E-Paper
Advertisement

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!

ఈ కారు తనంతట తానే రివర్స్ వెళ్తుంది.. టక్సన్ టెక్నాలజీ చూస్తే మతిపోవాల్సిందే!
Advertisement

2027 Hyundai Tucson Revealed:  ప్రీమియం SUVలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హ్యుందాయ్ టక్సన్ కొత్త రూపంలో రాబోతోంది. తాజాగా 2027 మోడల్‌కు సంబంధించిన కీలక వివరాలను కంపెనీ వెల్లడించింది. న్యూ జెనరేషన్ టక్సన్‌ లో డిజైన్ మార్పులతో పాటు ఇంజిన్, హైబ్రిడ్ టెక్నాలజీ, సేఫ్టీ, కనెక్టివిటీలో పలు అప్‌డేట్లు చేశారు. 2026 అక్టోబర్‌ లో ఈ SUV దేశీయ మార్కెట్లో విడుదల కానున్నట్లు సమాచారం.

సైజ్ లో మరింత పెరుగుదల   

న్యూ జెనరేషన్ టక్సన్ సైజ్ లో పెరిగింది. దీంతో వెనుక సీట్లో ప్రయాణికులకు మరింత స్థలం లభించనుంది. వెనుక డోర్ల విషయంలోనూ మార్పు చేశారు. గత మోడల్‌ లో 73 డిగ్రీల వరకు మాత్రమే తెరుచుకునే డోర్లు ఇప్పుడు 83 డిగ్రీల వరకు ఓపెన్ అవుతాయి. దీంతో వెనుక సీట్లోకి ఎక్కడం, దిగడం మరింత సులభంగా మారనుంది.

సస్పెన్షన్‌కు కొత్త ట్యూనింగ్

Advertisement

కొత్త టక్సన్‌లో డ్రైవింగ్ సౌకర్యాన్ని మెరుగుపరిచేందుకు సస్పెన్షన్ వ్యవస్థలో కీలక మార్పులు చేశారు. ముందు సస్పెన్షన్ మౌంటింగ్ పాయింట్లను బలోపేతం చేయడంతో పాటు వెనుక సస్పెన్షన్‌కు మద్దతిచ్చే అండర్‌బాడీ నిర్మాణాన్ని కూడా స్ట్రాంగ్ గా మార్చారు. కొత్త సస్పెన్షన్ వాల్వ్‌ ను అమర్చడంతో రోడ్డు కుదుపులను తగ్గించేలా సెటప్‌ ను ట్యూన్ చేశారు. హైబ్రిడ్ వెర్షన్‌లోని ఇ ట్రాక్షన్ వ్యవస్థ డ్రైవ్ మోటార్ సాయంతో బాడీ కదలికలను నియంత్రించేందుకు పనిచేస్తుంది. ఇంజిన్ మౌంట్లు, డాష్‌బోర్డ్ సౌండ్ డెడెనింగ్, మందమైన డోర్ గ్లాస్ వంటి మార్పులతో క్యాబిన్‌లో ఇంజిన్, గాలి శబ్దాలను కూడా తగ్గించే ప్రయత్నం చేశారు.

టర్బో పెట్రోల్.. హైబ్రిడ్ పవర్!

2027 టక్సన్‌లో 1.6-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 193hp పవర్, 265Nm టార్క్‌ ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ జత చేశారు. గత మోడల్‌ లోని సమానమైన ఇంజిన్‌తో పోలిస్తే పవర్ 13hp పెరిగింది. హైబ్రిడ్ వెర్షన్‌లో ఇదే 1.6-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను కొత్త తరం హైబ్రిడ్ సిస్టమ్‌తో కలిపారు. ఈ పవర్‌ట్రెయిన్ గరిష్టంగా 245hp సంయుక్త పవర్‌ను అందిస్తుంది. మైలేజ్ 17.4 కి.మీ ఇస్తుందని కంపెనీ ప్రకటించింది.  ఇంధన సామర్థ్యాన్ని పెంచేందుకు  ఇనర్షియల్ డ్రైవింగ్ గైడెన్స్ అనే ఫీచర్ యాక్సిలరేటర్ నుంచి కాలు ఎప్పుడు తీయాలో డ్రైవర్‌కు సూచిస్తుంది.

9 ఎయిర్‌బ్యాగ్స్‌ తో సేఫ్టీ

Advertisement

భద్రత విషయంలో కొత్త టక్సన్‌లో అధునాతన ఫీచర్లను అందించారు. 9 ఎయిర్‌ బ్యాగ్స్‌ ను స్టాండర్డ్‌గా ఇవ్వడంతో పాటు ముందు, వెనుక ఢీకొనకుండా సహాయపడే వ్యవస్థలతో నావిగేషన్ ఆధారిత అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌ను అందించారు. మెమరీ ఆధారిత రివర్స్ అసిస్ట్ మరో ప్రత్యేక ఫీచర్. కారు గతంలో ప్రయాణించిన మార్గాన్ని గుర్తించి, అవసరమైనప్పుడు అదే దారిలో రివర్స్ వెళ్లేందుకు స్టీరింగ్‌ ను ఆటోమేటిక్‌గా కంట్రోల్ చేస్తుందని కంపెనీ చెబుతోంది. గ్రౌండ్ వ్యూ ద్వారా కారు కింద ఉన్న ప్రాంతాన్ని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌పై చూసే సదుపాయం కూడా ఉంది.

కొత్త డిజైన్.. కొత్త టెక్నాలజీ!

‘ఆర్ట్ ఆఫ్ స్టీల్’ డిజైన్ లాంగ్వేజ్‌ తో కొత్త టక్సన్‌ కు మరింత అత్యాధునిక లుక్ ఇచ్చారు. ముందు భాగంలో H-ఆకారపు LED DRLs, సన్నని సెంటర్ లైట్ స్ట్రిప్, వెనుక ప్రిజం ఎఫెక్ట్ టెయిల్ లైట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇంటీరియర్‌ లో ఫ్లోటింగ్ డ్యాష్‌ బోర్డ్, D కట్ స్టీరింగ్ వీల్, సన్నని డిజిటల్ డ్రైవర్ డిస్‌ ప్లే, 12.9, 17 అంగుళాల టచ్‌స్క్రీన్ లాంటి ఫీచర్లు ఉన్నాయి. ప్లియోస్ కనెక్ట్ సిస్టమ్, Gleo AI, థర్డ్‌ పార్టీ యాప్ సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటాయి. మొత్తంగా, చూస్తే కొత్త టక్సన్‌ లో పరిమాణం పెరగడంతో పాటు పవర్, హైబ్రిడ్ టెక్నాలజీ, సేఫ్టీ, కనెక్టివిటీ, డిజైన్ అంశాల్లో కీలక మార్పులు చేశారు. భారత్‌ లో ఈ మోడల్ ను ఎప్పుడు తీసుకొస్తుందనే విషయంపై ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Read Also: మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

Tags

Related News

హ్యుందాయ్ బేయాన్ బుకింగ్స్ ఓపెన్.. క్రెటా కంటే తక్కువ ధరలో కొత్త SUV!

మహీంద్రా థార్ OG వచ్చేసింది.. కొత్త మోడల్ లో ఏం మారిందంటే?

హైదరాబాద్‌లో వింత కార్ల మ్యూజియం.. ప్రపంచంలో ఎక్కడా చూడని కార్లు ఇక్కడే!

హోండా నుంచి 3 కొత్త అప్ డేటెడ్ మోడళ్లు.. ధరలు, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

145 కి.మీ రేంజ్ తో హోండా కొత్త ఈవీ.. QC3 లుక్ ఏముంది భయ్యా!

అమ్మకాల్లో బిగాస్ దూకుడు.. లక్షకు చేరువలో ఎలక్ట్రిక్ స్కూటర్ బ్రాండ్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350కి కొత్త కలర్.. సిగ్నేచర్ వైట్ అదిరిపోయిందిగా!

Big Stories

Advertisement
×