన్ 125 లిమిటెడ్ ఎడిషన్ కు సంబంధించిన ధర ఎంత అనే విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే, షైన్ 125తో పోల్చితే కాస్త ధర ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. షైన్ 125 ఎక్స్ షోరూమ్ ధర సుమారు రూ. 80,000 – రూ. 88,000 వరకు ఉంటుంది.  ఆన్ రోడ్ ధర సుమారు  రూ. 97,500 నుంచి రూ. 1,05,000 వరకు ఉంటుంది. ఈ ధర వేరియంట్, ఇన్సూరెన్స్ ఆధారంగా మారుతుంది.

Read Also:  రోల్స్ రాయిస్ కార్లకు ఎందుకు అంత ధర.. అల్టిమేట్ లగ్జరీ వెనుక రహస్యం ఇదే!

Related News

జూలైతో పోల్చితే ఆగస్టులో తగ్గిన EV స్కూటర్ అమ్మకాలు.. కారణం ఏంటంటే?

కైనెటిక్ లవర్స్ కు గుడ్ న్యూస్.. ఇప్పుడు ఏకంగా 132 కి.మీ రేంజ్!

టెస్లా సైబర్‌ ట్రక్‌కు ఇండియన్ టచ్.. ఫొటోలు చూస్తే నవ్వు ఆపుకోలేరు!

నెక్సాన్ To కర్వ్.. సెప్టెంబర్ లో టాటా కార్లపై ఊహించని డిస్కౌంట్లు!

మహీంద్రా SUVలపై భారీ డిస్కౌంట్లు.. స్కార్పియో Nపై ఏకంగా రూ.3 లక్షల తగ్గింపు!

ఎలక్ట్రిక్ స్కూటర్లకు సూపర్ డిమాండ్.. 8 నెలల్లోనే 13 లక్షలకు పైగా అమ్మకాలు!

సింపుల్ ఎనర్జీ సూపర్ జోష్.. ఏడాదిలో 10 వేలకుపైగా ఈవీ స్కూటర్ల సేల్!

ఈవీ రంగంలో హీరో దూకుడు.. నంబర్ వన్ కోసం అదిరిపోయే ప్లాన్!

Big Stories

Advertisement
×