E-Paper
Advertisement

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Honda CB350 2026 Launched: హోండా 350cc బైక్ లైనప్‌ ను తాజాగా అప్‌డేట్ చేసింది. CB350, CB350C, CB350RS మోడళ్లతో కూడిన కొత్త రేంజ్‌ లో ధరలు, వేరియంట్ పేర్లలో కీలక మార్పులు చేసింది. కొత్త లైనప్‌లో ధరలు రూ.1,95,200 నుంచి ప్రారంభమై రూ.2,04,700 వరకు ఉన్నాయి. ఈ మోడళ్లను జూలైలో తొలిసారి ప్రదర్శించిన హోండా.. ఇప్పుడు అధికారికంగా ధరలను ప్రకటించింది. CB350RS వెంటనే అందుబాటులోకి రాగా, CB350, CB350C మోడళ్ల అమ్మకాలు  అక్టోబర్ నుంచి ప్రారంభం కానున్నాయి.

‘H’ness’ పేరు మాయం

ఈసారి హోండా చేసిన ప్రధాన మార్పుల్లో ఒకటి మోడల్ పేర్ల విషయంలోనే కనిపిస్తోంది. గతంలో ఉపయోగించిన ‘H’ness’ పేరును తొలగించి, లైనప్‌ను మరింత సింపుల్‌గా మార్చింది. ఇప్పుడు టాప్ వేరియంట్‌ను CB350 Chromeగా పిలుస్తోంది. దీంతో కస్టమర్లు CB350 కుటుంబంలోని మోడళ్లను సులభంగా గుర్తించేలా పేర్లను మార్చినట్లు కనిపిస్తోంది. కొత్త ఎంట్రీ లెవల్ CB350 STD ధర రూ.1,95,200గా ఉంది. ఆ తర్వాత CB350 DLX రూ.1,97,900, టాప్ CB350 Chrome రూ.1,99,900 ధరతో వస్తున్నాయి.

CB350Cలో మూడు వేరియంట్లు

Advertisement

CB350C విషయానికి వస్తే మూడు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. CB350C STD ధర రూ.2,00,300 కాగా, DLX ధర రూ.2,02,700గా ఉంది. టాప్ స్పెక్ CB350C స్పెషల్ ఎడిషన్ ధర రూ.2,04,700గా నిర్ణయించారు. ఈ మోడల్ క్లాసిక్ డిజైన్‌కు మరింత కస్టమ్ టచ్ ఇచ్చేలా రూపొందించబడింది.

CB350RSకు కొత్త కలర్

స్పోర్టీ లుక్‌తో వచ్చే CB350RS కూడా కొత్త లైనప్‌లో కొనసాగుతోంది. దీని STD వేరియంట్ ధర రూ.1,99,900 కాగా, DLX వేరియంట్ రూ.2,02,500. కొత్త RSలో Pearl Siren Blue అనే అదనపు కలర్‌ను కూడా అందించారు. ఇప్పటికే ఉన్న రంగులకు కాస్త కొత్త గ్రాఫిక్స్‌ ను జోడించారు. దీంతో బైక్‌కు మరింత ఫ్రెష్ లుక్ వచ్చింది.

ఇంజిన్‌లో నో ఛేంజెస్

Advertisement

ధరలు, పేర్లు, రంగులు మారినప్పటికీ బైక్ అసలు మెకానికల్ ప్యాకేజీలో ఎలాంటి పెద్ద కీలక లేదు. మూడు మోడళ్లలోనూ అదే 348.36cc ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్, 5 స్పీడ్ గేర్‌బాక్స్ కొనసాగుతున్నాయి. పవర్ సుమారు 20.7hp, టార్క్ 30Nmగా ఉంది. అంటే కొత్త లైనప్‌లో ప్రధానంగా డిజైన్, వేరియంట్ పొజిషనింగ్‌పైనే హోండా దృష్టి పెట్టింది.

ఫీచర్లలోనూ నో ఛేంజెస్

టెక్నాలజీ పరంగా కూడా పెద్ద మార్పులు చేయలేదు. డ్యూయల్ ఛానల్ ABS, స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్, హోండా రోడ్ సింక్  కనెక్టివిటీ లాంటి ఫీచర్లు కొనసాగుతున్నాయి. ఫ్రంట్, రియర్ డిస్క్ బ్రేకులు కూడా లైనప్‌లో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే ఉన్న CB350 ఫ్యామిలీకి పరిచయమైన రైడింగ్ ఎక్స్ పీరియెన్స్ కొత్త మోడళ్లలోనూ కొనసాగుతుంది.

బుకింగ్స్ ప్రారంభం

కొత్త CB350 సిరీస్ కోసం బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కస్టమర్లు రూ.5,000 చెల్లించి హోండా వెబ్‌సైట్ లేదంటే సమీప బిగ్ వింగ్ డీలర్‌షిప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.

Read Also: హోండా నుంచి పవర్‌ ఫుల్ బైక్.. CB500లో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయా?

Tags

Related News

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

హోండా నుంచి పవర్‌ ఫుల్ బైక్.. CB500లో ఇన్ని స్పెషల్స్ ఉన్నాయా?

డిజైర్ CNG AMT వచ్చేసింది.. ఏ నగరంలో ఎంత ధర ఉందంటే?

త్వరలో 5 కొత్త CNG కార్ల ఎంట్రీ.. మైలేజీతో పాటు ఫీచర్లు కూడా అదుర్స్!

టయోటా కార్లు ఇక మరింత స్టైలిష్.. గ్లాంజా, హైక్రాస్‌ కు అదిరిపోయే లుక్!

Big Stories

Advertisement
×